Indians Eating Tablets like Chocolates| భారతదేశంలో ప్రజలు కొన్ని రకాలు మందులను చాలా ఇష్టపడి తింటున్నారని ఒక డాక్టర్ సోషల్ మీడియా చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి, లాక్ డౌన్ సమయంలో డోలో 650 అనే టాబ్లెట్ బాగా ఫేమస్ అయింది. ఈ టాబ్లెట్స్ అంతకుముందు కూడా ప్రాచుర్యంలో ఉండగా.. కరీనో సమయంలో మాత్రం ప్రజలు దీన్ని విపరీతంగా తినడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి “డోలో 650” ప్రజలందరి నోళ్లలో బాగా నానుతున్న మందు.
వాస్తవానికి ఇది ఒక బ్రాండ్ పేరు. ఇందులో ఉండే మందు పారాసిటమాల్ (Paracetamol). జ్వరం, ఒంటినొప్పులు, శరీరంలో వాపు ఉన్న సమయంలో ఈ మందు తినాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. అలా ఫేమస్ అయిపోయిన ఈ టాబ్లెట్ ఇప్పుడు జ్వరం అనగానే ప్రజలు మందులషాపుకి వెళ్లి డోలో 650 (Dolo-650 viral) ఉందా? అని అడుగుతున్నారు. ఇప్పుడు దీని విపరీత వినియోగం గురించి ఒక డాక్టర్ ఒక డాక్టర్ పెట్టిన పోస్ట్ సోషియల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. పళనియప్పన్ మాణిక్కం అనే వైద్యుడు తన ‘ఎక్స్’ ఖాతాలో ఇటీవల ఒక పోస్ట్ షేర్ చేశారు. “భారతీయులు డోలో 650ని క్యాడ్బరీ చాక్లెట్లలా తీసుకుంటున్నారు” అని ఆ డాక్టర్ రాశారు. ఈ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. కేవలం రెండు రోజుల్లోనే 13 లక్షలకు పైగా నెటిజెన్లు ఈ పోస్ట్ ని చూశారు. ఈ పోస్ట్ కు చాలామంది కామెంట్లు చేస్తున్నారు. తమ ఇళ్లలో కూడా ఇదే పరిస్థితి ఉందని.. షీట్లు షీట్లుగా కొనుగోలు చేసి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటున్నామని చాలా మంది కామెంట్లలో రాశారు.
‘డోలో 650’ పేరుతో పారాసిటమాల్ 650 ఎంజీ డోసు డ్రగ్‌ని బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ అనే ఫార్మా కంపెనీ తయారు చేస్తోంది. అయితే దీనికి ప్రత్యామ్నంగా అదే పారాసిటమాల్ 650ని వేర్వేరు బ్రాండ్లు మన దేశీయ మార్కెట్లో అందిస్తున్నాయి. అయితే, అన్నింటికంటే ఎక్కువగా డోలో 650 ట్యాబ్లెట్లకే ఎక్కువ డిమాండ్ ఉంది. కోవిడ్ తర్వాత నుంచి దీని వినియోగం ఎక్కువైంది. కరోనా వైరస్ రాక ముందు భారతదేశంలో ప్రతి సంవత్సరం 7.5 కోట్ల.. డోలో 650 స్ట్రిప్పులు సేల్స్ అయ్యేవి. అదే కరోనా సమయంలో అంటే 2020లో దీని విక్రయాలు ఏడాదికి 9.4 కోట్లకు పెరిగాయి. అదే 2021 సంవత్సరంలో 14.5 కోట్ల స్ట్రిప్పులు సేల్స్ అయ్యాయి.
Also Read: ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఎయిర్ హోస్టెస్.. రేప్ చేసిన ఆస్పత్రి సిబ్బంది
సాధారణంగా జ్వరానికి పారాసిటమాల్ ఉపయోగిస్తారు. కానీ, పెద్ద వయసులో కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి కొందరు దీన్ని తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారాసిటమాల్ అధికంగా తీసుకోవడం వల్ల కడుపు, గుండె, మూత్రపిండాల సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని అనేక అధ్యయనాలు తెలిపాయి.
డోలో 650 అంటే పారాసిటామాల్ 650 ఔషధం శరీరంలోని ప్రోస్టాగ్లాన్‌డిన్ అనే ధ్రవాన్ని విడుదల కాకుండా నివారిస్తుంది. దీని వల్ల శరీరంలో నొప్పులు, జ్వరం ప్రభావం తగ్గుతుంది. బాడీ టెంపరేచర్ కూడా తాత్కాలికంగా తగ్గిపోతుంది.