Gundeninda GudiGantalu Today episode August 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. గతంలో పూలనందించిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు. ఆ ఎమ్మెల్యే ఇతను నా స్నేహితుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. కొత్త కారు కొంటానంటే నేనే వద్దు సెకండ్ హ్యాండ్ లో కారు కొంటే బాగుంటుంది అని పిలిచాను. కార్ల గురించి నీకు బాగా తెలుసు కదా అందుకే నువ్వైతే సెలెక్ట్ చేస్తావని నీకే చెప్పాను అని అంటాడు. బాలు నన్ను గుర్తు పెట్టుకొని పిలిచారు కచ్చితంగా మీకు ఈ పని చేసి పెడతాను అన్నా.. సెకండ్ హ్యాండ్ కార్లను కొనాలని వెళ్తాడు.. ఆ షో రూంలో మనోజ్ ను చూసి అవమానిస్తాడు బాలు.. మొత్తానికి బాలు వాళ్లకు కారును కొనిస్తాడు. కారు కొన్నందుకు పార్టీ ఇస్తాను రా బాలు అని ఆ ఎమ్మెల్యే చెప్పిన కూడా బాలు నేను రాను అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు అతనికి కారు కొనిపిచ్చిన తర్వాత అందరూ కలిసి బార్ కి వెళ్తారు. బాలు నేను తాగని అని ఎంత చెప్పినా సరే ఆ ఎమ్మెల్యే తాగు అని బలవంతం చేస్తాడు. ఆ పక్కనే ఉన్న గుణ వీడు తాగడు మంచోడు అని వీడి భార్య తెగ మురిసిపోతుంది..తాగినట్లు క్రియేట్ చేసి చూపించాలి అంటాడు. వీడి బండారం బయటపడేలా చేస్తాను అని ఫోన్ లో వీడియో తీస్తాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అది క్షణాల్లో వైరల్ గా అవుతుంది..
మీనా తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది అందులోకి శివ వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్తానమా వెళ్దాం పద అని అడుగుతాడు. శివ కి ఫోన్ రావడం చూసి ఈ ఫోన్ ఎక్కడిది రా అని నేను అడుగుతుంది. ఇది కొత్త ఫోన్ లాగా ఉంది ఎవరి కొనిచ్చార్రా ఇంత డబ్బులు నీకు ఎక్కడివి రాని నేను అడుగుతుంది. అయితే శివ మాత్రం ఏది పొంతన లేకుండా సమాధానం చెప్తాడు. నేను జాబ్ చేసి కష్టపడి కొనుక్కున్నాను అని శివ అంటాడు.
పార్వతి వీడి దగ్గర ఈ మధ్య కొత్త బట్టలు కొత్త బూట్లు ఇప్పుడు ఫోను అన్ని కొత్తవే కనిపిస్తున్నాయి. వీడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. నాకు టెన్షన్ ఏస్తుంది అని అంటుంది.. గుణాను అంటే బాగోదు అని శివ అంటాడు. అయితే మీ ఆయన ఏమన్నా చాలా మంచోడా ఒకసారి ఈ వీడియో చూడు ఊరంతా తాగుబోతుని ఎలా మాట్లాడుకుంటున్నారో అని ఒక వీడియోను చూపిస్తాడు శివ. ఆ వీడియోని చూసిన మీనా షాక్ అవుతుంది. ఏంటమ్మా అల్లుడుగారు మారేడు అన్నావు కదా ఇప్పుడేంటి ఇలా తయారయ్యాడు అని పార్వతి అంటుంది. మీనా అక్కడి నుంచి వచ్చేస్తుంది.
ఇక మనోజ్ రోహిణి హడావిడిగా వచ్చి అందర్నీ పిలుస్తారు.. బాలు చేసిన నిర్వహకంను అందరికీ చూపిస్తారు. మమ్మల్ని ఎన్ని మాటలు అంటారు చూశారా పచ్చి తాగుబోతు లాగా ఎలా చేస్తున్నాడు అని మనోజ్ రోహిణి రెచ్చిపోతారు. కానీ శృతి రవి మాత్రం బాలుని ఒక్క మాట అననివ్వకుండా అడ్డుపడతారు.. అయితే ప్రభావతి రెచ్చిపోయి మాట్లాడుతుంది.. సత్యం ను అందరూ అంటుండే శృతి రవి ఇద్దరు కూడా అంకుల్ అంటే బాగోదు అని అంటారు..
లాంగ్ ట్రిప్ కోసం బాలు కారును బుక్ చేసుకున్న కస్టమర్లు తన తాగుడు వీడియోని చూసి కారును పక్కకు కాపమని చెప్పి కార్ లోంచి దిగేసి వెళ్లిపోతారు. బాలుకు ఏమైందో అర్థం కాక షాక్ అవుతాడు. ఆ వీడియోని చూసిన సంజయ్ కమిషనర్ కి ఫోన్ చేసి విషయాన్ని చెప్తాడు. కమిషనర్ బాలు గారిని సీజ్ చేసి లైసెన్స్ ని క్యాన్సిల్ చేయమని ఆర్డర్ పాస్ చేస్తాడు.. బాలు కార్ ని బుక్ చేసుకున్న కస్టమర్లు క్యాన్సిల్ చేస్తూ ఉంటారు.
Also Read: మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు..ఆ రెండు డోంట్ మిస్..
అయితే బాలు ఏమైంది అర్థం కాక వెళ్తుంటే మధ్యలో ట్రాఫిక్ పోలీసులు ఆపుతారు.. తాగి డ్రైవ్ చేస్తున్నావా అని దారుణంగా అవమానిస్తారు. లైసెన్సులు తీసుకుని కార్ని సీజ్ చేస్తారు.. నేను తాగి డ్రైవ్ చేయలేదని చెప్పినా మీరు కారుని తీసుకెళ్తున్నారు ఏంటి అని పోలీసులతో అంటాడు. నువ్వేం మాట్లాడాలి అనుకున్న కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి మాట్లాడుకొని కానిస్టేబుల్ చెప్తారు. ఇంట్లో ప్రభావతి రోహిణి మనోజ్ ముగ్గురు కూడా రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు.. అప్పుడే మీనా వస్తుంది అందరూ మీనాని అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లు బాలు పై సత్యం సీరియస్ అవుతాడు. ఆ తర్వాత ఏమవుతుందో చూడాలి..