BigTV English

Gundeninda GudiGantalu Today Episode : మీనా పెళ్లి చేసిన విషయం బాలుకు తెలిసిపోయింది.. హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్న రవి, శృతిలు..

Gundeninda GudiGantalu Today Episode : మీనా పెళ్లి చేసిన విషయం బాలుకు తెలిసిపోయింది.. హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్న రవి, శృతిలు..

Gundeninda GudiGantalu Today Episode 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యంను అరెస్ట్ చేసిన విషయం బాలుకు తెలిసిపోతుంది. ప్రభావతి, మనోజ్, రోహిణిలు అందరు లాయర్ తో మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక బాలు అప్పుడే వస్తాడు. సత్యం ను అలా చూసి షాక్ అవుతాడు. రవి, శృతిలు పెళ్లి చేసుకున్నారని పోలీసులు కనిపెడతారు. అందులో మీనా సంతకం చేసినట్లు ఉంటుంది. అది విని అందరు షాక్ అవుతారు. ఇక సురేంద్ర తన కూతురును తీసుకురావాలని మరో నాలుగు రోజుల్లో పెళ్లి ఉందని చెబుతాడు. ఇక మీనా దగ్గరుండి పెళ్లి చేసిందని అందరూ అపార్థం చేసుకుంటారు. అసహ్యం పెంచుకుంటారు. బాలు నాలుగు పీకి బయటకు వెళ్ళమని చెబుతాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రవి, శృతిలు పెళ్లి తర్వాత తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ కి వెళ్తారు. అక్కడ తన ఫ్రెండ్ వాళ్ల కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంది. మేమిద్దరం ఒక రెండు మూడు రోజులు ఉంటామే అనేసి శృతి తన ఫ్రెండ్ తో అంటుంది. రెండు, మూడు రోజులు కాదు మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండండి అనేసి తన ఫ్రెండు శృతి తో చెబుతుంది. ఏంటి లొకేషన్ ని కనిపెట్టడం అంత ఈజీ కాదు మీరు ఎంజాయ్ చేయొచ్చు అనేసి తన ఫ్రెండు వెళ్ళిపోతుంది. శృతి సంతోషానికి, ఆనందానికి అవధులు లేవు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నానని సంతోషంలో మునిగి తేలుతుంది. రవి మాత్రం బాధగా ఉంటాడు. ఇంట్లో వాళ్లు తన గురించి ఏమనుకుంటారు అని బాధపడుతుంటాడు. ప్రేమను గెలిపించుకున్నాం పెళ్లి చేసుకున్నాం ఇప్పటికైనా సంతోషంగా ఉందాం అనేసి శృతి రవితో అంటుంది.

పెళ్లికొచ్చిన మా వదిన ఎలా ఉందో ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అని నాకు కంగారుగా ఉంది శృతి అని అనేసి రవి శృతి తో అంటాడు. శృతి మనం పెళ్లి చేసుకున్నాం ఇంత రిస్క్ చేసి మనం పెళ్లి చేసుకున్నాం ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు రవి అనేసి అంటుంది. పెళ్లికొచ్చిన మా వదిన ఎలా ఉందో అసలు ఇంట్లో ఈ విషయం తెలిసి ఎలా రియాక్ట్ అయ్యారు వదినని ఏమన్నారు అనేసి నాకు చాలా బాధగా ఉంది అంటూ శృతి తో అంటాడు. అందరికీ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ని పక్కన పెట్టేసి ఈరోజు మనం జరగాల్సిన విషయం గురించి ఆలోచిద్దాం.. రోజు లాగితే అవే సర్దుకుంటాయి అనే శృతి రవితో అంటుంది. మనం కోరుకున్నట్టు మన జీవితాన్ని మనం దక్కించుకున్నాం. ఇప్పుడు మన జీవితం మన ఇష్టం ఈరోజు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాం ఆ లోకాన్ని వదిలేసి నా లోకంలోకి రా రవి అనేసి శృతి అంటుంది.


రవి, శృతిలు తమ హనీమూన్ ని ఎంజాయ్ చేస్తారు. ఇక బాలు ఎస్సైని మా నాన్నను వదిలిపెట్టండి నన్ను అరెస్ట్ చేయండి అనేసి అడుగుతాడు. మీ నాన్నని వదిలిపెట్టడం నా చేతుల్లో లేదు దానికి రూల్స్ ఒప్పుకోవు మీ బాధను చూస్తే అర్థమవుతుంది అయితే మీరు ఆ రవిని తీసుకొచ్చి ఇక్కడ అప్పజెప్పితే మీ నాన్నని తీసుకెళ్లొచ్చు అనేసి ఎస్ఐ చెప్తాడు. ఆయనకు కావలసిన ఫుడ్ మెడిసిన్ ఇవ్వండి, మీ తమ్ముడును తీసుకొని వస్తేనే ఈయనను వదిలిపెడతాను అంటాడు. ముందు ఆ రవిని తీసుకురండి అనేసి ఎస్ఐ అంటాడు. నేను తీసుకొస్తే మీ పోలీసులు ఏం చేస్తారు అని అంటాడు.. ఎక్కువ మాట్లాడొద్దు అని ఎస్ ఐ అంటాడు. ఇక మామయ్యకి భోజనం మందులు నేను తీసుకొస్తానని వెళుతుంది. బాలు చంపేస్తానని అంటాడు.. మా నాన్నకి గతి పట్టింది నువ్వు వెళ్ళు నా కళ్ళ ముందు ఉండొద్దు అనేసి మీనా పై కోప్పడతాడు. ఇక సుమతి మీనా ను బయటికి తీసుకెళ్తుంది. ఈ పెళ్లి చేసింది పెళ్లి ఏర్పాట్లు చేసింది నేను అని బావతో చెప్తానని సుమతి మీ నాతో అంటుంది. ఎందుకు తల దురుస్తావు ఇది నాతోనే పోవాలి అని మీనా అంటుంది. అక్కడున్న కానిస్టేబుల్ దగ్గరకు వస్తాడు. పెళ్లి చేసావని వాళ్లంతా కోపంగా ఉన్నారమ్మ నువ్వు ఇక నుంచి వెళ్ళు అనేసి మీనాతో అంటాడు. పెళ్లి నేను చేయలేదు సార్. పెళ్ళంతా అయిన తర్వాత లోపలికి వెళ్ళాను అప్పుడు సంతకం పెట్టించారు అనేసి మీనా కానిస్టేబుల్ తో అంటుంది. ఏ తప్పు చేయలేదు సార్ మా మామయ్య గారిని విడిపించాలంటే ఎంత డబ్బైనా ఖర్చైనా పర్లేదు మేము ఏదో ఒకటి చేస్తాం చెప్పండి అంటుంది. కానిస్టేబుల్ ఈ కేసు పెట్టిన వాళ్ళు చాలా పెద్ద వాళ్ళమ్మ సమాజంలో పలుకుబడి ఉన్నవాళ్లు అతని తీసుకొని వస్తే తప్ప మీ మామయ్య నేను బయటకి తీసుకురావడం కష్టమే అనేసి చెప్పి వెళ్ళిపోతాడు.

ఇక ఎస్సై బయటకు రావడం చూసి బాలు ప్రభావతి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్తారు. నాన్నను వదిలిపెట్టండి సార్ నన్ను జైల్లో వేయండి అనేసి బాలు ఎస్ఐ ని అడుక్కోవడం చూసి అందరూ కంటతడి పెట్టుకుంటారు. ఇక మీనా అక్కడికి వస్తుంది ప్రభావతి చూసి దారుణంగా తిడుతుంది. మీ నాన్న నువ్వు దీన్ని ఏమన్నా వెనకేసుకుని వచ్చారు కదా ఇప్పుడు చూడు ఇది ఏం చేసిందో ఏకంగా ఆయన్ని జైల్లో పెట్టించింది ఇప్పుడేం అనవే అని బాలుని ప్రభావతి అంటుంది. ఇక బాలు మీనాను ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే చంపేస్తాను అనేసి చెయ్యెత్తుతాడు అప్పుడు రోహిణి ఇది మన ఇల్లు కాదు పోలీస్ స్టేషన్ అనేసి చెప్తుంది. దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలు సత్యం కు ఇడ్లీ పెడుతుంటాడు. అతను వద్దు అని పడేస్తాడు. ఇక మీనాను బాలు నీ వల్ల పోలీస్ స్టేషన్ కు మా వాళ్లు వచ్చారు. మా అమ్మ కూడా వచ్చింది అని అంటాడు. రవి ఎక్కడున్నా తీసుకొస్తానని వెళ్తుంది. శృతి, రవిలు ఎక్కడున్నారో మీనా తెలుసుకుంటుందా లేదా అని రేపు చూడాలి..

 

Related News

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big Stories

×