BigTV English

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి షాకిచ్చిన చిన్న కోడలు.. పెళ్లిని ఆపేందుకు బాలు ప్రయత్నం..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి షాకిచ్చిన చిన్న కోడలు.. పెళ్లిని ఆపేందుకు బాలు ప్రయత్నం..

Gundeninda GudiGantalu Today episode December 27th : నిన్నటి ఎపిసోడ్ లో.. నీలకంఠం ఇంటికి ప్రభావతి సత్యం వెళతారు.. మా అబ్బాయి ఇలా చేసినందుకు మేం బాధపడుతున్నామండీ అనేసి అనగానే నేను మీరు ఇంత అవమానం చేస్తే క్షమిస్తానని అనుకున్నారా అని అంటాను అనుకున్నారు కదా కంగారు పడకండి బావగారు.. ఇంత జరిగినా కూడా నా కొడుకు మీ అమ్మాయినే చేసుకుంటానని పటు బట్టి కూర్చున్నాడు.. అందుకే మీ సంబంధాన్ని ఇప్పటికీ మేము చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నామని నీలకంఠం చెప్పగానే ప్రభావతి సత్యం సంతోషపడతారు. ఇక బాలు నీలకంఠం ఇంటికి వెళ్తాడు. బయట గొడవ చేస్తారు అది గమనించిన సంజీవ్ బాలుని చూసి ఇంకాస్త గొడవలు పెట్టాలని ప్లాన్ చేస్తాడు. బాలుకు చెప్పడానికి సత్యం చెప్పడానికి ప్రయత్నించినా కూడా వినడు. దాంతో సత్యం చెంప పగలగొడతాడు.. ఇంటికి వెళ్లి పెళ్లి ఫిక్స్ అయ్యిందని అందరు ఒప్పుకుంటారు. బాలు మాత్రం మౌనంగా ఉంటారు.. ఉదయం ఇంట్లో అందరు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. బాలు మాత్రం ఎలాగైనా ఆపలని చూస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెడతారు. మనోజ్ రోహిణి లు పెళ్లి పనులు చురుగ్గా పనిచేస్తారు. సత్యం పెళ్లి కార్డులను తీసుకొచ్చి ప్రభావతి ఇస్తాడు. సంజు ప్రభావతి కి ఫోన్ చేసి మౌనికకిస్తారని అడుగుతాడు. ఇక ప్రభావతి ఆనందం తట్టుకోలేక బాలు మీనాలను తోసుకొంటూ మౌనికకు ఫోన్ ఇస్తుంది. మౌనిక కూడా మంజుతో హ్యాపీగా ఫోన్ మాట్లాడుతుంది ఇక మీనా వచ్చేసి సంబంధం అందరికీ నచ్చిందండి మౌనిక కూడా చాలా సంతోషంగా ఉంది ఇక మీరు మీ ఆలోచనని మానుకోండి అని అడుగుతుంది. బాలు మాత్రం ఆ దుర్మార్గున్ని నా చెల్లికి ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు మీనా అని బాధపడతాడు. మీరేం చేయలేరండి పెళ్లి చూడ్డం తప్ప అనేసి మీనా అంటుంది.. ఇక బాలు నా చెల్లి పెళ్లిని ఎలా అపాలని చూస్తున్నాను వాడు ఒక ఎదవని నేను ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు మీనా అని బాలు అంటాడు. బాధపడుతూ ఒంటరిగా కూర్చుంటాడు బాలు.. ఇక సత్యం అక్కడికి రాగానే మీనా మామయ్య ఇది ఆయన వరుస మీరే చెప్పండి మావయ్య అనేసి అంటుంది.

సత్యం అనవసరంగా లేని ఇబ్బందులు తీసుకురాకు. చెల్లి పెళ్లి పనులను చేయమని, నువ్వు చెయ్యి వేస్తేనే కదరా.. పెళ్లి పనులు జరిగేవి అని అంటాడు. అప్పుడే సుశీల వస్తుంది. ఈ విషయాలను మీ బామ్మకు చెప్పొద్దూ అని సత్యం అంటాడు. అందరి బాగోగులు అడుగుతూ పెళ్లి సందడిని రెట్టింపు చేస్తుంది. కానీ, బాలు సైలెంట్ గా ఉండడంతో సుశీలమ్మకు.. అనుమానం వస్తుంది. ఏంట్రా ఏమైందని బాధని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు. మరి రవి గాడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తుంది. వాడు బిజీగా ఉన్నాడని వాడు వర్క్ చేసే హోటల్లో వాడికి లీవ్.. ఇవ్వడం లేదని అంటాడు సత్యం. కానీ ప్రభావతి మాత్రం బాధ పడుతుంది. రవి లేకుండా ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదండి అని బాధపడుతుంది దానికి సత్యం నేనైతే వెళ్లి పిలవను నువ్వు పిలుచుకుంటానంటే పిలుచుకో అనేసి చెప్తాడు ఇక ప్రభావతి కామాక్షి కి ఫోన్ చేసి రవి ఇంటికి వెళుతుంది. అక్కడ శృతి ఉండదు రవి గరిట పట్టుకో ఉండడం చూసి ప్రభావతి నువ్వే గరిట పట్టుకోవడం అవసరమా అని సలహాలిస్తుంది.


ఇక అప్పుడే శృతి వస్తుంది మౌనిక పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్పగానే శృతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంటికి రమ్మని పిలిస్తే బాలు ఉన్నాడు మేం రావడం అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని నాన్న ఇబ్బందులు పెడతారు అనేసి శృతి అంటుంది ఇక ప్రభావతి మాత్రం శృతిని ఎలాగైనా ఒప్పించి తీసుకురారా మీరు లేరన్న బాధ మౌనికకుండకూడదు కదా అనేసి అంటుంది. సరే అమ్మ నేను ఒప్పించి తీసుకొస్తాలే అని రవి అంటాడు. మరో వైపు బాలు తన చెల్లి పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. రాజేష్ కి ఫోన్ చేసి రమ్మంటాడు. రాజేష్ రాగానే ఏంటా రమ్మని పిలిచావంటే పెళ్లికి వెళ్ళడానికి ఒక కారులో ఎలా సరిపోతారు రా నువ్వు వస్తే కాస్త తోడుగా ఉంటుంది కదా అనేసి అంటాడు. పెళ్లి ఇష్టం లేదు కదరా అంటే అవును నాకు పెళ్లి ఇష్టం లేదు ఆ దుర్మార్గుడికి నా చెల్లి నుంచి పెళ్లి చేసేదే లేదు అని అంటాడు. మరి కాంప్రమైజ్ చేయవా ఏంటి పెళ్లికి రమ్మంటున్నావుగా అనేసి రాజేష్ అడుగుతాడు. దానికి బాలు పెళ్ళికొడుకు నువ్వు కిడ్నాప్ చేస్తాను అని అనగానే రాజేష్ షాక్ అవుతాడు. మర్డర్ చేయట్లేదు రా కిడ్నాప్ చేస్తానని చెప్తున్నాను అందుకే ఈ డ్రామా అంతా నువ్వు పెళ్లికి రావాల్సిందే ఇప్పుడు అనేసి రాజేష్ అంటాడు.

ఇక ఇంట్లో అందరూ రెడీ అయ్యి కిందకు వస్తారు.. ప్రభావతి రెడీ అయ్యి కిందకు వస్తుంది. ఇక మీనా ను పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు పూజ కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసావా అన్ని సర్ది పెట్టావా అనేసి అనగానే మీరు ఇచ్చిన లిస్టు ప్రకారం నేను అమ్మమ్మ గారు అన్ని సర్ది పెట్టమనేసి అంటుంది. సుశీల నువ్వు కన్నెపిల్ల లాగా రెడీ చేస్తుంటే మేము మాత్రం ఎలా చూస్తూ ఊరుకుంటాం అన్ని సద్దిపెట్టామనేసి అంటుంది. సత్యం కూడా కిందకి వస్తాడు. బాలు ఏడమ్మా ఇంకా రాలేదు అంటే బాలు అప్పుడే పైనుంచి వస్తాడు. బాలుని చూసి సుశీల అచ్చం మీ తాత లాగే ఉన్నావని మురిసిపోతుంది. ఇక మీనా ను బాలు ఎలా ఉన్నానని అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×