ఉత్తరప్రదేశ్ లోని పలు పర్యాటక కేంద్రాలను జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సుమారు 47.61 కోట్ల మంది టూరిస్టులు సందర్శించారని అధికారులు వెల్లడించారు. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ మధ్య అయోధ్యను 13.55 కోట్ల మంది దేశీయ పర్యాటకులు.. 3,153 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని పర్యాటక శాఖ వెల్లడించింది. అదే సమయంలో తాజ్‌మహల్‌ను 12.51 కోట్ల మంది సందర్శించినట్టు తెలిపింది. వారిలో 11.59 మంది దేశీయ పర్యాటకులు.. 9.24 లక్షల మంది విదేశీ పర్యాటకులు ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో ఆగ్రా కంటే అయోధ్యనే ఎక్కువ మంది సందర్శించారని పర్యటన శాఖ పేర్కొంది. అయోధ్య కేవలం 9 నెలల్లో తాజ్‌మహల్ రికార్డ్‌ను అధిగమించినట్లుగా తెలిపింది.
మొత్తంగా గత ఏడాది 48 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తే.. ఈ ఏడాది కేవలం తొమ్మిది నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నట్లు పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా తాజ్ మహల్ పర్యాటకులను ఆకర్షిస్తుండగా.. దేశీయ టూరిస్టుల సంఖ్య కాస్త తగ్గినట్లు ప్రభుత్వం పేర్కొంది.
Also Read: చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కేంద్రం గుడ్ న్యూస్.. సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన ఆర్థిక శాఖ
ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామమందిరాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు దేశ వ్యాప్తంగా అతిరథ మహరథులంతా హాజరయ్యారు. రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తల దగ్గర నుంచి సినీ ప్రముఖుల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేశారు.