E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతిని బుట్టలో వేసుకున్న మాణిక్యం.. బాలు దెబ్బకు మైండ్ బ్లాక్..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతిని బుట్టలో వేసుకున్న మాణిక్యం.. బాలు దెబ్బకు మైండ్ బ్లాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode April 6th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి ఏం చెయ్యాలి అంటూ టెన్షన్ పడుతుంది. ఆమె చేస్తున్న హంగామా చూసి అందరు షాక్ అవుతారు. రోహిణి వాళ్ళ మేనమామ గురించి మాట్లాడినప్పుడల్లా కొడుకు బాలు తన మాటల తూటాలతో ప్రభావతి నోట మాట రాకుండా చేస్తాడు. మలేషియా నుంచి వస్తున్న రోహిణి వాళ్ళ మేనమామ అసలు వస్తాడో రాడో తెలియదు కానీ ప్రభావం మాత్రం ఓవర్ బిల్డప్ ఇస్తుంది అంటూ అత్త సుశీల మందలిస్తుంది.. మీ మామయ్య వస్తున్నాడా లేదా అని అడుగుతుంది సుశీలమ్మ. దగ్గర వరకు వచ్చాడని, కార్ లోనే వస్తున్నాడని బదిలిస్తుంది. దగ్గరికి వచ్చాడని చెప్పడంతో ప్రభావతి ఇంకా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లో కాలు కాలిన పిల్లి లాగా అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతోంది.. రవి, శృతీలు తమ రూమ్ ఇవ్వడానికి ఒప్పుకోరు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ప్రోమో విషయానికొస్తే.. రోహిణి వాళ్ళ మామయ్య కోసం ప్రభావతి టెన్షన్ పడుతూ హడావిడి చేస్తుంది. అంతలోకే ఓ వ్యక్తి కాపాడండి అంటూ వచ్చి ఇంట్లోనే కుడితి తోట్టలో పడిపోతాడు. అతనే మలేషియా మావయ్యని రోహిణి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అయ్యాయో ఇలా పడిపోయారేంటి? మీరు ఇలా కారులో కాకుండా కాలినడకని ఎందుకు వచ్చారు అని ప్రభావతి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. నాకు ఊరన్న సీనరీ అన్న చాలా ఇష్టం కారిని అక్కడే పంపించేసి అక్కడినుంచి నడుచుకుంటూ వచ్చేసానని మాణిక్యం అంటాడు.

Advertisement

అయితే కుడితి నీళ్లల్లో కూరగాయలు వేస్తే మేకలు బాగా తింటాయి బాగా బలంగా తయారవుతాయని మటన్ షాపు ఓనర్ లాగా మాట్లాడుతాడు. బాలు కి డౌట్ వస్తుంది. నువ్వు మలేషియా నుంచి వచ్చావా మటన్ కొట్టు నుంచి వచ్చావా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఉన్న నాలుగు రోజులు అతని అసలు యవ్వారం బయట పెట్టాలను అనుకుంటాడు. ఒక కన్నెయ్యాలని అనుకుంటాడు.

ప్రభావతి అతని చూసి సంతోషపడుతుంది. ఏమైనా నీకు దేవుడిచ్చిన అమ్మ అని మాణిక్యం ప్రభావతిని ను రాగానే బుట్టలో వేస్తాడు.. ఇక ప్రభావతి కాళ్ళు, చేతులు ఆడట్లేదు అని అతని లోపలికి తీసుకెళ్ళి స్నానంకు ఏర్పాట్లు చెయ్యమని చెబుతుంది. రోహిణి వాళ్ళ మామయ్యకు స్నానానికి ఏర్పాట్లు చేస్తుంది. మళ్లీ ఒక చోటికి తీసుకెళ్లి గుసగుసలు మాట్లాడుతుంది. వీరిద్దరి మధ్య ఏదో రహస్యం ఉంది అంటూ బాలు ఆలోచిస్తాడు. ఇక మాణిక్యం లోపలికి వెళ్లి స్నానాలు పూర్తిచేసుకుని వస్తాడు.

Advertisement

ప్రభావతి మీనా తో ఆయనకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోమని చెప్పానని అరుస్తూనే ఉంటుంది. ఇక మాణిక్యం తెచ్చిన బట్టలు అలాగే బ్రేస్లెట్ ని బయటపడతాడు. అది చూసిన ప్రభావతి సంతోషంతో ఉబ్బిపోతుంది. ఇక బాలు అక్కడికి వచ్చి ఏం తెచ్చాడు ఒక బ్రెస్లెట్ బట్టలే కదా దానికి ఇంత ఫీల్ అవ్వాలి అని అంటాడు.. వీళ్ళ నాన్నగారు చాలానే తీసుకెళ్ళమన్నాడు నాకే అంత ఓపిక లేక ఇది తీసుకొచ్చాను ఈసారి వచ్చేటప్పుడు అవి కూడా తీసుకొస్తాను మా పాప సంతోషమే మా సంతోషం అని పాపపురాణం ఎత్తుతాడు. బాలుకు మాత్రం ఎక్కడో ఇతని చూసానే అని అనుమానం వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మాణిక్యం గుట్టు రట్టు చేస్తాడేమో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×