Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నిక సాఫీగా ఈజీగా జరిగిపోతుందని అంతా అనుకున్నారు. ఒకరకంగా చూస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మొగ్గు ఉంది. కానీ అనుకోని ట్విస్ట్. ఇండియా కూటమి చివరి నిమిషంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీల్లో ఏం జరుగుతుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. క్రాస్ ఓటింగ్ ఉంటుందా.. ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారు?
బిగ్ ట్విస్ట్‌గా వైస్ ప్రెసిడెంట్ పోరు
భారత ఉపరాష్ట్రపతి పదవి ఏకగ్రీవం అవుతుందని అంతా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే పోటీ అనివార్యమైంది. ఇండియా కూటమి తాజాగా బి. సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించడంతో కథ ఒక్కసారిగా మారిపోయింది. చెప్పాలంటే సౌత్ ఇండియా రాజకీయాల్లో ఇదో బిగ్ ట్విస్ట్‌గా మారింది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ను బీజేపీ ప్రకటించింది. ఈయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి. మరోవైపు ఇండియా కూటమి ఆల్ ఆఫ్ సడెన్ గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఈయన స్వరాష్ట్రం తెలంగాణ. దీంతో రెండు సౌత్ ఇండియా స్టేట్స్ నుంచి అభ్యర్థుల్ని నిలపడంతో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో హైవోల్టేజ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది.
క్రాస్ ఓటింగ్‌కు ఛాన్స్ ఉంటుందా?
క్రాస్ ఓటింగ్ భయాలు రెండువైపులా ఉండబోతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరు అభ్యర్థులు సౌత్ స్టేట్స్ కు చెందిన వారే. ఇండియా కూటమి పార్టీలు చాలా చర్చించి సౌత్ కే చెందిన సుదర్శన్ రెడ్డిని ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దింపాయి. అది కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాయి. అన్ని విపక్ష పార్టీలు ఒకే పేరుకు అంగీకరించడం సంతోషకరమైన విషయమని ఖర్గే అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద విజయం అని చెప్పారు. జులై 1946లో జన్మించిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం. డిసెంబర్ 27, 1971న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో లాయర్ గా చేరాక తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1988, 1990 మధ్య ఏపీ హైకోర్టులో ప్రభుత్వ లాయర్ గా 1990లో కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా కొంతకాలం పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి న్యాయ సలహాదారు, స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా పనిచేశారు. 1993లో ఆయన ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగానూ పని చేశారు. మే 2, 1995న ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. డిసెంబర్ 5, 2005న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. 2007 జనవరి 12న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. 2011, జులై 8 వరకు పనిచేశారు. 2013 మార్చిలో ఆయన గోవా మొదటి లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు. కానీ వ్యక్తిగత కారణాలతో ఏడు నెలల్లోనే పదవీవిరమణ చేశారు. సో ఇదీ బి.సుదర్శన్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్.
భాధ్యత సుప్రీం జడ్జితో సమానమన్న సుదర్శన రెడ్డి..
గత వారం అధికార NDA తమ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా 67 ఏళ్ల రాధాకృష్ణన్ ను ప్రకటించింది. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి. అయితే తాజాగా ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబడ్డ సుదర్శన్ రెడ్డి కొన్ని కీ కామెంట్స్ చేశారు. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాధ్యతతో సమానమని, రాజ్యాంగాన్ని సమర్థించడమే లక్ష్యం అని అన్నారు.రాజ్యాంగ భావనను అందరికీ తెలిసేలా చేయడమే అని అన్నారు. తనను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పరిగణలోకి తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, దీన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సీన్ ఎలక్టోరల్ కాలేజ్ వైపు మళ్లింది. ఇప్పటిదాకా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఏ కూటమికి ఎన్ని ఓట్లు ఉన్నాయి. ఎవరి కథేంటి అన్నది ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి ఒక అప్పీల్ చేశారు. తాను ఏ పార్టీకి చెందిన నాయకుడిని కాదని, సో ఎన్డీఏ కూటమి ఎంపీలు తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దీంతో కథ మారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తటస్థంగా ఉన్న పార్టీల కథేంటన్నది తేలాల్సిన విషయం.
దక్షిణాది రాష్ట్రాల ఎంపీల దారెటు?
సో ఇప్పటిదాకా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల కోసం నెంబర్ గేమ్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అంతా సింపుల్ గా జరిగిపోతుంది అనుకున్నారు. అయితే అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి పార్టీలు చాలా వ్యూహాత్మకంగా సౌత్ కు చెందిన వారినే బరిలోకి దింపాయి. దీంతో సౌత్ పార్టీలు ఎవరు ఎటువైపు మొగ్గుతాయి… క్రాస్ ఓటింగ్ ప్రమాదం ఉంటుందా అన్నది హాట్ డిబేట్ గా మారుతోంది. అదే జరిగితే లెక్కలు తారుమారవడం ఖాయమే. సీపీ రాధాకృష్ణన్ వర్సెస్ బి. సుదర్శన్ రెడ్డి.. ఒకరిది తమిళనాడు, ఇంకొకరిది తెలంగాణ. అందుకే గేమ్ కొత్తగా మారింది. ముఖ్యంగా సౌత్ ఇండియాకు చెందిన స్థానిక పార్టీలు ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికంగా మారింది. ఎందుకంటే రెండు కూటములకూ ఓ వ్యూహం ఉంది. సో తెలంగాణకు చెందిన సుప్రీం మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి తెచ్చిన తర్వాత డైనమిక్స్ మారే ఛాన్స్ ఉందంటున్నారు. NDA కూటమిలో టీడీపీ, జనసేన ఉన్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ కు లోక్ సభ ఎంపీలు లేకపోయినా నలుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అటు వైసీపీ కూడా తటస్థంగా ఉంది. ఎన్డీఏ కూటమివైపు మొగ్గుచూపుతామని కొందరు వైసీపీ నేతలు అంటున్నా.. రహస్య ఓటింగ్ లో ఎవరు ఎటు చీలిపోతారన్న హాట్ డిబేట్ కూడా నడుస్తోంది.
తాము సుప్రీం నుంచి అభ్యర్థిని తీసుకొచ్చామన్న ఖర్గే
సో అటు తమిళనాడులోనూ డీఎంకే ఎంపీలు ఎటువైపు చీలుతారు అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఉపరాష్ట్రపతి అవ్వాలనే తమిళనాడు వాసులు కోరుకోవడం సహజం. మరి వాళ్లున్నది ఇండియా కూటమిలో. సో కూటమి ధర్మానికి కట్టుబడే ఓటు వేయడం పైకి ఖాయంగా కనిపిస్తున్నా… చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు అంటున్నారు. అందుకే డైలాగ్ వార్ కూడా గట్టిగానే నడుస్తోంది. ఎన్డీఏ కూటమి సంఘ్ తో సంబంధం ఉన్న వ్యక్తిని తీసుకొస్తే.. తాము సుప్రీంకోర్టు నుంచి వచ్చిన వ్యక్తిని తీసుకొచ్చామని ఇండియా కూటమి అంటోంది. నిజానికి ఇండియా కూటమిలో డీఎంకే పెట్టిన షరతు ఏంటంటే.. సౌత్ ఇండియాకు చెందిన అభ్యర్థిని అందులోనూ తమిళనాడుకే చెందిన వ్యక్తిని ప్రకటించాలన్నది. అదే సమయంలో తృణమూల్ పెట్టిన డిమాండ్ ఏంటంటే.. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని అభ్యర్థిగా తీసుకురావాలన్నది. ఇవన్నీ పరిశీలించి బి. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఫైనల్ చేశారు.
తమిళనాడులో బలం పెంచుకునే ఉద్దేశం
ఎన్‌డీఏ కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించడం వెనుక చాలానే వ్యూహాలు ఉన్నాయి. ఈ నిర్ణయం సౌత్ ఇండియా రాజకీయాల్లో, ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ బలాన్ని పెంచే లక్ష్యంతో పొలిటికల్ స్ట్రాటజీతో తీసుకున్న నిర్ణయంగా చూస్తున్నారు. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు. రెండుసార్లు కోయంబత్తూర్ నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004-2007 మధ్య తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగానూ పనిచేశారు.
మొత్తం 782 మంది ఎంపీలకు ఓటు హక్కు ఛాన్స్
ఒకసారి నెంబర్ గేమ్ ఎలా ఉందో చూద్దాం. ఎన్నికల కోసం విడుదల చేసిన డేటా ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 782 మంది ఎంపీలు ఓటు వేయడానికి అర్హులు. వీరిలో 542 మంది లోక్‌సభ నుంచి, అలాగే 240 మంది రాజ్యసభ నుంచి ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా గెలవాలంటే 392 మంది ఎంపీలు అవసరం. ఎన్డీఏకు 427 మంది ఎంపీల మద్దతు ఉందని చెబుతున్నారు. ఇందులో 293 మంది లోక్‌సభ సభ్యులు, 134 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మరోవైపు, ప్రతిపక్షానికి 355 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇందులో 249 లోక్‌సభ సభ్యులు అలాగే 106 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అలాగే వివిధ పార్టీలకు చెందిన 133 మంది ఎంపీల సపోర్ట్ ఎవరికన్నది ఇప్పటికీ డిసైడ్ కాలేదు. వీరు నిర్ణయాత్మకంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే వీరి ఓట్ల చుట్టూ గేమ్ నడుస్తోంది. సో నెంబర్ గేమ్ ప్రకారం చూస్తే ఎన్డీఏ కూటమికి స్వల్ప ఎడ్జ్ అయితే కనిపిస్తోంది. కానీ ఇక్కడ క్రాస్ ఓటింగ్ కు ఛాన్సెస్ కూడా పెరుగుతున్నాయి. దీంతో విజయం ఎవరిని వరిస్తుందన్నది చివరి నిమిషం దాకా ఉత్కంఠ కలిగించే అవకాశం ఉందంటున్నారు.
Also Read: మర్వాడీస్ రచ్చ.. అసలు కారణాలు ఇవే! ఎక్కడిదాకా వెళ్తోంది?
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు
ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9న జరుగుతాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21. ఇప్పటిదాకా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జగదీప్ ధన్ ఖడ్… జులై 21న ఆరోగ్య సమస్యల పేరు చెప్పి సడెన్ గా రిజైన్ చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. సో ఇది కాస్తా పొలిటికల్ హీట్ పెంచుతోంది.
Story By Vidya Sagar, Bigtv