Ind vs Aus 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 లో ( Border-Gavaskar Trophy 2024/25 ) భాగంగా జరుగుతున్న బ్రిస్బేన్ టెస్టులో ( Brisbane Test ) టెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రిస్బేన్ టెస్టు కు మరోసారి వర్షం అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా టీమిండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య జరిగే మూడో మ్యాచ్ మరోసారి ఆగిపోయింది. బ్రిస్బేన్ టెస్టు కు మరోసారి వర్షం అంతరాయం కావడంతో..అంపైర్లు..సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐదవ రోజు ఆటలో లంచ్ బ్రేక్‌ను ముందే ప్రకటించిన అంపైర్లు..ఈ మేరకు ఆటగాళ్లకు బ్రేక్ ఇచ్చారు.
Also Read: Kohli – Gambhir: కోహ్లీ, గంభీర్ పై సెలబ్రేషన్స్… టీమిండియా ఫ్యాన్స్ సీరియస్?
అటు… గబ్బాలో (Gabba ) ఆసీస్ ఆశలకు వరణుడు షాక్ ఇచ్చినట్లే స్పష్టంగా కనిపిస్తోంది. బ్రిస్బేన్ టెస్టు కు మరోసారి వర్షం అంతరాయం కావడంతో.. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ అసలు వర్షం పడకపోయి ఉంటేనా… సీన్ వేరేలా ఉండేది. బ్రిస్బేన్ టెస్టు ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్లేది. అప్పుడు టీమిండియాకు తీవ్ర నష్టం వాటిల్లేది. ఓడిపోయే కంటే.. మ్యాచ్ డ్రా చేసుకోవడం ఉత్తమం కదా… అందుకే దానికి తగ్గట్టుగానే.. టీమిండియాకు అనుకూలంగా వరుణుడు సాయం చేస్తున్నాడు.
ఆస్ట్రేలియా ఆసలపై నీళ్లు చల్లుతున్నాడు వరుణుడు.ఇక అటు బ్రిస్బేన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇటు భారత్ 260 పరుగులకు ఆలౌట్ కావడం జరిగింది. ఇవాళ ఉదయమే టీమిండియా 260 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 185 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఆసీస్ ఉందన్న మాట. అంటే ఇది పెద్ద లక్ష్యమే. మరో 100 పరుగులు చేసి.. టీమిండియా కు బ్యాటింగ్ ఇవ్వాలని ఆస్ట్రేలియా ప్లాన్ వేసుకుంది.
Also Read: Prithvi Shaw: సాయి బాబా.. నేను ఇంకేం చేయాలి.. పృథ్వి షా ఎమోషనల్ పోస్ట్!
కానీ వర్షం రూపంలో… ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ సాయంత్రం వరకు వర్షం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే.. కాసేపు వర్షం.. తర్వాత బ్రేక్… ఆ తర్వాత వర్షం అన్నట్లుగా… గబ్బాలో ఇవాళ పరిస్థితి ఉంటుందట. దీంతో ఆస్ట్రేలియా గెలిచే ఛాన్సులే లేవు. టీమిండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య జరిగే మూడో మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
టీమిండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య జరిగే మూడో మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా అయితే… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్స్ పాయింట్స్ టేబుల్ లో ఎలాంటి మార్పులు ఉండవు. టీమిండియా ఎప్పటి లాగానే.. మూడో స్థానంలోనే ఉంటుంది. అటు ఆస్ట్రేలియా… మొదటి లేదా రెండో స్థానంలో ఉండే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా.. మొదటి టెస్టులో టీమిండియా విజయం సాధించింది. రెండో దాంట్లో ఆసీస్ విజయం సాధించింది. ఇక టీమిండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య మరో రెండు టెస్టులు ఉన్నాయి.