IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB ) వరుస విజయాలతో దూసుకు వెళ్తోంది. అయితే తాజాగా… వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టును చిత్తు చేసి గ్రాండ్ విక్టరీ కొట్టింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్లో 12 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. అయితే వాంఖడే వేదికగా ( Wankhede Stadium, Mumbai ) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడం దాదాపు పది సంవత్సరాల తర్వాత జరిగింది.
Also Read: RCB VS MI: మనల్ని ఎవడ్రా ఆపేది…3619 రోజుల తర్వాత ముంబై కోట బద్దలు కొట్టిన RCB
ఇక్కడే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త టెన్షన్ మొదలైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ( Wankhede Stadium, Mumbai ) వేదికగా… ఏ సీజన్ లో అయినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) విజయం సాధిస్తే… ఆ తర్వాత వరుసగా ఓటములు ఎదుర్కునే ప్రమాదం ఉంటుందని పాత రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో…. ఆ సీజన్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ గెలిచే అవకాశాలు రాయల్ చాలెంజర్ జట్టుకు… సన్నగిల్లుతాయని స్పష్టం చేస్తున్నారు కొంతమంది క్రీడా విశ్లేషకులు.
గతంలో కూడా వాంఖడే వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధిస్తే… ఆ తర్వాత అత్యంత దారుణంగా ఓడిపోయిందని… అంటున్నారు. ఇక సోమవారం రోజున కూడా ముంబై ఇండియన్స్ జట్టును వాంఖడే వేదికగా చిత్తు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ లెక్క ప్రకారం… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన తర్వాతి మ్యాచ్లలో… అత్యంత దారుణంగా ఓడిపోతుందని చెబుతున్నారు. ఈ 18వ సీజన్ ఐపిఎల్ లో కూడా… కప్పు కొట్టడం… చాలా కష్టమే అని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.
పాయింట్స్ టేబుల్ లో దూకుడుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) పాయింట్ల పట్టికలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దుమ్ము లేపింది. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్ లో నాలుగు మ్యాచ్ లు అడిగింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇందులో ఒక్క మ్యాచ్ ఓడిపోయిన బెంగళూరు… మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఆరు పాయింట్లు సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. దీంతో పాయింట్లు పట్టికలో మూడవ స్థానంలో నిలిచింది. అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. 8వ స్థానానికి దిగజారింది. చివర్లో సన్రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఢిల్లీ క్యాపిటల్స్.. మొదటి స్థానాన్ని దక్కించుకుంది. వరుసగా మూడు విజయాలలో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ప్లేయర్లందరూ అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ తో దుమ్ము లేపుతున్నాడు. ఇదే ఊపు కొనసాగిస్తే ఈసారి కప్పు కొట్టడం గ్యారంటీ.
Also Read: Agastya Pandya: హార్దిక్ పాండ్యా కన్న కొడుకే వెన్నుపోటు.. ఇదెక్కడి సంత రా
— Out Of Context Cricket (@GemsOfCricket) April 7, 2025