Gundeninda GudiGantalu Today episode December 18th : నిన్నటి ఎపిసోడ్ లో.. సంజూ తో బార్ లో రాజేష్ తప్పుగా బిహేవ్ చేస్తాడు. కావాలనే గొడవ పెట్టుకుంటాడు. బాలు చూసి నా ఫ్రెండ్ ను కొడతావా అని కొడతాడు. బార్ లో పెద్ద రచ్చ చేస్తారు. సంజూ ను వదలకుండా కొడతాడు.. నేనెవ్వరో తెలుసా అని అంటాడు. ఇంకా నాలుగు పీకుతాడు. ఇక బార్ నుంచి బాలు ఇంటికొస్తాడు. ఇంట్లో ఎవరు లేరని చూసి మీనా దగ్గరికి వస్తాడు. కొట్టిన రాయికి పూజలు చేస్తూ పెద్ద హంగామా చేస్తాడు. దానికి మీనా మీరు నా భర్త అండి నేను ఎవరికీ గౌరవం ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను అనేసి అంటుంది. ఇక మొన్నటివరకు నన్ను రౌడీ అనే వాళ్ళు.. నిన్నేమో రౌడి గారి పెళ్ళాం అనేవాళ్ళు. ఇప్పుడేమో రౌడీ మీనా గారి మొగుడు అనేసి అంటున్నారని బాలు చెప్తూ పొగడ్తలతో ముంచేస్తాడు. ఇక మీద బాలు కలిసి ఒకే బెడ్ మీద పడుకుంటారు. కామాక్షి రెడీ అయ్యి ప్రభావతి దగ్గరికి వస్తుంది. ప్రభావతి, మీనాక్షిలు కలిసి రవి ఇంటికి వెళ్లారు. రవి తన అమ్మను చూడగానే ఎంతో సంతోషిస్తాడు. తన కోడలికి ఏమైందని ఆరా తీస్తుంది. ఇంతకీ తన కోడలు ఏది అని ప్రశ్నిస్తుంది? శృతి ప్రవర్తనను చూసి ప్రభావతి షాక్ అవుతుంది. శృతి రాగానే తన కాళ్లకు నమస్కరిస్తుందని ప్రభావతి భావిస్తుంది. మన ఇంటికి వెళదామని అంటుంది. ప్రభావతి.. అక్కడైతే ఒకరికి మరొకరు తోడు ఉంటారు కదా అంటుంది. శృతి కన్విన్స్ అయి ఇంటికి వస్తానంటూ మాట ఇస్తుంది. కానీ, ఇంతలోనే శృతి అమ్మ శోభ వారింటికి చేరుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి మాటలు విని శృతి కరిగిపోతుంది. మేము తప్పక వస్తాము అని అంటుంది. ఇక శోభ కూడా శృతిని చూడ్డానికి వస్తుంది. దీంతో ప్రభావతికి ఎక్కడలేని కోపం వస్తుంది. ఎలాగైనా శోభను వెళ్లగొట్టాలని, ప్రభావతి సూటి పోటీ మాటలు అంటుంది. దీంతో శోభ కూడా కోపం వస్తుంది. మీరు మాత్రమే బాధ్యతగా ఉన్నట్లు మాట్లాడుతున్నారు. మేము కూడా మా కూతురిని బాధ్యతగానే పెంచాం.కానీ, మీ వాడే ప్రేమ.. ప్రేమ.. అని మా కూతురిని తన వలలో వేసుకున్నాడు అంటుంది శోభ. అయినా పెళ్లి కాగానే బాధ్యతలు తీరిపోతాయి. పిల్లలు ఎలా ఉన్నారో చూడాలి కదా అంటూ ప్రభావతి మరో డైలాగ్ వేస్తుంది. శోభా, ప్రభావతి ఇద్దరు మాటలతో ఒకరిమీద మరొకరు మాటల యుద్ధం చేసుకుంటారు. శోభకు మరింత కోపం వస్తుంది. వెంటనే శృతిని తీసుకువెళ్తానని, ఇక్కడ తన కూతురికి రక్షణ లేదని అంటుంది. దీంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పెళ్లయ్యాక శృతి తన కోడలు అని, తన కోడలు తన ఇంటికి వస్తుందని చెబుతోంది. లేదు తన ఇంటికి వస్తుందని శోభ కూడా గట్టిగా ఉంటుంది. ఇటు అత్త.. అటు అమ్మను కాదనలేక పోతుంది. ఈ క్రమంలో తన తల్లిని వెళ్లిపొమ్మని గట్టిగా అరుస్తుంది. దీంతో శోభ బాధ పడుకుంటూ వెళ్ళిపోతుంది. రవిని ప్రభావతి అడుగుతాడు. కానీ రవి మాత్రం ఇప్పుడు ఏం చెప్పొద్దూ.. శృతి రాదు నువ్వు బాలును, నాన్నను ఒప్పించు అని అంటాడు. ఇక ప్రభావతి కామాక్షి లు బయటకు వస్తారు.
సంజు తన ఫ్రెండ్స్ బాలు ఇంటికి వస్తారు. చూసి సంజయ్ కోపంతో రగిలిపోతాడు.. బాలుని చూడగానే ఆవేశంతో ఊగిపోతాడు. వెంటనే గన్ను తీసి షూట్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఇంతలోనే మీనా బయటికి వస్తుంది. అప్పుడు సంజీవ్ కు అర్థం అవుతుంది. రవి, శృతి, మీనా, బాలు అందరూ ఒక ఇంటి వారేనని, వారికి జీవితంలో మర్చిపోలేని విధంగా బుద్ధి చెప్పాలని తన ప్లాన్ కు మార్చుకుంటాడు.. నేను వేసే ప్లాను వాళ్ళింటి వాళ్ళ మొత్తం ఏడుస్తూనే ఉంటారని సంజయ్ అంటాడు. ఇతను ఫ్రెండ్స్ ఏం చేయబోతున్నావో చెప్పరా అంటే, చెప్తే మజ ఏముంటుంది అనేసి అంటాడు.. ఇక సత్యం భోజనానికి కిందకు వస్తాడు. ఎక్కడికెళ్ళింది అమ్మ ఇంకా రాలేదు అందరికన్నా ముందు తనే ఉంటుంది కదా అనేసి అడుగుతాడు. మీనా ఇంకా రాలేదు మామయ్య అని అంటుంది. నేను వెళ్లి తీసుకొస్తాను మామయ్య అనగానే సరే అమ్మ అనేసి అంటాడు. ప్రభావతి దగ్గరికి వెళ్ళగానే మీనా పై కస్సుమని లేస్తుంది. తాను తిననని మొండికేసి కూర్చొంటుంది ప్రభావతి. మీనా వెళ్లి ఎంత రిక్వెస్ట్ చేసిన తాను రానని, రవిని శృతిని ఇంటికి తీసుకువచ్చేంత వరకు తాను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టనని అంటుంది. ఇంతలోనే బాలు వచ్చి ఆకలైతే వాళ్లే వచ్చి తింటారని, అనవసరంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయవలసిన అవసరం లేదని, అలా చేసి తనని తన తండ్రిని ఒప్పించలేరని కరాకండిగా చెప్పేస్తాడు బాలు. ఇంతలోనే మనోజ్ కూడా అక్కడికి చేరుకుంటారు తమను భోజనానికి పిలవడం లేదు ఏంటి అని అంటాడు.. రేపటి నుంచి నువ్వు బొట్టు తీసుకెళ్లి వాళ్ళిద్దరికీ బొట్టు పెట్టు మరి తినడానికి రమ్మని చెప్పు అనేసీ మీనా తో అంటాడు బాలు.. ఇక రోహిణి అడుగుతుంది. రవి గుర్తుకు వస్తున్నాడు. కలలోకి వస్తున్నాడని అంటుంది. మీనా, బాలు గొడవ పడుతారు.. ఇక సత్యం కూడా ఇంటికి తీసుకురావాలా లేదా అనేది ఆలోచించలేకపోతున్నాను అనేసి అంటాడు.
ఈ క్రమంలో రోహిణి మాట్లాడుతూ.. పిల్లలు దూరమైన బాధ కన్నతల్లికి మాత్రమే తెలుస్తుందని, తాను కూడా ఆ బాధను అనుభవిస్తున్నానని నోరు జారుతుంది. దీంతో బాలుకి కోపం వస్తుంది పది మంది పిల్లలు కన్నట్టు మాట్లాడుతున్నావేంటి పార్లరమ్మ అని పంచ్ వేస్తాడు బాలు.. ఇంటిల్లిపాతికి రోహిణి పై అనుమానం వస్తుంది. ఆడవారికి ఆ బాధ అర్థం అవుతుంది అంటూ కవర్ చేస్తుంది. ఈ సమయంలో సత్యం మాట్లాడుతూ.. సురేంద్ర తన ఇంటికి వచ్చి మాట్లాడుకునే విధానం తనకు నచ్చలేదని, అలాగే తను కావాలని జైలుకు పంపించాడని బాధపడతాడు సత్యం.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..