Allu Arjun’s house attack: అల్లు అర్జున్ ఇంటిపై దాడి వెనుక ఏం జరుగు తోంది? దాని వెనుక ఎరున్నారు? కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణలు వెనుక అసలు గుట్టు అదేనా? రెండు వారాలుగా లేని హడావుడి ఇప్పుడే ఎందుకు? కావాలనే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారా? అవుననే అంటున్నాయి ఆ హస్తం పార్టీ వర్గాలు.
నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. గడిచిన మూడు వారాలుగా సైలెంట్‌గా ఉన్నారు కొందరు ఆందోళనకారులు. ఉన్నట్లుండి దాడికి పాల్పడం వెనుక ఎవరైనా ఉన్నారా? అనేదానిపై కూపీలాగే పనిలో పడ్డారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్‌ని సేకరించారు. దాని ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గురించే పనిలో పడ్డారట పోలీసులు.
హీరో ఇంటిపై దాడి చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలేనని ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ కార్యకర్తలను కేటీఆర్ ఉసి గొలిపి కుట్ర చేస్తున్నారని విమర్శలు గుప్పించారు నేతలు. దాడి చేసిన వారిలో రెడ్డి శ్రీనివాస్ వున్నాడని, గతంలో బీఆర్ఎస్ కండువా వేసుకొని కేటీఆర్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్‌మీడియాలో సర్య్కులేట్ అవుతున్నాయి.
ఈ తరహా కుట్రలు చేయడంలో బీఆర్ఎస్‌కు వెన్నుతో పెట్టిన విద్యగా వర్ణిస్తున్నారు. అంతెందుకు లగచర్ల ఘటనలో ఏకంగా రైతులను రెచ్చగొట్టి కలెక్టర్‌పై దాడి చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు కొందరు నేతలు. ఏదో విధంగా రేవంత్ సర్కార్‌ను బద్నామ్ చేసే విధంగా కుట్ర జరుగుతుందని అంటున్నారు. ఫార్ములా ఈ-రేసు వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు పన్నాగం పన్నారని అంటున్నారు.
ALSO READ: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ, ఫారెన్‌లో సమావేశం
దాడులకు తెగబడే సంస్కృతికి కాంగ్రెస్‌కు లేదని, అలా చేసిన సందర్భాలు లేవంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు నేతలు. నటుడి ఇంటిపై దాడిని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఖండిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట తర్వాత పదే పదే ఎక్స్‌లో ప్రస్తావించిన బీఆర్ఎస్, ప్రస్తుతం ఎందుకు సైలెంట్‌గా ఉందని కొందరు గుర్తు చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో కారు నేతలు డిఫెన్స్‌లో పడిపోయారు. ఈ ఇష్యూని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ బీజేపీ. తొలిరోజు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి బన్నీకి మద్దతుగా మాట్లాడారు. మరుసటి రోజు తెలంగాణ మాజీ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా నోరు విప్పారు.
ఈ క్రమంలో ఎలా రియాక్ట్ కావాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు కారు పార్టీ నేతలు. ఈ అంశంలో ఎటు మాట్లాడినా కారు పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఒకప్పుడు ప్రతీ ఇష్యూపై బలంగా నోరు విప్పే కారు పార్టీ నేతలు, ఇప్పుడు సైలెంట్‌గా ఉండిపోతున్నారు. బహుశా ఇలాంటి పరిస్థితి కారు పార్టీ కెరీర్‌లో ఎన్నడూ లేదని నేతల మధ్య గుసగుసలు లేక పోలేదు. దీనిపై కారు పార్టీ కక్కలేక మింగలేక ఇబ్బందులు పడుతోంది.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో ట్విస్ట్….?
అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది BRS కార్యకర్తలే
అంటూ కాంగ్రెస్ ఆరోపణబీఆర్ఎస్ కార్యకర్తలను కేటీఆరే ఉసిగొలిపి కుట్ర చేస్తున్నారని విమర్శలు
రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ బీఆర్ఎస్ కండువా వేసుకొని కేటీఆర్ తో దిగిన ఫోటోను సోషల్… pic.twitter.com/dVAmC8EKAa
— BIG TV Breaking News (@bigtvtelugu) December 22, 2024