E-Paper
Advertisement

ఆరోగ్యంపై గూగుల్ స్పెషల్ ఫోకస్.. Pixel Watch 5లో ‘హెల్త్ గార్డియన్’ ఫీచర్ మ్యాజిక్!

ఆరోగ్యంపై గూగుల్ స్పెషల్ ఫోకస్.. Pixel Watch 5లో ‘హెల్త్ గార్డియన్’ ఫీచర్ మ్యాజిక్!
Advertisement

Google Pixel Watch 5: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తమ సరికొత్త స్మార్ట్‌వాచ్ ‘పిక్సెల్ వాచ్ 5’ను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. పవర్‌ఫుల్ ప్రాసెసర్, సరికొత్త డిజైన్, అడ్వాన్స్‌డ్ హెల్త్ ఫీచర్లతో ఈ వాచ్ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్న ఈ Google Pixel Watch 5.. ఆగస్టు 20 నుండి అమ్మకానికి రానుంది.

డిజైన్, అద్భుతమైన డిస్ ప్లే..

మునుపటి మోడల్స్ లాగే ఇది కూడా గుండ్రటి (రౌండ్) డిజైన్‌తో వచ్చింది. అయితే డిస్‌ప్లే విషయంలో భారీ మార్పులు చేశారు. ఇందులో 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఇచ్చే యాక్టువా 360 AMOLED డిస్‌ప్లేను ఉపయోగించారు. ఇది మండుటెండలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే స్క్రాచ్‌లు పడకుండా గొరిల్లా గ్లాస్ రక్షణ అందించారు.

పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, జెమినీ సపోర్ట్..

Advertisement

ఈ Google Pixel Watch 5లో డ్యూయల్ చిప్ ఆర్కిటెక్చర్‌ను వాడారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ W5 జెన్ 2 ప్రాసెసర్ వల్ల ఇది మునుపటి వాచ్ కంటే 20 శాతం వేగంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ‘జెమినీ’ ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. చేతిని పైకెత్తి జెమినీతో నేరుగా మాట్లాడవచ్చు. జీమెయిల్, క్యాలెండర్ వంటి వాటి నుంచి ముఖ్యమైన నోటిఫికేషన్లను ఇది ముందే గుర్తు చేస్తుంది.

Also Read: రూ.3,000 లోపే బ్రాండెడ్ TWS ఇయర్‌బడ్స్.. Amazon Saleలో భారీ ఆఫర్లు!

హెల్త్ గార్డియన్, అత్యవసర రక్షణ..

Advertisement

ఇక ఆరోగ్యం విషయానికొస్తే.. Google Pixel Watch 5లో ‘హెల్త్ గార్డియన్’ అనే కొత్త ఫీచర్ ఉంది. ఇది నెల మొత్తానికి సంబంధించిన బీపీ, నిద్ర, ఇన్సులిన్ ట్రెండ్స్‌ను విశ్లేషించి చెప్తుంది. అత్యంత ముఖ్యమైనది ‘బ్రీథింగ్ ఎమర్జెన్సీ డిటెక్షన్’. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా పడిపోతే ఈ వాచ్ వెంటనే గుర్తిస్తుంది. వీటితో పాటు ఈసీజీ, బ్లడ్ ఆక్సిజన్, హృదయ స్పందనల ట్రాకింగ్, 50కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.

బ్యాటరీ, వేరియంట్లు, ధరలు..

ఈ Google Pixel Watch 5 వాచ్ 41mm, 45mm సైజుల్లో లభిస్తుంది. 41mm వేరియంట్ ధర రూ.42,999 కాగా.. 45mm వేరియంట్ ధరను రూ.45,999గా నిర్ణయించారు. 41mm మోడల్ 30 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తే, 45mm మోడల్ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 40 గంటల వరకు పనిచేస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 15 గంటల పాటు వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే దీనికి వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ ఉంది.

Also Read: సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

Tags

Related News

కూల్ లుక్స్, టెన్సర్ G6 పవర్.. Pixel 11 Seriesలో ఇన్ని ప్రత్యేకతలా?

రూ.3,000 లోపే బ్రాండెడ్ TWS ఇయర్‌బడ్స్.. Amazon Saleలో భారీ ఆఫర్లు!

రూ.899కే బోట్ హెడ్‌ఫోన్స్.. ఆఫీస్ మీటింగ్స్, కాల్స్ కోసం ఫర్ఫెక్ట్

తక్కువ ధరలో ప్రీమియం లుక్.. రూ.1500 లోపు బెస్ట్ స్మార్ట్ వాచ్ ఇదే

తక్కువ ధరలో.. పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీ కావాలా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

రియల్‌మీ కొత్త ఫోన్ వచ్చిందోచ్.. ఫీచర్లు చూస్తే పూనకాలే.. ధర కూడా తక్కువే!

రూ.24,999 ధరకే..నథింగ్ ఫోన్, ఫీచర్లకు పిచ్చెక్కడం గ్యారంటీ

Big Stories

Advertisement
×