Raj Kumar : తెలుగు ఇండస్ట్రీలోని చిరంజీవి లాంటి ఆకృతిలో ఉన్న నటుడు రాజ్ కుమార్.. తెలుగు ఇండస్ట్రీలో గత 30 ఏళ్లుగా నటుడిగా కొరసాగుతున్న రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సీరియల్సు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇతన్ని బుల్లితెర మెగాస్టార్ అని ఎందుకంటారంటే.. చూడ్డానికి చిరంజీవిలా ఉండటంతో ఆయనకి ఈ పేరు వచ్చింది. పైగా అప్పట్లో రాజ్ కుమార్ బుల్లితెరపై పెద్ద స్టార్. దాసరి శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజ్ కుమార్.. చాలా సినిమాల్లో నటించారు. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతున్నాడు.. అయితే ఇన్నేళ్లకు ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ వల్ల ఆర్థికంగా నష్టపోయానని బయట పెట్టాడు. వీరిద్దరూ కలిసి సినిమా చేశారా? మరేదైన కారణమా? అనేది తెలుసుకుందాం..
రాజ్ కుమార్ ఇంటర్వ్యూ..
తాజాగా రాజ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఆయన తన సినిమాల గురించి ఎన్నో విషయాల గురించి బయట పెట్టాడు. ఆయన సినీ జీవితం గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా గతంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇంటర్వ్యూలో బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చారు. బారిష్టర్ శంకర్ నారాయణ అనే సినిమా గురించి బయటపెట్టాడు. ఆ సినిమా చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ వల్ల చాలా కోట్లు నష్టపోయినట్లు బయటపెట్టాడు. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి టాక్ ని సొంతం చేసుకుంటుంది. అయితే తర్వాత నెలలో రిలీజ్ కావల్సిన పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా అదే నెలలో రిలీజ్ అయ్యి ఆ సినిమాకు దెబ్బ వేసినట్లు చెప్పారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. అత్తారింటికి దారేది సినిమా ఇంటర్నెట్లో లీకవడంతో ఆ సినిమాని వారంలోపలే రిలీజ్ చేశారని, దానివల్ల మా సినిమాకు కోట్లు లాస్ వచ్చినట్లు ఆయన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆ వీడియో వైరల్ అవడంతో అటు మెగా ఫాన్స్ ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారు. సినిమా కంటెంట్ బాగుంటే సినిమా ఎలా ఉన్నా కూడా హిట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:శారీ మూవీ స్టోరీ లీక్.. ఆర్జీవీ టాలెంట్ కు మైండ్ బ్లాకే..!!
రాజ్ కుమార్ సినిమాల విషయానికొస్తే..
చూడ్డానికి చిరంజీవిలా ఉండటంతో ఆయనకి ఈ పేరు వచ్చింది. పైగా అప్పట్లో రాజ్ కుమార్ బుల్లితెరపై పెద్ద స్టార్. దాసరి శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజ్ కుమార్.. చాలా సినిమాల్లో నటించారు. ‘అమ్మ రాజీనామా’ సినిమాతో రాజ్ కుమార్‌ని హీరోగా పరిచయం చేశారు దాసరి.. ఆ మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా హీరోగా సినిమాలు చేసి బిజీ యాక్టర్ అయ్యాడు. కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో కొనసాగిన ఆయన ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు అయితే చాలా రోజుల తర్వాత ఓ సినిమాతో వచ్చాడు ఆ సినిమా దెబ్బ వేయడంతో ఆ తర్వాత సీరియల్స్ కి అంకితం అయ్యాడు.