Gundeninda GudiGantalu Today episode December 22nd : నిన్నటి ఎపిసోడ్ లో.. మౌనికకు అదృష్టం మాములుగా లేదు గొప్పింటి సంబంధం వచ్చింది అని సొంత డబ్బా కొడుతుంది. ప్రభావతి చెప్పింది విని బాలు షాక్ అవుతాడు. గొప్పింటి సంబంధం అని రోహిణితో పెళ్లి చేసావు. వాళ్ల నాన్న ముఖం కూడా ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడు మౌనికను కూడా అలానే చేస్తావా అని వాదిస్తాడు. ఇక మౌనిక మీ ఇష్టమే నా ఇష్టం అని అనడంతో అందరు ఫుల్ ఖుషి అవుతారు. అన్ని బాగున్నాయి. కానీ, అదే రేంజ్ లో కట్నం అడుగుతారు కదా.. అంటూ సత్యం అంటాడు. కానీ కట్నం కూడా ఇవ్వద్దంటూ చెప్పారని, కేవలం తమ కూతుర్ని ఇంటికి పంపిస్తే.. చాలని చాలా క్లియర్ గా చెప్పారని ప్రభావతి చెబుతుంది. దీంతో మీనా చాలా పద్ధతిగా మనుషులని, ఈ సంబంధం ఓకే అయితే మౌనిక జీవితమే మారిపోతుందంటూ అంటుంది. కానీ, బాలు మాత్రం ఏదో సందేహిస్తాడు. అంత కోటీశ్వరులు మన ఇంటికి వచ్చి సంబంధం సెట్ చేసుకోవడం ఏంటి అని అందరు అనుమాన పడతారు. ఇక ప్రభావతి మాత్రం అందరిని ఒప్పిస్తుంది. మౌనిక, మనోజ్ లను ఎంతో పద్దతిగా పెంచాననీ, మనోజ్ కు గొప్పింటి సంబంధం చేశానని, అలాగే మౌనిక కూడా కోటీశ్వరులకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రభావతి రేంజ్ లో చెబుతోంది. పెళ్లిళ్ల పేరయ్యకు చెప్పి రేపు వాళ్ళని రమ్మని చెప్పమని చెప్తుంది ప్రభావతి. కామాక్షి వాళ్లకు ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. బార్ లో నిన్ను బాలు కొట్టాడు కదా మరి వాడు ఇంట్లో ఉండగా ఈ సంబంధం ఓకే అవుతుందా అనగానే దానికి సంజయ్ నా దగ్గర ఒక ప్లాన్ ఉందని తన మనిషి ఫోన్ నుంచి ఫోన్ చేసి కార్ బుక్ చేసుకోవాలని అడుగుతాడు. మొత్తానికి బాలు ప్రభావతి పోరుతో ఒప్పుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. బాలు ఉంటే ఈ సంబంధం ఎక్కడ చెడిపోతుందని ప్రభావతి టెన్షన్ పడుతూ ఒప్పేసుకోమని చెప్తుంది. మంచి పార్టీ అంటున్నావ్ కదా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని సత్యం అనగానే బాలు వెళ్ళిపోతాడు. ఇక తర్వాత రోజు నీలకంఠం కుటుంబాన్ని ప్రభావతి, సత్యం తీసుకెళ్తారు. సత్యంకో ఇంట్లో సంజు, నీలకంఠం, సువర్ణ కూర్చుంటారు. సత్యం ఇంట్లో మనోజ్, రోహిణి, మీనా, మౌనికతోపాటు కామాక్షి, రంగా కూడా ఉంటారు. ఇంట్లో పెళ్లి చూపుల గురించి మాట్లాడుకుంటారు. సంజు ఎంత మంచోడో చెబుతుంటాడు నీలకంఠం. చాలా బుద్ధిమంతుడు అని, అందుకే ప్రేమించమని వెంటపడకుండా మా దగ్గరికి వచ్చి పెళ్లి చేయమని చెప్పాడని నీలకంఠం అంటాడు.. ఇక ప్రభావతి కూడా ఎందులోనూ తగ్గేదేలే అని మౌనిక గురించి గొప్పగా చెబుతుంది. సంజు నచ్చాడా అని మౌనికను అడిగుతారు. మీ ఇష్టం అని మౌనిక అంటుంది. సరే మరి తాంబూలాలు ఇచ్చుకుందామని, పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందామని నీలకంఠం అంటాడు. మా రెండో అబ్బాయి పని ఉండి వెళ్లాడు. వాడు వచ్చే వరకు కాస్తా ఆగుదాం అని సత్యం చెబుతాడు. దానికి ప్రభావతి మాత్రం ముహూర్తం అది ఇది అనేసి అంటుంది. అంతా ఒకే అనుకుంటే తాంబులాలు మార్చుకుందాం అని అంటారు.
ఇక బాలు వస్తే దొరికిపోతామని, సంజు అసలు వ్యవహారం బయటపడుతుందని టెన్షన్ పడతాడు. ఇక కొత్త డ్రామా మొదలు పెడతాడు. మీకు మా మీద నమ్మకం లేదా. లేకుంటే వెయిట్ చేద్దామని నీలకంఠం అంటాడు. దాంతో అలాంటిదేం లేదు, సరే తాంబూళాలు తీసుకుందామని సత్యం ఒప్పుకుంటాడు. అందరు లేచి తాంబులాలు తీసుకొనేందుకు సిద్ధంగా ఉంటారు. అప్పుడే మీనా మామయ్యా ఆయన వచ్చారు అంటుంది. దాంతో అందరి మొహంలో టెన్షన్ మొదలవుతుంది. అక్కడ సంజును చూసి బాలు షాక్ అవుతాడు. వీడా పెళ్లి కొడుకు అని బాలు అనేసరికి అంతా షాక్ అవుతారు. మా అమ్మ తెచ్చిన సంబంధం అని తెలిసినప్పుడే ఇలాంటి దరిద్రపుగొట్టు సంబంధం అయి ఉంటుందని అనుమానపడుతూనే ఉన్నా అని, బార్‌లో సంజుతో జరిగిన గొడవ గురించి బాలు బయటపెడతాడు..
ఇలాంటి వెదవకు నా చెల్లిని ఇచ్చేదేలే అంటాడు. నీలకంఠం చేతిలో ఉన్న తాంబూళాన్ని విసరగొడతాడు బాలు. వెళ్లరా బయటకు అని బాలు అంటాడు. సంజు ఏదో చెప్పబోతుంటే బాలు ఉతికిఆరేసినట్లు తెలుస్తోంది. దాంతో అంతా షాక్ అవుతారు.. సంజు ప్లాన్ బెడిసి కొట్టిందని ఫీల్ అవుతాడు. నీలకంఠం మాత్రం అవమానం జరిగిందని ఫీల్ అయ్యి వెళ్ళిపోతాడు. బాలు పై పగను పెంచుకుంటాడు. తగిన బుద్ధి చెప్పాలని ఫిక్స్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఏం జరుగుతుందో చూడాలి..