BigTV English

Tollywood: నేడే సీఎంతో టాలీవుడ్ సెలబ్రిటీల భేటీ.. సంక్రాంతికి సీన్ మారుతుందా.?

Tollywood: నేడే సీఎంతో టాలీవుడ్ సెలబ్రిటీల భేటీ.. సంక్రాంతికి సీన్ మారుతుందా.?

Tollywood: మామూలుగా రాజకీయ ప్రముఖులకు, సినీ సెలబ్రిటీలకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. అది అలా కొనసాగితేనే సినీ పరిశ్రమ కూడా బాగుంటుంది. కాస్త తేడా వచ్చినా కూడా కచ్చితంగా సినీ పరిశ్రమపై పడే ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. ఇప్పటికే ఇది ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. తాజాగా మరోసారి అదే జరుగుతోంది. అల్లు అర్జున్‌పై కేసు, అరెస్ట్.. వీటన్నింటిపై వల్ల మొత్తంగా టాలీవుడ్‌పై భారీ ఎఫెక్ట్ పడుతోంది. దీని ఎఫెక్ట్‌ను తగ్గించే పవర్ కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంది. అందుకే ఆయననే కలిసి ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సినీ ప్రముఖులు డిసైడ్ అయ్యారు. నేడే భేటీకి సిద్ధమయ్యారు.


సీఎం నిర్ణయం

‘పుష్ప 2’ ప్రీమియర్ షో చూడడానికి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వెళ్లాడు. తనను నేరుగా చూడడానికి ప్రేక్షకుల్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందింది. అలా సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులరాలు తొక్కిసలాట వల్ల మృతిచెందడం అనేది చాలా పెద్ద విషయం. అందుకే అల్లు అర్జున్ రావడం వల్లే ఇలా జరిగిందని తనపై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. అంతే కాకుండా ఈ విషయంపై అసెంబ్లీలో సైతం మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్ షోలు, పెయిడ్ ప్రీమియర్స్ ఉండవని, ఇష్టం వచ్చినట్టు టికెట్ ధరలు పెంచడానికి ఒప్పుకోమని ప్రకటించారు.


Also Read: సీఎం వద్దకు మామ అల్లుళ్ళు

మొత్తం 36 మంది

పెయిడ్ ప్రీమియర్స్, టికెట్ ధరలు పెంచడం అనేది పాన్ ఇండియా సినిమాలకు చాలా కీలకం. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా అమలు అయితే మాత్రం ఎన్నో సినిమాలపై భారీ ఎఫెక్ట్ పడక తప్పదు. అందుకే నిర్మాత దిల్ రాజు ముందుకొచ్చి తానే స్వయంగా రేవంత్ రెడ్డితో మాట్లాడి అటు రాజకీయాలకు, ఇటు సినీ పరిశ్రమకు బ్రిడ్జిగా ఉంటానని మాటిచ్చాడు. గురువారం ఉదయం 10 గంటలకు బంజారా హిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌లో ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సినీ పరిశ్రమ నుండి చిరంజీవి, వెంకటేశ్, అల్లు అరవింద్‌, దిల్ రాజు, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ, త్రివిక్రమ్, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వంశీ, దగ్గుబాటి సురేశ్, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ యెర్నేని, రవిశంకర్.. ఇలా మొత్తం 36 మంది ఈ మీటింగ్‌కు వెళ్లనున్నారు.

పవన్ రియాక్షన్ ఏంటో.?

మామూలుగా సినీ పరిశ్రమకు సంబంధించి రాజకీయ నాయకులతో ఎలాంటి మీటింగ్ జరిగినా చిరంజీవి అక్కడ ఉంటారు. కానీ ఈసారి ఈ మీటింగ్ ముఖ్యంగా అల్లు అర్జున్ కోసమే. ఇప్పటికే అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య సంబంధాలు సరిగా లేకపోయినా చిరు మాత్రం ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటో.? అసలు ఆయనకు ఈ మీటింగ్ ఇష్టం ఉందో లేదో.? అని అందరిలో సందేహాలు మొదలయ్యాయి. మొత్తానికి ఈ మీటింగ్ ఎలా సాగుతుందా అని కూడా అందరిలో ఆసక్తి మొదలయ్యింది. సినీ ప్రముఖులకు కేవలం గంటన్నర మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చారు సీఎం. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుండి కర్ణాటక బయల్దేరనున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×