BigTV English
Advertisement

Jack Movie : ఏంటి వాటర్ కూలెక్కలేదా… వామ్మో.. సిద్దు ఏంటి ఇది

Jack Movie : ఏంటి వాటర్ కూలెక్కలేదా… వామ్మో.. సిద్దు ఏంటి ఇది

Jack Movie :స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం జాక్. రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ భాస్కత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో, హీరోయిన్ వరుస ఇంటర్వ్యూలకు, ఈవెంట్లకు హాజరవుతున్నారు. అందులో భాగంగా సిద్దు, వైష్ణవి ఇద్దరూ భీమవరం ప్రమోషన్స్ కి వెళ్తున్నట్టు ఒక వీడియోని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ సిద్దు జొన్నలగడ్డని లేడీస్ ఫ్యాన్స్ కోరిక మేరకు గోదావరి స్లాంగ్ లో చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.


“ఏంటి కూల్ ఎక్కలేదా వాటరు!”

సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం జాక్ సినిమా ప్రమోషన్లలో భాగంగా భీమవరం వెళ్ళారు. అక్కడ సిద్దు జొన్నలగడ్డని ఓ లేడీ అభిమాని గోదావరి స్లాంగ్ లో మీకు నచ్చిన మీ డైలాగ్ ఒకటి చెప్పమని అడగగా.. సిద్దు ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చింది. కాస్త స్లాంగ్ అర్థం చేసుకోనివ్వండి. స్టేజ్ మీదకు వెళ్ళిన తరువాత గోదావరి స్లాంగ్ లో డైలాగులు చెబుతాను అని చెబుతాడు. అప్పుడు వెంటనే ఆ లేడీ అభిమాని వాటర్ కూల్ ఎక్కలేదా అని గోదావరి స్లాంగ్ లో మాట్లాడగానే.. వెంటనే సిద్దు “ఏంటి కూల్ ఎక్కలేదా వాటరు!”.. “ఏ మనం కాదా మనం కాదా”.. “ఓసి ఇంతేనా”.. అంటూ గోదావరి స్లాంగ్ లో టకటకా డైలాగ్స్ చెప్పడంతో అక్కడ ఉన్న లేడీస్ ఫ్యాన్స్ అంతా కూడా ఓ అంటూ సిద్దు జొన్నలగడ్డకి ఓ వేసుకున్నారు.. పక్కనే ఉన్న వైష్ణవి చైతన్య పకపక నవ్వేసింది.. మొత్తానికి సిద్దు గోదావరి స్లాంగ్ లో మాట్లాడి అక్కడే ఉన్న లేడీస్ ఫ్యాన్స్ వాళ్ళతో పాటు గోదావరి వాళ్ళ అందరి మనసుల్ని దోచేసుకున్నాడు..


చార్మినార్ ఎపిసోడ్ ఇంటర్నేషనల్ రేంజ్ లో

జాక్ సినిమాలో సిద్దు, వైష్ణవి చైతన్య తో పాటు ప్రకాష్ రాజు కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో టెర్రరిస్టులను అంతం చేసే ఓ ఏజెన్సీ సీక్రెట్ ఏజెంట్ జాక్ పాత్రలో సిద్దు కనిపిస్తారు. జాక్ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యాక్షన్ సీన్స్ లో సిద్దు అదరగొట్టారు. అంతేకాకుండా డైలాగ్స్, రొమాన్స్, స్వాగ్ తో మెప్పించారు. ఈ సినిమాలో చార్మినార్ ఎపిసోడ్ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉంటుందని ఈ సినిమాపై మంచి క్రేజ్ క్రియేట్ చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాకి అచ్చు రాజమణి, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు. ఈ చిత్రానికి విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫీ చేశారు. ఎస్విసిసి పతాకం పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ తరువాత సిద్దు నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానులకు జాక్ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఏప్రిల్ 10న రిలీజ్ కానున్న ఈ సినిమా ఏ మేరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×