BigTV English

Gundeninda GudiGantalu Today Episode: రవికి డెడ్ లైన్ పెట్టిన శృతి.. రోహిణి, మనోజ్ లు వేరు కాపురం..

Gundeninda GudiGantalu Today Episode: రవికి డెడ్ లైన్ పెట్టిన శృతి.. రోహిణి, మనోజ్ లు వేరు కాపురం..

Gundeninda GudiGantalu Serial Today Episode September 26th: నిన్నటి ఎపిసోడ్ లో మీనాను, బాలు తన చెల్లిని రవికి ఎందుకు ఇవ్వరు అని అడుగుతాడు. దానికి మీనా మాకు అల్లుడు అంటే మర్యాద లేక కాదు నేను పడే భాధలు సుమతి పడొద్దని చెప్పడానికే ఈ పెళ్లి వద్దు అంటున్నాం అని అంటుంది. ఇక రవి పనిచేస్తున్న రెస్టారెంట్ కు శృతి వెళ్తుంది. తనకు ఏదోకటి చెప్పాలని చెబుతుంది.. ఇక రోహిణి వాళ్ల అమ్మను తన కారులో ఎక్కించుకొని మీనా దగ్గరకు తీసుకెళ్తాడు. అది చూసిన రోహిణి, విద్య టెన్షన్ పడతారు. అప్పుడే ఎపిసోడ్ అయిపోతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు సుగుణను చూసి ఏంటమ్మా చెప్పకుండా వెళ్లిపోయారు. మీనా ఎంత బాధ పడుతుంది అని అంటాడు. ఇక సుగుణ వద్దని అంటున్నా కూడా ఆమెను ఎక్కించుకొని వెళతాడు. సుగుణ రానని చెప్పిన వినకుండా బాలు ఆమెను తన ఇంటికి తీసుకొస్తాడు. ఆమె లోపలికి రావడానికి ఒప్పుకోదు. రోహిణి తమను అక్కడ చూస్తే ఆమె కాపురానికి ప్రమాదమని తెగ టెన్షన్ పడుతుంది ఇంట్లోకి రాకుండా బయటే మీనాతో మాట్లాడి వెళ్లిపోవాలని అనుకుంటుంది సుగుణ.. అప్పుడే పార్లర్ నుంచి విద్యతో కలిసి రోహిణి ఇంటికొస్తుంది. తమ ఇంటి ముందు తల్లితో పాటు చింటు ఉండటం చూసి షాకవుతుంది. మీనా, బాలులతో తల్లి మాట్లాడుతుండటంతో రోహిణి భయంతో వణికిపోతుంది. తన నిజస్వరూపం ఎక్కడ బయటపడుతుందోని టెన్షన్ పడుతుంది. ఇక మీ కూతురు ఇండియాకు రాలేదా అని బాలు అడుగుతాడు.

Gundeninda GudiGantalu Serial Today Episode September 26th
Gundeninda GudiGantalu Serial Today Episode September 26th

అప్పుడు సుగుణ రాలేదు బాబు సింగపూర్ లోనే ఉంది అంటుంది. దానికి మీనా, బాలు షాక్ అవుతారు. అప్పుడు దుబాయ్ అన్నారు.. ఇప్పుడు సింగపూర్ అని అంటున్నారని మీనా అనుమానంగా అడుగుతుంది. దుబాయ్‌లోనే ఉందని, వయసు మీదపడి మర్చిపోయానంటూ రోహిణి తల్లి సర్ధిచెబుతుంది.. కారు చాటున దాక్కున వారి మాటలను వింటుంటుంది రోహిణి. కూతురు అక్కడి రావడం చూసిన సుగుణ… బస్‌కు టైమ్ అవుతుందని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హడావిడి చేస్తుంది. ఆమె కంగారు చూసి బాలు బయలుదేరుతాడు. దాంతో బాలు సుగుణను తీసుకొని వెళ్తాడు. రోహిణి ఊపిరిపీల్చుకుంటుంది.


ప్రతి రోజు అబద్దాల మీద అబద్దాలు చెప్పడం కరెక్ట్ కాదని, నీ కొడుకు జీవితం గురించి ఆలోచించి అయినా ప్రభావతి, మనోజ్‌లకు నిజం చెప్పమని విద్య అంటుంది. లేదంటే విడిగా కాపురం పెట్టమని, అప్పుడే మనోజ్ నువ్వు ఏం చెప్పన నమ్ముతాడని రోహిణికి సలహా ఇస్తుంది విద్య. అదే టైమ్‌లో రోహిణి దగ్గరకు ప్రభావతి వస్తుంది. రోహిణిని తెగ పొగుడుతుంది.. మీనాకు డబ్బు ఉండుంటే ఎప్పుడో వేరు కాపురం పెట్టేదని, రోహిణి కోటీశ్వరురాలైన కలిసి ఉండాలని కోరుకుంటుందని కోడలిపై ప్రశంసలు కురిపిస్తుంది..

Gundeninda GudiGantalu Serial Today Episode September 26th
Gundeninda GudiGantalu Serial Today Episode September 26th

ఇక మనోజ్ రోజు లాగే జాబ్ కు వెళ్తున్నా అని చెప్పి పార్క్ లో ఫ్రెండ్స్ తో ముచ్చటలు పెట్టుకుంటారు. తమతోపాటు రోజు పార్కు వచ్చే స్నేహితుడు భార్యకు దొరికిపోతాడు. జాబ్‌కు వెళుతున్నానని చెప్పి అబద్ధం ఆడిన భర్తను చితక్కొడుతుంది. రేపు మీకు ఇదే గతి పడుతుందని మనోజ్ అండ్ గ్యాంగ్‌కు వార్నింగ్ ఇస్తుంది.. భార్యభర్తల గొడవలో కొన్ని షాపింగ్ కూపన్స్ పడిపోతాయి. వాటిని తీసుకున్న మనోజ్‌ ఆఫీస్‌లో ఇచ్చారని ఇంట్లో కలరింగ్ ఇవ్వాలని అనుకుంటాడు. రెస్టారెంట్ క్లోజ్ చేసే టైమ్ అయినా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి శృతి ఒప్పుకోదు. ఆమెను రవి బతిమిలాడుతాడు. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుందామని శృతిని కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు..

ఇక శృతి రవిని నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని నిలదీస్తుంది. చేస్తున్నానని రవి ఆమెకు బదులిస్తాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని శృతి అంటుంది. నువ్వు డిసైడ్ అయ్యావా లేదా అని రవిని అడుగుతుంది.. రేపటి వరకు నీకు టైమ్ ఇస్తున్నాను. అప్పటిలోగా నువ్వు సమాధానం చెప్పకపోతే నేను తీసుకునే నిర్ణయానికి నువ్వు జీవితాంతం బాధపడతావని రవికి డెడ్‌లైన్ ఇచ్చి శృతి వెళ్లిపోతుంది.. ఇక మనోజ్ ఇంటికి వచ్చి కుపన్స్ అని చెబుతాడు. జాబ్‌లేకుండా కూపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయని కొడుకును పక్కకు తీసుకెళ్లి నిలదీస్తుంది. ఓ జాబ్‌ ఇంటర్వ్యూకు వెళ్లానని వారు కూపన్స్ ఇచ్చారని తల్లి దగ్గర మనోజ్‌ అబద్దం ఆడతాడు. మనోజ్ మాటలను బాలు వింటాడు. ఈ ఉద్యోగం కూడా పోయిందా అని మనోజ్‌పై సెటైర్స్ వేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి… మనోజ్ ఉద్యోగం పోయిందనే మాట వినగానే షాకవుతుంది. ఇంట్లో వాళ్లందరికి మనోజ్ ఉద్యోగం పోయిందనే సంగతి తెలిసిపోతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రోహిణి ఈ విషయం పై పెద్ద రచ్చ చేస్తుందని తెలుస్తుంది. ఇక మనోజ్ వేరే కాపురం పెడతాడా లేదా అన్నది చూడాలి..

Related News

Jayammu Nischayammuraa: నాగ చైతన్య శోభిత మధ్య గొడవలు.. మాట్లాడడం లేదంటూ!

Intinti Ramayanam Today Episode: అవనిని ఇరికించబోతున్న పల్లవి.. శ్రీకర్ కు డెడ్ లైన్.. అక్షయ్ డబ్బులు కొట్టేసింది ఎవరు..?

GudiGantalu Today episode: రోహిణి పై బాలుకు అనుమానం.. రెండో పెళ్లికి సత్యం రెడీ.. ఫ్రెండ్ ను కలిసిన బాలు..

Nindu Noorella Saavasam Serial Today october 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు షాక్ ఇచ్చిన అంజు  

Illu Illalu Pillalu Today Episode: వేధవతికి క్లాస్ పీకిన రామరాజు.. ధీరజ్ కు స్ట్రాంగ్ వార్నింగ్.. భాగ్యం కు మైండ్ బ్లాక్..

Brahmamudi Serial Today October 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ప్లాన్ సక్సెస్‌ – కావ్యను కలవని డాక్టర్‌

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Intinti Ramayanam Today Episode: డబ్బుల కోసం రచ్చ చేసిన శ్రీయా.. అన్నదమ్ముల మధ్య గొడవ..పల్లవి ప్లాన్ సక్సెస్..

Big Stories

×