Gundeninda GudiGantalu Today episode April 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. రూమ్ లోకి వెళ్లిన మనోజ్ అక్కడ ఎలా ఉండాలో అని ఆలోచిస్తాడు. కానీ రోహిణి మనోజ్ కె కౌంటర్ వేస్తుంది. మన రూమే అగ్గిపెట్టేలా ఉంటుంది. ఇది చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంది. మనింటికి ఎవరైనా వస్తే ఆరు బయట పడుకోవాలి. ఇక్కడ చాలా విశాలంగా ఉంది. ఏదో పారిస్ నుంచి వచ్చినట్లు ఫోజు కొడతావేంటీ అని మనోజ్‌కు రోహిణి చురకలు వేస్తుంది.. అవును మీ మామయ్య మలేషియా నుంచి వస్తున్నాడు కదా ఇక్కడ ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. దానికి రోహిణి ఆలోచనలో పడుతుంది. ఇక్కడ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకుండా డౌట్ వస్తుంది. వెంటనే ఫారెన్ నుంచి వచ్చినట్లు బిహేవ్ చేయమని చెప్పాలి అని అనుకుంటుంది రోహిణి. ఇక మనోజ్‌తో మలేషియా మావయ్య ఇక్కడ కంఫర్టుబుల్‌గా ఉంటారో లేదో. మంచి రూమ్ చూసి ఇవ్వాలి. మనం ఉంటున్న గదే ఇచ్చి మనం వేరే చోట ఉందామని రోహిణి అంటుంది. రోహిణి వాళ్ళ మామయ్య ఎవరు ఎన్ని రోజుల తర్వాత వస్తున్నారు కదా అతని గురించి అసలు నిజాలు బయట పెడతా అని బాలు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి వాళ్ళ మామయ్య వస్తున్నారు కదా వెజ్ నాన్ వెజ్ ఏది కావాలంటే అది చేసి పెట్టాలని మీ నాకు ఆర్డర్ వేస్తుంది. కానీ సుశీలమ్మ మాత్రం కానీ సుశీలమ్మ మాత్రం నేను నీకు అత్తగారిని కదా నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. నువ్వు చెప్పిన లిస్టు మొత్తం నువ్వే ప్రిపేర్ చేయాలి అని షాక్ ఇస్తుంది. నేనొక్కదాన్నే ఎలా చేయాలంటే నీ ముద్దుల కోడలు ఇద్దరు ఉన్నారు కదా వాళ్లు నీకు సాయం చేస్తారు అని అంటుంది. బాలు ఫుల్లు ఖుషి గా ఉంటాడు. ఇన్నాళ్లకు తిక్క కుదిరిందని సంతోషపడతాడు. షీలా ఆర్డర్ వేసింది అంటే కచ్చితంగా చేయాల్సిందే మీరందరూ వెళ్లి ఆ పని చేయండి అనేసి బాలు అంటాడు. కొత్తగా ఇది నా ఆర్డర్ ఇక్కడ అన్ని నా ప్రకారమే చేయాలని ప్రభావతికి షీలా ఆర్డర్ వేస్తుంది.
తన కోడల్ని తీసుకొని ప్రభావతి వంట చేయడానికి వెళుతుంది. ముందుగా రోహిణికి మిరపకాయలు ఇచ్చి నూరమని చెప్తుంది. శృతిని కూరగాయలు కట్ చేయమని ప్రభావతి అంటుంది. ఈ కూరగాయలన్నిటిని నేను నరకాలంటే ఎలా నరకాలి ఇంత పెద్ద కాయని ఎలా నరకాలి అంటూ అమాయకంగా అడుగుతుంది శృతి. గుమ్మడికాయ ఈ నా తలకాయ అంత పెద్దగా ఉంటుంది కదమ్మా అందుకే ఇలాంటి కత్తితోనే దానికి కొయ్యాలి అనేసి అంటుంది.
కత్తిపీటకు, కత్తికే తేడా తెలియడం లేదు. ఇక తరమాల్సిన కూరగాయాలను తరుముతూ, తరమాల్సిన వాటిని నరుకుతూ ప్రభావతికి చుక్కులు చూపిస్తోంది. ఇక రోహిణి మాత్రం రోలులో ఎండుకారం బాగానే దంచుతుంది. మలేషియాలో ఉన్నప్పటికీ ఎండుకారం బాగానే దంచావే అంటూ పనిమనిషి అంటుంది. దాంతో ప్రభావతి, శృతి షాక్ అవుతారు. నీకు దంచడం రాదు కదా అమ్మా ఎలా అంతబాగా దంచావు అంటు అడుగుతుంది ప్రభావతి. దాంతో రోహిణి నేను ఏదైనా చూస్తే ఇట్టే పట్టేస్తానని, త్వరగా నేర్చుకుంటానని చెబుతుంది. నువ్వు ఎప్పుడు వంట చేయడం చూడలేదే అని శృతి అనుమానం వ్యక్తం చేస్తుంది..
బంగాళదుంపల్ని ఎలా కట్ చేయాలనీ శృతి అడుగుతుంది దాన్ని ఇలా సుతిమారంగా కట్ చేయాలనేసి ప్రభావతి చెప్తుంది. అప్పుడు చెయ్యి కోసుకుంటుంది అక్కడికి వచ్చిన సుశీల సున్నం తీసుకొచ్చి శృతి వేలికి పోస్తుంది.. ఆ తర్వాత తాలింపు పెట్టాలని ప్రభావతి వెళ్లి శృతికి చెప్తుంది అయితే తాను చేసిన పనికి మొత్తం ఘాటుతో పాటు అందరి మీద తాలింపు పడుతుంది.
ప్రభావతికి చెప్పి ఇక ఎలోగోలా వంటలు వండుతుంది ప్రభావతి. ఏ ఒక్కరూ సహకరించకపోయినా నానా తిప్పలు పడి తన అత్త సుశీలమ్మ ఆదేశాల మేరకు వంటలు రెడీ చేస్తుంది. ఇక అందరూ కలిసి సహబంప్తి భోజనం చేసేందుకు కూర్చుంటారు. ఈ సందర్భంలో మీనా నేనే వడ్డిస్తాను మీరందరూ కూర్చొండి అని అంటుంది. కానీ ప్రభావతి ఏం వద్దు అని చెబుతుంది. వంట అంతా మేమే చేశాక వడ్డించి ఆ క్రెడిట్ నువ్వే కొట్టేస్తావా? అని కోపం చేస్తుంది. నేనే వడ్డిస్తానని చెబుతుంది..
మీనాని సుశీల కూర్చోమని చెప్తుంది. శృతికి చేయి తగడంతో నేను తినలేను అంటే ప్రభావతి నేను తినిపిస్తానమ్మ అని అంటుంది. అందరూ కోడళ్లను సమానంగా చూసుకోవాలని, డబ్బు తెచ్చిన వారిని ఒకలా, తేని వారిని మరోలా చూడటం ఏమాత్రం సరికాదని చెబుతుంది. నాలుగు తరాల నుంచి కోడళ్లను కూతురుగా చూస్తున్న ఇల్లు ఇది అని వివరిస్తుంది. ఇక మీనాను లేచి వచ్చి ప్రభావతి పక్కన కూర్చొమని, ముగ్గురికి ప్రేమగా తినిపించు అని తన కోడలను సుశీలమ్మ ఆదేశిస్తుంది. కానీ ప్రభావతి రోహిణి, శృతికి ప్రేమగా తినిపించి మీనాకు మాత్రం విసుక్కుంటూ నోట్లో కుక్కుతుంది. దాంతోనూ సుశీలమ్మ మండిపడుతుంది. భోజనాలను పూర్తి చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..