Brahmamudi serial today Episode: రాజ్ , కావ్య మధ్య చాటింగ్ నడుస్తుంది. చాటింగ్ లో అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత రాజ్, కావ్యను ఒకసారి కలుద్దామని అడుగుతాడు. కావ్య ఎందుకని అడుగుతుంది. దీంతో రాజ్ కారణం చెప్తేనే కలుస్తారా..? అని అడుగుతాడు. చెప్తే తప్పకుండా కలుస్తానని అంటుంది కావ్య. దీంతో రాజ్ కలిస్తే తప్పకుండా చెప్తాను అంటాడు. దీంతో కావ్య గతం మర్చిపోయినా మొండితనం మాత్రం అసలు మర్చిపోలేదు అనుకుంటుంది. సరే ఈ సారి మనమే తగ్గుదాం అని ఎక్కడ కలుద్దాం అని మెసేజ్ చేస్తుంది. రాజ్ మణికొండ కాఫీ షాప్ అని చెప్పగానే సరే గుడ్ నైట్ అంటుంది కావ్య.
మరోవైపు యామిని కోపంగా వాళ్ల డాడీని చూస్తూ.. ఏంటి డాడీ ఇది నా లైప్‌ను ఏం చేయాలనుకుంటున్నావు. నేను ఎలాంటి క్రిటికల్ సిచ్యుయేషన్ నుంచి బయటపడ్డానో తెలిసి కూడా నాకే ద్రోహం చేయాలనుకున్నావా అంటూ నిలదీస్తుంది. దీంతో నేను నీ తండ్రిని బేబీ నేను నీకు ద్రోహం చేస్తానా..? అని అడుగుతాడు. మరి నువ్వు చేసింది ఏంటి..? రామ్ అడగ్గానే కావ్య గురించి ఎందుకు చెప్పాలనుకున్నావు.. అంటుంది. దీంతో ఆయన రాజ్ అలా అడగ్గానే.. అని ఏదో చెప్పబోతుంటే.. రాజ్ కాదు రామ్ గుర్తు పెట్టుకో డాడీ రాజ్ కాదు రామ్.. అంటుంది. దీంతో అదే బేబీ అబ్బాయి వచ్చి అలా బాధ పడుతుంటే.. నాకేదో తప్ప చేసిన ఫీలింగ్ వచ్చింది.
భార్యాభర్తలను విడదీయడం పాపం అనిపించింది. తనకు గతం గుర్తుకు లేకపోయినా.. కావ్యను చూడగానే.. తెలిసిన మనిషిలా ఫీలవుతున్నాడు అంటే తన భార్యను ఎంతలా ప్రేమించి ఉండాలి.. అందుకే గిల్టీగా అనిపించి.. అంటుంటే.. నిజం చెప్పాలనుకున్నావు.. రామ్ కళ్లలో ప్రేమను చూశాను. మరి నా అణువణువులోనూ రామ్ మీద పెంచుకున్న ప్రేమ ఉంది కదా డాడీ..అది నీకు కనిపించలేదా..? ఇన్నేళ్లుగా తన జ్ఞాపకాలతో బతుకుతూ తను లేకపోతే జీవితమే లేదనుకుని చావడానికి కూడా సిద్దపడ్డాను. అది నీకు కనిపంచడం లేదా..? రామ్ కోసం నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలియదా..? అంటూ నిలదీస్తూ అక్కడే ఉన్న కత్తి తీసుకుని డాడీ నా ప్రేమను అర్థం చేసుకోకపోయినా.. నా రామ్ ను నా నుండి దూరం చేయాలని చూసినా వాళ్లను నేను క్షమించను అంటూ వాళ్ల నాన్న మీదకు కత్తి తీసుకుని వెల్తుంది.
దీంతో వైదేహి కంగారుగా బేబీ ఏం చేస్తున్నావు.. ఆయన మీ నాన్నా.. అంటుంది. దీంతో యామిని కంగారు పడకు మమ్మీ.. కన్నతండ్రిని చంపేంత శాడిజం నాలో లేదు. కానీ రామ్ లేకపోతే మాత్రం నన్ను చంపుకునేందుకు అసలు వెనకాడను. అంటూ యామిని తనను తాను కత్తితో పొడుచుకునేందుకు ట్రై చేస్తుంది. దీంతో వాళ్ల డాడీ అడ్డుపడి నా కూతురు కన్నా నాకు ఏదీ ముఖ్యం కాదు. ఆగు అంటూ చెప్పగానే.. యామిని ఏంటి డాడీ నిజమా మీరు చెప్పేది.. ఏదీ ప్రామిస్ చేయండి అంటూ ఆయన చేతిని తన తల మీద పెట్టుకుని ఇప్పుడు ప్రామిస్ చేయండి డాడీ అని అడుగుతుంది. రామ్ తో నీ పెళ్లి చేస్తాను తల్లి.. అంటాడు. హ్యాపీగా యామిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు రాజ్, కావ్య ఇద్దరూ మొదటి సారి లవ్‌లో పడ్డ వాళ్ల లాగా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. రేపు కలిసిన తర్వాత ఎలా మాట్లాడాలి.. ఏం మాట్లాడాలి.. అనుకుంటూ ఆలోచిస్తూ.. నిద్రపోతారు. తర్వాతి రోజు కావ్య రెడీ అయి కిందకు వస్తుంది. రుద్రాణి చూసి రోజురోజుకు మీ కోడలు చాలా డెవలస్ అవుతుంది వదిన. హీరోయిన్ రేంజ్‌లో రెడీ అయింది అంటుంది. కిందకు వచ్చిన కావ్యను ఇందిరాదేవి ఏం కావ్య ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తున్నావా..? అని అడుగుతుంది. రుద్రాణి కూడా మా అమ్మ అడుగుతుంది కదా కావ్య.. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తున్నావా..? బర్తుడే పార్టీకి వెళ్తున్నావా..? అని అడుగుతుంది. దీంతో కావ్య ఏం లేదు అమ్మమ్మగారు ఆఫీసుకు వెళ్తున్నాను అని చెప్పగానే.. వాహ్ మొగుడు ఉన్నప్పుడేమో ముష్టి చీరలు కట్టింది.
ఇప్పుడేమో మోడ్రన్ లా తయారయింది. అవునులే నిన్ను అడిగే వారు ఎవరున్నారని.. అంతా నీ ఇష్టా రాజ్యమే కదా..? అయినా నాకెందుకులే అమ్మా.. అడగాల్సిన నీ అత్తా మామలే నోరు మెదపడం లేదు. నువ్వు ఎలా రెడీ అయితే మాకెందుకు చెప్పు.. అంటుంది. దీంతో కావ్య కోపంగా నేనేం చేసినా ఒక కారణం ఉంటుంది రుద్రాణి గారు అంటూ అత్తయ్యా ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను.. ఆయన వచ్చే వరకు ఆయన బాధ్యతలు కూడా నేనే చూసుకోవాలి అనుకున్నాను అందుకే ఈ రోజు నుంచి ఆఫీసుకు వెళ్లాలనుకుంటున్నాను అని చెప్తుంది. దీంతో ఇందిరాదేవి మాకు కావాల్సింది అదే కావ్య.. నువ్వు హ్యాపీగా ఆఫీసుకు వెళ్లి రా కావ్య అని చెప్తుంది. దీంతో కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు కావ్యను కలవడానికి బయటకు వెళ్తున్న రాజ్‌ను వైదేహి ఆమె భర్త ఆపేస్తారు. టిఫిన్ చేయమని అడుగుతారు. దీంతో రాజ్ నిన్నటి నుంచి మనసు అదోలా ఉండి ఆంటీ.. అమ్మా నాన్నలు గుర్తుకు వచ్చారు. ఒక్కసారి వారి సమాధుల దగ్గరకు వెళ్లి వస్తానని చెప్తాడు. దీంతో వైదేహి సరే వెళ్లి రండి అని చెప్తుంది. వెంటనే రాజ్ బయలుదేరుతాడు. మరోవైపు కావ్యను రుద్రాణి ఫాలో అవుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?