E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మరో బాంబ్ పేల్చిన రోహిణి.. ఒట్టు వేయించిన సుశీల.. మీనా పై ప్రశంసలు..

Gundeninda GudiGantalu Today episode: మరో బాంబ్ పేల్చిన రోహిణి.. ఒట్టు వేయించిన సుశీల.. మీనా పై ప్రశంసలు..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 13th : నీకు ముందే తెలిస్తే నాకు ఎందుకు చెప్పలేదు రా నీ ప్రభావతి మనోజ్ పై రెచ్చిపోయి మరి కొట్టేస్తుంది.. అది అబద్ధాలు అని చెప్తున్నా కూడా నువ్వు వాటిని పెంచి పోషిస్తున్నావా..? ఎందుకు నువ్వు ఇలా చేశావు చవట దద్దమ్మ పెళ్ళాం చేతిలో మోసపోయినోడు అని దారుణంగా తిట్టేస్తుంది ప్రభావతి. అయితే రోహిణి నిజం చెప్పింది అని అంటే నాకు డౌటే అని మీనా అనగానే.. నిజంగానే మీనా నాకు రోహిణి ఎప్పుడో చెప్పింది అమ్మకి వచ్చిన కోపం చూసావు కదా అందుకే నేను ఆ నిజాన్ని చెప్పలేదు అని మనోజ్ అంటాడు. ఇక సుశీలమ్మ ప్రభావతిని కూల్ చేస్తుంది.. ఇక రోహిణి ఎందుకు నువ్వు ఇప్పుడు ఇన్ని మోసాలు చేశావు అని సుశీల అడగగానే మనోజ్ ని నేను ప్రేమించాను అని చెప్తుంది. రోహిణి ఎమోషనల్ మాటలు విన్నా సుశీలమ్మ బాధపడుతుంది. కానీ రోహిణి చెప్పే మాటలు మాత్రం ఎవ్వరు నమ్మరు. రోహిణి చెప్పిన ఎమోషనల్ మాటలని అందరూ విని షాక్ అవుతారు.

రోహిణి దెబ్బకు ప్రభా ఫ్యూజుల్ అవుట్..

ప్రభావతి నాకు రోహిణి అన్నీ అబద్ధాలు చెప్పిందే అని బాధ పడిపోతూ ఉంటుంది.. అయితే రోహిణి నన్ను దారుణంగా మోసం చేసింది అని కొడుతూనే ఉంటుంది. ప్రభావతి ఎవరు ఎంతగా ఆపడానికి ప్రయత్నించినా సరే నన్ను ఎవరు ఆపదు నన్ను ఇది ఎంతగా మోసం చేసింది అంటూ ద్రోహిని చంపలు వాయించేస్తుంది. ఇదొక్కటి మాత్రమే అబద్ధం చెప్పావా లేకపోతే ఇంకేదైనా అబద్ధం చెప్పావా అని ఎంతగా అడిగినా సరే రోహిణి చాలానే చెప్పినట్లు బయటపెడుతుంది. సుశీలమ్మ ఇది ఒక్కటే నువ్వు చెప్పిన అబద్దమా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అని అడగగానే రోహిణి ఒక్కసారిగా భయపడుతుంది.. అయితే 10 లక్షలు ఎలా వచ్చాయి అని చెప్పగానే పార్లర్ ని అమ్మేశాను అని రోహిణి అంటుంది. ఆ మాట వినగానే ప్రభావతి దిమ్మ తిరిగిపోయేలా షాక్ అవుతుంది.. పార్లర్ పెట్టడానికి అత్తయ్య మామయ్యకు తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టి నీకు డబ్బులు ఇస్తే దాన్ని అమ్మేశావా అని మీనా కూడా అనడంతో రోహిణికి భయం మొదలవుతుంది.

నిజం చెప్పిన సత్యం..

Advertisement

పార్లర్ అమ్మేసిన విషయం నాకు ముందే తెలుసు అని పద్యం అనగానే ఏంటి మీకు ముందే తెలుసా అయితే నాకెందుకు మీరు ఈ విషయాన్ని చెప్పలేదు అని ప్రభావతి అంటుంది. నీకు నేను చెప్తే ఇలాగే రియాక్ట్ అవుతావని నేను అస్సలు అనుకోలేదు అందుకోసమే నేను చెప్పలేదు అని సత్యం అంటాడు.. ఇప్పుడు నువ్వు ఇలా మారుతావని నేను ఆరోజు ఊహించాను. కాబట్టే చెప్పాలని అనుకోలేదు అని సత్యం అనగానే ఈ విషయం నాకు కూడా తెలుసు అని బాలు అంటాడు.. బాలు మాట విన్న ప్రభావతి నువ్వు కూడా నా దగ్గర నిజం దాచావని అంటుంది. నేనే ఆ నిజాన్ని నాన్నకు చెప్పాను అని బాలు చెప్పగానే ప్రభావతి సుశీల ఇద్దరూ కూడా షాక్ అవుతారు.. మీనా అవునా నాకెందుకు ఈ విషయాన్ని చెప్పలేదు అని అడుగుతుంది.. నాన్న చెప్పద్దు అని చెప్పడం వల్లే నేను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు అని బాలు అంటాడు..

దీపం మీద ఒట్టు వేయించిన షీలా..

నువ్వు ఇంకేమైనా అబద్ధాలు చెప్పావని రోహిణిని సుశీల అడుగుతుంది.. నువ్వు ఇంకా ఏమీ అబద్ధాలు చెప్పలేదు బామ్మ గారు. అని రోహిణి చెప్పగానే ప్రభావతి ఈవిడ గురించి నాకు ఏ సంబంధం లేదు అసలు నాకు చిరాకులేస్తుంది అని అంటుంది.. ప్రభావతి మాట విన్న సుశీలమ్మ మీనాన్ని హారతి పళ్లెంను తీసుకురమ్మని చెప్తుంది.. ఆ హారతి పళ్లెం తీసుకురాగానే.. నువ్వు ఇంకెప్పుడూ ఇలాంటి అబద్ధాలు నీ భర్తకు గాని నీ అత్తకు గానీ అత్తింటి వాళ్లకు గాని చెప్పొద్దు అని బొట్టు వేస్తుంది సుశీలమ్మ.. సుశీలమ్మ మాట విన్న రోహిణి ఇకమీదట ఎటువంటి అబద్ధాలు చెప్పను అని హారతి మీద ఒట్టేస్తుంది. ప్రభావతి మాత్రం నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు తనకి నాకు ఏ సంబంధం లేదు అని మొహం మీదే చెప్పేస్తుంది. ఇక మీదట ఎటువంటి అబద్ధాలు చెప్పినా అసలు ఊరుకోము ఇదే లాస్ట్ ఛాన్స్ అని షీలా రోహిణికి ఒక ఛాన్స్ ఇస్తుంది..

మీనా గ్రేట్ అంతే..

Advertisement

ప్రభావతి తన గదిలోకి వెళ్లి వాళ్ళ అత్తయ్య రోహిణి ఇంట్లోకి తీసుకొని వచ్చింది అని చాలా బాధపడిపోతూ ఉంటుంది. రోహిణి వల్ల ఇంత జరిగితే తనని మళ్లీ ఇంట్లోకి తీసుకురావడం ఏంటి అని సత్యంపై గొడవకు దిగుతుంది ప్రభావతి.. మా అమ్మ ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుంది అందరికీ న్యాయం చేయాలనుకుంటుంది. నువ్వు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని సత్యం అంటాడు.. ఎంతైనా కూడా నేను నెత్తిన పెట్టుకున్న కోడలు కన్నా ఎప్పుడు తింటే మీనా అనే మంచిది అని ప్రభావతి నిజం తెలుసుకోవడంతో సత్యం ఇప్పటికైనా మీనా గురించి తెలుసుకున్నాం సంతోషం అని అంటాడు.. ఆ తర్వాత సుశీలమ్మ లోపలికి వచ్చి ఒక అవకాశం ఇవ్వడం మంచిదే కదా ఇంక ఏవి ఆలోచించొద్దు వాళ్ళని కూడా సంతోషంగా ఉండనివ్వు అని చెప్పి వెళ్ళిపోతుంది.

రోహిణికి అవమానం..

మనోజ్ లోపలికి రాగానే రోహిణి ఏడుస్తూ నన్ను క్షమించు మనోజ్ అని అంటుంది.. కానీ మనోజ్ మాత్రం నువ్వు చెప్పిన వెయ్యి అబద్ధాలు నన్ను బాధ పెట్టేసాయి. ఇక నిన్ను ఎలా నమ్ముతాను అని అంటాడు.. నువ్వు ఎంత చెప్పినా కూడా నేను ఏది వినను అని మనోజ్ అంటాడు. కానీ రోహిణి మాత్రం తనని నమ్ముమని అడుగుతుంది. బాలు అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలోచనలో ఉంటారు.. ఇలాంటి మోసం చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని బాలు తో సహా మిగిలిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మనోజ్ రోహిణి నా దగ్గర ఇంకా ఏదైనా దాచిందేమో అని అనుమానం మొదలవుతుంది. ప్రభావతి మాత్రం రోహిణి కనీసం మనిషిగా కూడా చూడదు.. ప్రభావతికి ఎంతగా సుశీల నచ్చ చెప్పాలని ప్రయత్నించినా సరే తను మాత్రం నేను ఈ విషయాన్ని మర్చిపోలేక పోతున్నాను అత్తయ్య అని అంటుంది. రోహిణి మనోజ్ కి దగ్గర అవ్వాలని చూసిన కూడా మనోజ్ మాత్రం అస్సలు వినకుండా తనకి దూరం అవ్వాలని అనుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : బామ్మర్దికి నారాయణ వార్నింగ్.. అయ్యో తాయారుకు షాక్.. నిజం తెలుస్తుందా..?

Related News

Podarillu Gopika : చక్రీ ప్యాన్స్ కు గుడ్ న్యూస్.. గోపిక అవుట్..

Intinti Ramayanam TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ సక్సెస్.. శృతి దొరుకుతుందా..? ప్రభాకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..

Karthika Deepam 2 Serial Today Episode September 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని బెదిరించడంతో జ్యోత్స్నను జాబ్ లోంచి తీసేసిన కేఫ్ ఓనరు             

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్.. ప్రేమ మాటతో ఫ్యూజుల్ అవుట్.. ప్రేమ పెళ్లికి రెడీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Big Stories

Advertisement
×