E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మీనాను అవమానించిన ప్రభావతి..శృతి దెబ్బకు మైండ్ బ్లాక్.. రోహిణి షాక్..

Gundeninda GudiGantalu Today episode: మీనాను అవమానించిన ప్రభావతి..శృతి దెబ్బకు మైండ్ బ్లాక్.. రోహిణి షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 2nd : విద్య ఆ మాణిక్యం అదే పెళ్లిలో ఉన్నాడు.. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీకి గనుక తెలిస్తే రోహిణి ఇన్ని రోజులు అబద్ధపు గోడలు కట్టుకుంటూ వచ్చింది. అన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి. ఎలాగైనా సరే అది నా ఫ్రెండ్ కాబట్టి నేను దాన్ని కాపాడాలి అని రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.  రోహిణి కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అని.. మనోజ్ కి ఫోన్ చేసి రోహిణి తో నేను అర్జెంటుగా మాట్లాడాలి నువ్వు ఎక్కడున్నా సరే రోహిణికి ఫోన్ ఇవ్వవా అని అడుగుతుంది విద్య.. కానీ తను మాత్రం నేను చాలా బిజీగా ఉన్నాను రోహిణి దగ్గర శృతి మీనా ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేసి అడుగు అనేసి అంటాడు. ఇక మీనాకు ఫోన్ చేసి రోహిణి తో అర్జెంట్ గా మాట్లాడాలి అనుకుంటుంది..

రోహిణి కోసం వెళ్లిన మీనా..

విద్య అర్జెంటుగా మాట్లాడాలి అని అనింది కదా ఏమైందో రోహిణి తో ఏదైనా పనుందేమో ఒకసారి వెళ్లి చెప్పేసి వస్తే బాగుంటుంది కదా అని మీనా లోపలికి వెళ్తుంది.. మీనా అలా లోపలికి వెళ్లిందో లేదో ప్రభావతి తన ఇద్దరు కోడలు గురించి గొప్పగా చెప్పుకోవడం విన్న మీనా బాధపడుతుంది.. నా ఇద్దరు కోడలు చాలా మంచి వాళ్ళు అని వాళ్ళ పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది.. ఇప్పుడు కోడలు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పగానే అప్పుడే ఎంట్రీ ఇచ్చిన మీనా చాలా బాధపడిపోతుంది.. అందరి ముందర మా అత్తయ్య నన్ను అవమానిస్తుంది అని అనుకుంటుంది.. శృతి మాత్రం ఏంటండి బయట వచ్చినప్పుడు కూడా అందరి ముందర మీరు ఇలా మీనా అని అవమానిస్తే నేను అసలు ఊరుకోను అని అంటుంది.

మీనాకు ఘోర అవమానం.. 

Advertisement

నా ఇద్దరూ కోడలు గొప్పింటి నుంచి వచ్చారు. ఇద్దరు కూడా డబ్బు నైంటి నుంచి వచ్చారు. కాబట్టి వీళ్ళు చదువుకున్నారు అని ప్రభావతి రోహిణి శృతిలపై ప్రశంసలు కురిపిస్తుంది.. మా ఆయన చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఒక పూలు అమ్ముకునే అమ్మాయిని నా ఇంటికి కోడలుగా చేసుకున్నాను అని మీనా గురించి దారుణంగా మాట్లాడడంతో మీనా చాలా బాధపడిపోతుంది.. పూలముకునే వాళ్ళు మనుషులు కారా ఎందుకు మీరు ఎప్పుడు మీనా అని ఏదో ఒకటి అంటూ ఉంటారు అని శృతి మీనా కి సపోర్ట్ గా నిలుస్తుంది.. మీరు చేసే ప్రతి ప్రవర్తన కూడా అవతలి వాళ్ళని బాధ పెట్టేలా ఉండకూడదు అని శృతి చెప్పగానే మీనా పర్వాలేదులే శృతి నాకు అలవాటైపోయింది అని అంటుంది.

రోహిణికి షాకిచ్చిన విద్య..

రోహిణి మీ ఫ్రెండ్ విద్య నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని నాకు ఫోన్ చేసింది.. అందుకే నేను లోపలికి వచ్చాను కానీ ఇక్కడ నా గురించేలా మాట్లాడుతున్నారని తెలిస్తే అసలు వచ్చేదాన్ని కాదు అని అంటుంది.. ఏంటి విద్య అన్నిసార్లు ఫోన్ చేసావ్ ఏదైనా ఇంపార్టెంట్ చెప్పాలని రోహిణి అడుగుతుంది. అవును రోహిణి ఆ మాణిక్యం నువ్వు ఉన్న మండపంలోనే ఉన్నాడు. అతను ఆ పెళ్ళికొడుకు మేనమామ అని అంటున్నారు.. ఒకవేళ అతను మీ కుటుంబానికి ఎదురుపడితే నీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అని నీకు ఫోన్ చేద్దామని ఎన్నిసార్లు ట్రై చేశాను అని విద్యా అనగానే రోహిణి దిమ్మతిరిగిపోయేలా షాక్ అవుతుంది. ఎలాగైనా సరే ఆ మటన్ కొట్టు మాణిక్యాన్ని తన కుటుంబం కంటపడకుండా చూసుకోవాలి అని అనుకుంటుంది.

ముకేష్ ను రమ్మని చెప్పిన బాలు.. 

Advertisement

మనోజ్ వాళ్ళందరూ టిఫిన్ చేసిన తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ ఉండదా ముంబై నుంచి ముఖేష్ ఫోన్ చేసి మనోజ్ నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను అని చెప్పగానే మనోజ్ నేను వెళ్ళిపోతాను అని అంటాడు. కానీ ఇప్పుడు పెళ్లి ఇంటి నుంచి వెళ్తే బాగోదు కదా అని బాలు అనగానే మరి నాకోసం వస్తున్నా ముకేష్ గారిని నేనెందుకు వద్దు అని చెప్పాలి అని మనోజ్ అంటాడు.. ఆయన దగ్గరికి నువ్వు వెళ్లడం ఎందుకు నీ దగ్గరికి ఆయన వస్తారు కదా అని చెప్పగానే.. ఎందుకురా ఆయన ఇక్కడికి రమ్మని చెప్పడం అని మనోజ్ కంగారు పడిపోతాడు.. కానీ ముఖేష్ మాత్రం బాలు ఫోన్ చేసి చెప్పగానే నేను వస్తాను అని అంటాడు.. మనోజ్ ఎందుకు ఆయన్ని ఇప్పుడు ఇక్కడికి రమ్మన్నావు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి షాకిచ్చిన రామరాజు.. ప్రేమ మాటకు నర్మదా ఫీల్.. వల్లి హ్యాపీ..

Related News

ఈశ్వర్ సాయి మాధురి వివాదం.. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఈశ్వర్ సాయి వైఫ్ శరణ్య!

హీటెక్కించిన కెప్టెన్సీ రేస్.. భయం పుట్టిస్తున్న ఆటలు!

అభిమానులకు పండు మాస్టర్ రిక్వెస్ట్.. ప్లీజ్ ఆ పని చేయండంటూ!

బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి మాట ఎలా రికార్డ్ అవుతుందో తెలుసా?

ఆ స్వేచ్ఛ ఇప్పుడు లేదు.. అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

రైతుబిడ్డ ఝాన్సీ పై ట్రోల్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన తల్లి!

తల్లి కాబోతున్న సీరియల్ నటి లావణ్య.. ఘనంగా సీమంతం వేడుకలు!

సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×