BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ వర్కౌట్ అవుతుందా? శృతి సంజు గురించి నిజం చెప్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: బాలు ప్లాన్ వర్కౌట్ అవుతుందా? శృతి సంజు గురించి నిజం చెప్తుందా..?

Gundeninda GudiGantalu Today episode December 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. సత్యం ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెడతారు. మనోజ్ రోహిణి లు పెళ్లి పనులు చురుగ్గా చేస్తారు . సత్యం పెళ్లి కార్డులను తీసుకొచ్చి ప్రభావతి ఇస్తాడు. సంజు ప్రభావతి కి ఫోన్ చేసి మౌనికకిస్తారని అడుగుతాడు. ఇక ప్రభావతి ఆనందం తట్టుకోలేక బాలు మీనాలను తోసుకొంటూ మౌనికకు ఫోన్ ఇస్తుంది. మౌనిక కూడా మంజుతో హ్యాపీగా ఫోన్ మాట్లాడుతుంది ఇక మీనా వచ్చేసి సంబంధం అందరికీ నచ్చిందండి మౌనిక కూడా చాలా సంతోషంగా ఉంది ఇక మీరు మీ ఆలోచనని మానుకోండి అని అడుగుతుంది. బాధపడుతూ ఒంటరిగా కూర్చుంటాడు బాలు.. ఇక సత్యం అక్కడికి రాగానే మీనా మామయ్య ఇది ఆయన వరుస మీరే చెప్పండి మావయ్య అనేసి అంటుంది. సత్యం సర్ది చెప్తాడు. అప్పుడే ఇంట్లోకి సుశీల వస్తుంది. బాలు మౌనంగా ఉండటం చూసి అనుమాన పడుతుంది. ఇక ఇంట్లో అందరు సంతోషంగా ఉంటారు. రవి గాడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తుంది. వాడు బిజీగా ఉన్నాడని వాడు వర్క్ చేసే హోటల్లో వాడికి లీవ్.. ఇవ్వడం లేదని అంటాడు సత్యం. కానీ ప్రభావతి మాత్రం బాధ పడుతుంది.. పెళ్లికి ఒక్కరోజే ఉండటంతో హడావిడి చేస్తుంది ప్రభావతి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు తన చెల్లి పెళ్లిని ఎలాగైనా చెడగొట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. రాజేష్ కి ఫోన్ చేసి రమ్మంటాడు. రాజేష్ రాగానే ఏంటా రమ్మని పిలిచావంటే పెళ్లికి వెళ్ళడానికి ఒక కారులో ఎలా సరిపోతారు రా నువ్వు వస్తే కాస్త తోడుగా ఉంటుంది కదా అనేసి అంటాడు. బాలు పెళ్ళికొడుకు నువ్వు కిడ్నాప్ చేస్తాను అని అనగానే రాజేష్ షాక్ అవుతాడు. మర్డర్ చేయట్లేదు రా కిడ్నాప్ చేస్తానని చెప్తున్నాను అందుకే ఈ డ్రామా అంతా నువ్వు పెళ్లికి రావాల్సిందే ఇప్పుడు అనేసి రాజేష్ అంటాడు. ఇంట్లో అందరూ రెడీ అయ్యి కిందకు వస్తారు.. ప్రభావతి రెడీ అయ్యి కిందకు వస్తుంది. ఇక మీనా ను పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు పూజ కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసావా అన్ని సర్ది పెట్టావా అనేసి అనగానే మీరు ఇచ్చిన లిస్టు ప్రకారం నేను అమ్మమ్మ గారు అన్ని సర్ది పెట్టమనేసి అంటుంది. సుశీల నువ్వు కన్నెపిల్ల లాగా రెడీ అవుతుంటే మేము మాత్రం ఎలా చూస్తూ ఊరుకుంటాం అన్ని సద్దిపెట్టామనేసి అంటుంది. సత్యం కూడా కిందకి వస్తాడు. బాలు ఏడమ్మా ఇంకా రాలేదు అంటే బాలు అప్పుడే పైనుంచి వస్తాడు. బాలుని చూసి సుశీల అచ్చం మీ తాత లాగే ఉన్నావని మురిసిపోతుంది. ఇక మీనా ను బాలు ఎలా ఉన్నానని అడుగుతాడు. చాలా బాగున్నారు మీలో ఇంత సడన్ మార్పు ఏంటో నాకు అర్థం కావట్లేదని మీనా డౌట్ పడుతుంది.

పెళ్లిలో ఎవరితో గొడవపెట్టుకోవద్దని కొడుకుకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. నేను ఏం చేసినా మీరు ఈ పెళ్లి ఆపరని తెలిసినప్పుడు నేను ఎందుకు గొడవ పెట్టుకుంటానని బాలు అంటాడు.. ఈ సంబంధం మీ అందరికీ నచ్చింది నేనేం చెప్పినా మీరు వినట్లేదు. నేనేం చేసినా నా చెల్లి సంతోషం కోసమే చేస్తాను అది మీ అందరికీ తెలుసు అనేసి బాలు సెటైర్లు వేస్తాడు. కానీ ప్రభావతి మాత్రం బాలు మీద అనుమానంతోనే ఉంటుంది. పెళ్లి కావలసిన ఏర్పాట్లు అన్నిటిని ప్రభావతి సుశీల వెళ్లి మళ్లీ ఒకసారి చూస్తారు. అప్పుడే కామాక్షి రంగా అక్కడికి వస్తారు. బాలును చూసిన కామాక్షి సెటైర్లు వేస్తుంది. ఏంటి బాలు రెడీ అయ్యాడు నేను అస్సలు నమ్మలేకున్నా అని అనగానే నీకోసమే అత్తా రెడీ అయ్యానని కౌంటర్ వేస్తాడు. వాళ్ళిద్దరి కౌంటర్లకి అక్కడున్న వాళ్లంతా పడి పడి నవ్వుతారు.. ఇక బాలు ఏమైందో తెలియకుండానే యాక్టివ్ గా పని చేస్తాడు. ఇక అందరూ కలిసి నీలకంఠ మీ ఇంటికి వెళ్తారు.


అటు రవి తన ఒక్కదాని ఒక చెల్లి పెళ్లికి వెళ్లలేకపోతున్నానని బాధపడతాడు. శృతి రవి బాధను చూసి నువ్వెందుకు ఇలా అన్నావ్ రవి అనేసి అడుగుతుంది. నువ్వు మా అన్నయ్య గురించి పక్కన పెట్టు కానీ మౌనిక నా చెల్లెలు ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు. నా చేతుల మీదగా జరగాల్సిన పెళ్లికి నేను గెస్ట్ గా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ నువ్వు ఇది కూడా వద్దని అంటున్నావు. నాకు బాధగా అనిపించదా చెప్పు శృతి అనేసి బాధపడతాడు. రవి బాధను చూసి శృతి అక్కడ ఎవరేమన్నా నేను ఒప్పుకునేది లేదు కానీ పెళ్లికొస్తాను అనేసి ఒప్పుకుంటుంది. శృతి చెప్పిన మాటను సంతోషంగా తన తల్లితో చెప్తాడు. ఇక పెళ్లిలో బాలు హడావిడి ఎక్కువగా ఉంటుంది నీలకంఠం సంజు బాలుని చూసి షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో బాలును సంజు బయటకు పంపించాలని అనుకుంటాడు. అప్పుడే శృతి వాళ్ళు అక్కడికి వస్తారు మరి శృతి సంజు గురించి నిజం చెప్తుందా? లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి…

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×