Gundeninda GudiGantalu Today episode August 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు అతనికి కారు కొనిపిచ్చిన తర్వాత అందరూ కలిసి బార్ కి వెళ్తారు. బాలు నేను తాగని అని ఎంత చెప్పినా సరే..ఆ ఎమ్మెల్యే తాగు అని బలవంతం చేస్తాడు. ఆ పక్కనే ఉన్న గుణ వీడు తాగడు మంచోడు అని వీడి భార్య తెగ మురిసిపోతుంది.. తాగినట్లు క్రియేట్ చేసి చూపించాలి అంటాడు. వీడి బండారం బయటపడేలా చేస్తాను అని ఫోన్ లో వీడియో తీస్తాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అది క్షణాల్లో వైరల్ గా అవుతుంది.. బాలును అందరు తాగుబోతుగా ముద్రించారు. ముఖ్యంగా మీనా, సత్యం కూడా బాలు తాగాడని నమ్ముతారు. ప్రభావతి మనోజ్ రోహిణి మీనాను దారుణంగా అవమానిస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు కారును ట్రిప్ కోసం బుక్ చేసుకున్న వాళ్లంతా కూడా క్యాన్సిల్ చేసుకుంటారు. అసలు అందరికి ఏమైందని అనుకుంటూ బాలు వెళ్తాడు. మధ్యలో ట్రాఫిక్ పోలీసులు ఆపుతారు.. తాగి డ్రైవ్ చేస్తున్నావా అని దారుణంగా అవమానిస్తారు. లైసెన్సులు తీసుకుని కార్ని సీజ్ చేస్తారు.. నేను తాగి డ్రైవ్ చేయలేదని చెప్పినా మీరు కారుని తీసుకెళ్తున్నారు ఏంటి అని పోలీసులతో అంటాడు. నువ్వేం మాట్లాడాలి అనుకున్న కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి మాట్లాడుకొని కానిస్టేబుల్ చెప్తారు. ఇంట్లో ప్రభావతి రోహిణి మనోజ్ ముగ్గురు కూడా రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు.. అప్పుడే మీనా వస్తుంది అందరూ మీనాని అంటారు.
వాడు ఇలా తయారవ్వడానికి కారణం మీనా నేని ప్రభావతి మీనా ను దారుణంగా అవమానిస్తుంది. ఇది కంట్రోల్లో పెట్టుకుంటే వాడు ఎందుకు ఇలా తయారవుతాడు అని ప్రభావతి అంటుంది. బాలు తప్పు చేస్తే మీనాని ఎందుకంటారు అదేదో అతన్ని అడిగి తెలుసుకోండి అని మీ నాకు సపోర్టుగా నిలుస్తుంది.. దీని పెళ్లి చేసుకున్న తర్వాతే వాడిలా మారాడు అని ప్రభావతి అంటే మీనా మాత్రం పెళ్లికి ముందు అలవాటు లేదా ఏంటి? దాని కారణం మీరే కదా అని అంటుంది.
మీనని సూటిపోటి మాటలతో బాధపడేలా చేస్తుంది ప్రభావతి.. ఈ కార్ ఎవరు తీసుకున్నారు లైసెన్స్ సీజ్ చేశారు మీ నాకు తెలిస్తే బాధపడుతుంది అంటూ బాలు ఇంట్లోకి వస్తాడు.. బాలు ఇంట్లోకి రావడం చూసి నా కారుని పోలీసులు తీసుకున్నారు లైసెన్స్ చేశారు అని సత్యంతో అంటాడు.. ఆ మాట వినగానే సత్యం కొట్టబోతాడు. మీనా ఆపుతుంది. నా పార్కు గురించి పల్లీలు గురించి వీడియో తీసిన ఎలాగైతే చూపించావో అలాగే నీ వీడియోని కూడా నేను అందరికీ చూపించాను అని మనోజ్ అంటాడు.
తాగి డ్రై చేస్తే ఎవరైనా కార్ని సీజ్ చేస్తారు అని అంటాడు. తాగుబోతులు మనుషుల మీదకి కార్లు ఎక్కించుకొని వెళ్తావని సీజ్ చేసి ఉంటారని మనోజ్ రోహిణి టైం చూసుకుని దారుణంగా మాట్లాడుతారు.. ప్రభావతి కూడా బాలుని ఘోరంగా అవమానించేలా మాట్లాడుతుంది.. బాలు ఎంత చెప్పినా మీనా కూడా నమ్మకుండా వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పతితులు వాళ్ళ అన్నయ్య చాలా మంచివాడు అని మౌనిక బ్రమ పడుతుంది కదా ఈ వీడియోని చూపిస్తానని సంజూ అనుకుంటాడు. ఆ వీడియోని చూసిన మౌనిక మా అన్నయ్య మంచివాడు ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని అంటుంది.
Also Read: తేజా ‘మిరాయ్ ‘ మళ్లీ వాయిదా.. అసలు రిలీజ్ అవుతుందా?
మీనా పూలు డెలివరీ చేయడానికి వెళ్తే అక్కడ గుణకనిపించి ముందు మీ ఆయన కంట్రోల్ లో పెట్టుకో అక్క ఆ తర్వాత మమ్మల్ని అనొచ్చు అని అంటాడు. బాలు కారు డ్రైవర్ల దగ్గరికి వెళ్లి నేను తాగలేదని చెప్పినా కూడా పోలీసులు వినకుండా కారుని తీసుకుని వెళ్లారు.. మీరు కూడా నేను తాగానని నమ్ముతున్నారా అని అడుగుతాడు. ట్రిప్పు కి వెళ్ళేటప్పుడు నువ్వు ఎప్పుడు తాగావు కదరా అది మాకు తెలుసు అని రాజేష్ అంటాడు. మౌనిక బాలు కి ఫోన్ చేసి నువ్వు తాగలేదని నేను నమ్ముతున్నాను అన్నయ్య నువ్వేం బాధపడకు నిజం బయటికి వస్తుంది అని ధైర్యం చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలు తప్పు ఉందో లేదో తెలుసుకోవాలని బారుకి మీనా వెళ్తుంది.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…