Gundeninda GudiGantalu Today episode September 29th : మీనా శృతి వాళ్ళందరిని తీసుకొని పైకి వస్తారు. బాలు రాజేష్ ఇద్దరు కలిసి చేసిన ప్లాన్ గురించి అందరికీ వివరిస్తారు. మనమందరం కలిసి ఒక మంచి పని చేయబోతున్నాము ఎలాగైనా సరే మీరందరూ దీనికి సపోర్ట్ చేయాలి అని చెప్పగానే అందరూ ఓకే అని అంటారు అయితే అందరూ కూడా చింతామణి ఇంటికి ఆఫీసులో లాగా వెళ్లాలి అని బాలు ప్లాన్ చేస్తాడు. ఇక తను ప్లాన్ చేసినట్టుగానే అందరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లుగా మారిపోతారు. అంత కలిసి చింతామణి ఇంటి మీద రైట్ చేయాలి అని వెళ్తారు.. అయినా మాత్రం ఇలా చేయడం తప్పండి అని ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం అస్సలు వినకుండా తప్పేమీ లేదు అని అంటాడు. ఒక వైపు రవి మీనా వదిన కష్టాన్ని గుర్తించాను కాబట్టే నేను కూడా వస్తాను అని చెప్పినా కూడా చాలా భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటాడు..
ఇక చింతామణి కామాక్షి పూజ కోసం పిలిచింది అని చెప్తుంది. అయితే వాళ్లంతా కూడా పూజకు వెళుతుంది అని అనుకుంటారు.చింతామణి కూడా పూజకు వెళ్తున్నా అని అందరికీ చెప్తుంది. అయితే తన అసిస్టెంట్ చేసిన పప్పు తినడం వల్ల తన కడుపులో ఏదో తేడాగా ఉంది అని బాధ పడిపోతూ ఉంటుంది.. ఇక కామాక్షికి ఫోన్ చేసి బాలు చింతామణి బయలుదేరిందని చెప్తాడు ఇక అందరూ కూడా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లుగా లోపలికి వెళ్తారు రవి కంగారు వల్ల ఎక్కడ దొరికిపోతాము అని ఆలోచిస్తారు.. కానీ ఏదో ఒకటి మేనేజ్ చేసి వాళ్లందర్నీ నమ్మించేస్తుంది. మొత్తానికి బాలు ప్లాను సక్సెస్ చేయాలా కనిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో చింతామణి సడన్గా ఇంటికి రావడంతో అందరూ పరిగెడుకుంటూ వచ్చేస్తారు.
చింతామణి కడుపులో ఏదో తేడాగా ఉందని బయటికి వెళ్ళింది కాస్త మళ్ళి లోపలికి వచ్చేస్తుంది. అయితే బాలు గ్యాంగ్ అంతా డబ్బుల కోసం వెతుకుతారు మొత్తానికి మేన డబ్బులు అక్కడ కనిపించడంతో అంత చాలా హ్యాపీగా ఉంటారు. అయితే వాళ్లంతా హ్యాపీగా ఉండడంతో కింద ఉన్న వాళ్ళందరూ చింతామణి మేడం వస్తే ఏం చెప్పాలి ఇన్ని టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక సడన్గా చింతామణి ఇంట్లోకి వస్తుంది అని తెలుసుకుని బాలు గ్యాంగ్ ఒక్క సరిగా కంగారు పడిపోతూ ఉంటారు అందరూ పారిపోతారు కానీ శృతి మాత్రం దొరికిపోతుంది. చింతామణి ఏ ఆగు ఎవరు నువ్వు అని అడుగుతుంది. అసలు నువ్వు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని శృతిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది కానీ శృతి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెబుతూ వస్తుంది.. చింతామణి అలా లోపలికి వెళ్ళిందో లేదో శృతి పారిపోతుంది..
బయట వాళ్లందరూ కూడా పారిపోతారు అయితే శృతి ఏది కనిపించలేదు దొరికిపోయిందా తనకేమైనా అయితుందేమో అని రవి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శృతిని చూసి రవి అమ్మయ్య నువ్వు వచ్చేసావా పద వెళ్ళిపోదామని అంటాడు.. నాకేం కాలేదు లే బుడ్డోడా నేను బాగానే ఉన్నాను వచ్చేసాను అని శృతి ఎంత చెప్తున్నా సరే రవి మాత్రం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక మొత్తానికి ఐడి కార్డులను గోదావరిలో కలిపేయాలి అని శృతి అంటుంది. మొత్తానికి మీనా కోసం బాలు చేసిన ప్లాను సక్సెస్ అవుతుంది. మీనా వీళ్ళ కోసం టెన్షన్ పడుతుంది అని బాలు ఫోన్ చేస్తే డబ్బులు దొరికాయి అని చెప్తుంది అమ్మయ్య డబ్బులు దొరికాయి అని మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఇంట్లోకి రాగానే బాలు వాళ్ళని చూసి ఏంట్రా అవతారాలు ఇలా ఉన్నారేంటి అని ప్రభావతి అడుగుతుంది. కానీ మీనా డబ్బులు దొరికేయని చెప్పగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీ వల్లే ఆ డబ్బులు చింతామణి ఇంటికి చేరాయి అని నేను చెప్తున్నాను అని బాలు అనగానే ప్రభావతి నాకేం సంబంధం నేను డాన్స్ మాత్రమే నేర్పిస్తున్నాను అని అంటుంది. అయితే నువ్వు డాన్స్ మాత్రమే నేర్పిస్తున్నావు అలాంటి వాళ్ళకి డాన్స్ నేర్పించి మన ఇంట్లో విషయాలని చెప్తున్నావా అని బాలు తోపాటు సత్యం కూడా సీరియస్ అవుతాడు. ఇక మనోజ్ రోహిణి లకు బాలు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు మొత్తానికి మీనా డబ్బులు దొరికాయిని చాలా సంతోషంగా ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : చక్రికీ దిమ్మతిరిగే షాక్.. గోపికకు మైండ్ బ్లాక్.. మాధవ్ కు టెన్షన్..