Gundeninda GudiGantalu Today episode December 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. మౌనికకు అదృష్టం మాములుగా లేదు గొప్పింటి సంబంధం వచ్చింది అని సొంత డబ్బా కొడుతుంది. ప్రభావతి చెప్పింది విని బాలు షాక్ అవుతాడు. గొప్పింటి సంబంధం అని రోహిణితో పెళ్లి చేసావు. వాళ్ల నాన్న ముఖం కూడా ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడు మౌనికను కూడా అలానే చేస్తావా అని వాదిస్తాడు. ఇక మౌనిక మీ ఇష్టమే నా ఇష్టం అని అనడంతో అందరు ఫుల్ ఖుషి అవుతారు. అన్ని బాగున్నాయి. కానీ, అదే రేంజ్ లో కట్నం అడుగుతారు కదా.. అంటూ సత్యం అంటాడు. కానీ కట్నం కూడా ఇవ్వద్దంటూ చెప్పారని, కేవలం తమ కూతుర్ని ఇంటికి పంపిస్తే.. చాలని చాలా క్లియర్ గా చెప్పారని ప్రభావతి చెబుతుంది. దీంతో మీనా చాలా పద్ధతిగా మనుషులని, ఈ సంబంధం ఓకే అయితే మౌనిక జీవితమే మారిపోతుందంటూ అంటుంది. కానీ, బాలు మాత్రం ఏదో సందేహిస్తాడు. అంత కోటీశ్వరులు మన ఇంటికి వచ్చి సంబంధం సెట్ చేసుకోవడం ఏంటి అని అందరు అనుమాన పడతారు. ఇక ప్రభావతి మాత్రం అందరిని ఒప్పిస్తుంది. మౌనిక, మనోజ్ లను ఎంతో పద్దతిగా పెంచాననీ, మనోజ్ కు గొప్పింటి సంబంధం చేశానని, అలాగే మౌనిక కూడా కోటీశ్వరులకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రభావతి రేంజ్ లో చెబుతోంది. పెళ్లిళ్ల పేరయ్యకు చెప్పి రేపు వాళ్ళని రమ్మని చెప్పమని చెప్తుంది ప్రభావతి. కామాక్షి వాళ్లకు ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. బార్ లో నిన్ను బాలు కొట్టాడు కదా మరి వాడు ఇంట్లో ఉండగా ఈ సంబంధం ఓకే అవుతుందా అనగానే దానికి సంజయ్ నా దగ్గర ఒక ప్లాన్ ఉందని తన మనిషి ఫోన్ నుంచి ఫోన్ చేసి కార్ బుక్ చేసుకోవాలని అడుగుతాడు. మొత్తానికి బాలు ప్రభావతి పోరుతో ఒప్పుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే… ఉదయం లేవగానే ప్రభావతి హడావిడి చేస్తుంది. పెళ్లి వాళ్ళు వస్తున్నారు మీరు ఇలా పేపర్ చదువుతూ కూల్ గా కూర్చుంటారా నాకైతే కాళ్లు చేతులు ఆడటం లేదు అనేసి అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బాలు ఎక్కువగా టెన్షన్ పడకు బీపీ వస్తే కాళ్లు చేతులు ఆడడమే మానేస్తాయని అంటాడు. ఇక అప్పుడే కామాక్షి రంగా అక్కడికి వస్తారు. ఏంటి అన్నయ్య మీరు కూడా ఇంత లేట్ వచ్చారు అంటే అప్పుడు కామర్స్ ఉండి ఇప్పుడు వెళ్లి ఇంకొక గంట ముందు వచ్చే వాళ్ళము అనేసి కౌంటర్ ఇస్తుంది. ఇక మీనా చీరలన్నీ బెడ్ మీద పెట్టి ఏ చీర కట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు బాలు వచ్చి ఏంటి చీరలు వ్యాపారం పెడుతున్నావ్ అంటే చీరలు వ్యాపారం పెట్టాను చీరలు నాకు ఉన్నాయా మౌనిక పెళ్లిచూపులు కదా ఏ చీర కట్టుకోవాలని ఆలోచిస్తున్నా అనేసి అంటుంది. బూడిద రంగు నల్ల రంగు కాకుండా ఏ చీర కట్టుకున్న బాగనే ఉంటావు అనేసి అంటాడు. ఇక మౌనిక ఇంకా రెడీ అవ్వలేదు ఏంటి అనేసి కామాక్షి అడుగుతుంది. కానీ రెడీ అవుతానని చెప్పింది ఇంకా రెడీ అవుతూనే ఉంది అనేసి ప్రభావతి అంటుంది. అంత పెద్ద బ్యూటిషన్ పెట్టుకొని మౌనిక ఒకటి రెడీ అవ్వడం ఎందుకు రోహిణి రెడీ చేయమని చెప్పొచ్చు కదా అంటే అవును నేను మర్చిపోయాను అనేసి ప్రభావతి రోహిణి కి రెడీ చేయమని చెప్తుంది.
ఇక మీనా ను బాలు ఈ సంబంధం ఏదైనా తేడా కనిపిస్తే నాకు చెప్పు వాళ్ళ నాన్న ఏంటి వాళ్ళ అమ్మ ఏంటి ఇవన్నీ కనిపెట్టు సరేనా అనేసి గట్టిగా చెప్పి వెళ్తాడు. మౌనిక దగ్గరికి వెళ్ళిన మీనా ఈ చీర కట్టుకోమని సలహా ఇస్తుంది. అప్పుడే ప్రభావతి వచ్చి ఎందుకు పనిమనిషి లాగా ఉండాలని నీలాంటి వాళ్ళు అక్కడ 100 మంది ఉన్నారు అనేసి అన్న గానే బాలు అక్కడికి వచ్చి వాళ్ళింట్లో 100 మంది వదినలు ఉన్నారా అనేసి కౌంటర్ వేస్తాడు.. ఇక ప్రభావతి నువ్వు పెళ్లి వాళ్ళ ముందర అటు ఇటు తిరగకు ఏదో ఒక చోటుండు పూలమ్మే వాళ్ళని చేసుకున్నాం అంటే మమ్మల్ని తప్పుగా చూస్తారు అనేసి అంటుంది. అప్పుడే మనోజ్ అక్కడికి వస్తాడు. బాలు అరే లక్షలు మింగినోడా ఇట్రా అనేసి లోపలికి పిలుస్తాడు. ఏంట్రా ఎందుకు పిలిచావంటే పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు అటు ఇటు తిరగకు నువ్వు నలభై లక్షలు మింగావ్ అంటే మా అందరికీ తల వంపులు తీసుకువచ్చినట్లే అని అంటాడు. భార్యను సపోర్ట్ చేయడం చూసి ప్రభావతి కోపంగా ఉంటుంది. ఇక మౌనికకు నీకు సంబంధం ఇష్టమైతేనే పెళ్లి లేకపోతే లేదు అది గుర్తుపెట్టుకో ఎవరి బలవంతన్న నువ్వు ఒప్పుకోవద్దు అనేసి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే నీలకంఠం ఫ్యామిలీ ఇంటికి వస్తారు. ప్రభావతి సత్యం వెళ్లి వాళ్ళని లోపలికి తీసుకొస్తారు.
ఇంట్లో అందరినీ పరిచయం చేస్తుంది ప్రభావతి. అమ్మాయిని తీసుకు రమ్మంటారా అంటే అప్పుడు సత్యం ఆగు నేను కాసేపు వాళ్లకి మాట్లాడాలి అనేసి అడుగుతాడు. మేము మేమేదో సాధ జీవితాన్ని గడిపే వాళ్ళం అనేసి సత్యమంటాడు మా గురించి మీకు ముందుగా చెప్పాలి మీరు తెలుసుకోవడం కూడా బాధ్యత అనేసి సత్యం అంటాడు. మీ గురించి ఎందుకు తెలియదు బావగారు మీ గురించే బిజినెస్ చేసేటప్పుడే నేను ఎన్నో తెలుసుకుంటాను కానీ కొడుకుకు పెళ్లి సంబంధం అంటే అటు ఇటు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మాకు ఉంటుంది మీ గురించి అన్నీ తెలుసు మీ కూతురు మీ కోడలు మీ కొడుకు గురించి అన్ని తెలుసు అనేసి అంటాడు. ఇక రవి గురించి చెప్పినప్పుడు అతను చెప్పిన మాట వినకుండా పెళ్లి చేసుకున్నాడు అనేసి నిజం చెప్తాడు. ఈ విషయమైతే మాకు తెలియదు బావగారు కానీ ఇందులో తప్పేంటి ప్రేమించడం అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే కదా వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనేసి అనగానే అందరూ సంతోష్ పడతారు. ఇక మౌనికని తీసుకొని వద్దామని అనగానే సత్యం ఆగండి మా చిన్న కోడలును పరిచయం చేస్తానని మీనాను పరిచయం చేస్తాడు.. ఇక మౌనికని తీసుకొని వస్తారు..
మౌనిక ను లోపలికి తీసుకొని వెళ్లి మాట్లాడాలని సంజయ్ అడుగుతాడు. ఇక తను మంచివాడు అనిపించుకోవడానికి నటించాలని మౌనికతో మాట్లాడతాడు. నువ్వు పెళ్లయిన తర్వాత కూడా జాబ్ చేసుకోవచ్చు. నీ జీతం మొత్తం ఇవాళ్ళకి ఇచ్చుకోవచ్చు డబ్బున్న వాళ్ళని నువ్వు ఎక్కడ ఏది తగ్గదు నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అనేసి చెప్తాడు దానికి మౌనిక ఫీదా అవుతుంది. నాకు ఇంతకుముందు ఒక సంబంధం తీసుకొచ్చారు ఆ అమ్మాయిని నేను ప్రేమించాను కానీ అమ్మాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది అని జాలి కలిగేలా మాట్లాడుతాడు. మౌనిక అది నమ్మి అయ్యో పాపం అనుకొని అతను మంచివాడని నమ్ముతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మౌనికకు ఇష్టమా లేదా అని అడుగుతారు. మౌనిక ఏం చెప్తుంది ఆ తర్వాత బాలు వచ్చి ఏం చేస్తాడు అన్నది రేపు ఎపిసోడ్ లో చూడాలి..