BigTV English
Advertisement

Gundeninda Gudigantalu Today Episode : బాలు మనసులో మీనాకు చోటు.. బయటపడ్డ రోహిణి నిజస్వరూపం..

Gundeninda Gudigantalu Today Episode : బాలు మనసులో మీనాకు చోటు.. బయటపడ్డ రోహిణి నిజస్వరూపం..

Gundeninda GudiGantalu Today episode December 7th : నిన్నటి ఎపిసోడ్ లో..  ఇక బాలు  బెడ్ రూమ్ లో మీనాను తిడతాడు. పెళ్ళాం చేత చెప్పించాడు.. ఎదవ అని వాడు ఊరంతా చెప్పుకుంటాడు. నీకు సంతోషమా అంటాడు. దాన్ని బయట నుంచి బాలు సత్యం వింటాడు. అవును తప్పు చేసేటప్పుడు లేని పౌరుషం ఇప్పుడు ఎందుకు వచ్చింది. ఇక్కడ మీకు మీరే గొప్ప అనుకుంటున్నారు అని మీనా కడిగిపడేస్తుంది.. మీకు ప్రపంచంలో ఎక్కడా ఎవరికీ లేనంత పౌరుషం ఉంది కాదా.. మీరెందుకు అడుగుతారు.అవసరమైతే పల్లెటూర్లలో చెరువులలో బర్లు తోముతారు. ఎవరేమన్నా వారి కార్లను కడుగుతారు. మీ జీవితంలో మీరు ఎన్నడైనా దొంగతనం చేశారా? అలా పరాయి వాళ్ళు మీపై దొంగతనం నింద వేస్తే మీరు సైలెంట్ గా ఉన్నప్పుడైనా నా మనసు చచ్చిపోయింది.. అప్పుడు నోరు మెదపరు కదా అని అడుగుతుంది. అసలు వాడిని నేను క్షమించమని అడగను.. అసలు వాడు నన్ను ఎమన్నాడో తెలుసా అని నేను డబ్బులు ఇచ్చినా మీ నాన్న చనిపోతే నాకు డబ్బులు ఎవరిస్తారు అని అడిగాడు అందుకే వాని కొట్టాను. ఇప్పుడు చెప్పు నేను వెళ్లి వారిని క్షమాపణలు అడగాలా అనేసి మీనా అని అడుగుతాడు బాలు. మీనా ఈ విషయం నాకు చెప్పలేదు కదా ఇంటి పత్రాలు గురించి పదేపదే నాకు చెప్తుంటారు మరి ఈ విషయాన్ని ఎందుకు నాకు చెప్పలేదు అనేసి అంటుంది. సత్యం ప్రభావతిని పిలిచి తాను ఇంటి కాగితాలను తాకట్టు పెట్టాలని భావిస్తున్నానని, బాలుకి మంచి జీవితం ఇవ్వాలని, వాడు తనకోసం కారును అమ్మేసుకున్నాడని, ఇప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నాడు. ఇల్లు కాగితాలను తాకట్టు పెట్టి.. కారు తీసుకోవాలని భావిస్తున్నానని చెప్తాడు.. ఆ మాటకు ప్రభావతి ఒప్పుకోను అంటుంది. చివరికి ఒప్పుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ విషయానికొస్తే.. ఉదయం ఇంట్లో బాలు టిఫిన్ చేయడానికి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తాడు. మీనా అతనికి టిఫిన్ వడ్డిస్తుంది. ఇంతలోనే ప్రభావతి వచ్చి.. మిగతా వాళ్ళకి ఉందో లేదో.. చూసుకుంటూ వడ్డించు.. మొత్తం వాడికే వడ్డించకంటూ వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో బాలుకు కోపం వస్తుంది. అందుకే తాను కార్లకున్న దుమ్ము కడగడానికి వెళ్తున్నానని, ఇలాంటి మాటలు తనకు పడడం ఇష్టం లేదని అంటాడు. ఈ సమయంలో ప్రభావతి.. ఏం చేస్తున్నావ్ అంటూ రోహిణి తో మాట్లాడుతుంది. తాను అకౌంట్స్ చూస్తున్నానని, రేపు మేడం వస్తుందంటూ రోహిణి నోరు జారుతుంది. నువ్వే కదా పార్లర్ కు మేడం.. మళ్లీ మేడం అంటున్నావు అని అడుగుతుంది ప్రభావతి. మేడం అంటే ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అని, ఆమె వచ్చి ఆడిటింగ్ చేస్తుందంటూ కవర్ చేస్తుంది. దీంతో ప్రభావతి.. నువ్వు ఒక్కదానివేనమ్మ ఇంట్లో పని పనిచేసే దానివి.. ఇంట్లో తిని కూర్చునేవారు ఎక్కువయ్యారు అంటుంది. దీంతో రోహిణి కూడా షాక్ అవుతుంది. అలా అంటున్నారేంటీ.. మనోజ్ కూడా జాబ్ చేస్తున్నాడు కదా అని ప్రశ్నిస్తుంది. హ చేస్తున్నాడు అని ప్రభావతి అంటుంది. కానీ బాలు వాళ్లకు రోహిణి మీద అనుమానం మొదలవుతుంది. రోహిణి ఏదో కవర్ చేసుకోవాలని ఏదో ఒకటి చెప్తుంది. అవును ఆంటీ ఇంతకీ మనోజ్ మీకు డబ్బులు ఎంత ఇస్తున్నాడు అనేసి అడగని మనోజ్ షాక్ అవుతాడు. అబద్ధాలు చెప్పడం కంటే జాబ్ చేయడమే ఈజీగా ఉందని మనసులో అనుకుంటాడు.

నాని ఎక్కడ కనిపించట్లేదని బాలు మీనాను అడుగుతాడు. ఏమో అండి టిఫిన్ కూడా చేయలేదు బయటికి వెళ్ళాడు ఇంకా రాలేదు అనేసి మీనా అంటుంది. నాన్న బయటికి వెళ్తుంది నువ్వేం చేస్తున్నావ్ టైం కి తినాలి టాబ్లెట్ వేసుకోవాలని చెప్పాలని లేదా అనేసి మీనా పై బాలు అరుస్తాడు. అందరి మీద పడి అందరు ఏడుస్తుంటారు కానీ నాన్నను పట్టించుకునే వాళ్ళు ఒకరు లేరు అనేసి ప్రభావతిని చూసి అంటాడు. ఇక అప్పుడే సత్యం కంగారుగా లోపలికి వస్తాడు. ఇక బాలు టిఫిన్ చేసి లేస్తాడు. అరె బాలు నువ్వు అర్జెంటుగా బయటికి రా అనేసి అనగానే ఏమైంది అన్న ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఏమైంది చెప్పు అనేసి అడుగుతాడు. అమ్మ నువ్వు కూడా రా అమ్మ మీనా అనేసి మీనాను కూడా తీసుకొని బయటికి వెళ్తాడు. ఏమైంది మామయ్య ఏమైంది చెప్పండి అంటే ముందు మీరు బయటికి రండి చెప్తానని సత్యం అంటాడు. ఇక అందరూ బయటికి వెళ్లి చూడగానే అక్కడ కారు ఉంటుంది.


దాన్ని చూసిన బాలు సంతోషంలో మునిగిపోతాడు. ఈ కార్ ది నమ్మేసాను కదా నాన్న మీకు ఎలా వచ్చింది ఎవరిచ్చారు అయినా ఒకసారి నడుపుకోమని ఇచ్చారా ఏంటి అనేసి అడుగుతాడు. పక్కనే ఉన్న బాలు ఫ్రెండ్ బాబాయ్ నీకోసం ఈ కారును కొన్నాడు అనేసి చెప్తాడు. మళ్లీ ఎందుకు నాన్న నువ్వు ఇంత డబ్బులు పోసి మళ్ళీ కొన్నావు అనేసి అనగానే ప్రభావతి కౌంటర్లు ఇస్తుంది. నాకోసం నువ్వు అమ్మవురా అందుకే నేనే దీని కొన్నాను అనేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక మీనాకిచ్చి ఇదిగో అమ్మ నీ చేత్తో తాళాలు ఇస్తే మంచిది అని బాలుకి ఇవ్వమని చెప్తాడు. మీనా వల్లే కారు పోయింది ఇప్పుడు మీనా వల్లే కారు వచ్చిందని బాలు కూడా అనుకుంటాడు. కారు తీసుకురావడానికి అంత డబ్బులు మీకు ఎలా వచ్చాయి నాన్న అని బాలు అడుగుతాడు. నాకోసం నువ్వు చూసుకున్నావు నీకోసం నేను చూడకపోతే ఎలా తండ్రికి అర్థం వేరే అయిపోతుంది అనేసి సత్యం అంటాడు. కానీ బాలు మాత్రం అంత డబ్బులేసి మళ్లీ తీసుకోకపోతే ఏమైంది నాన్న అనేసి బాధపడతాడు. తండ్రి కొడుకుల సెంటిమెంట్ సీన్ కాస్త ఎపిసోడ్కి హైలైట్ అవుతుంది. ఇక మీనాన్ని తీసుకొని అలా బయటికి వెళ్ళేసి రా అప్పు అనేసి సత్యం వాళ్ళిద్దర్నీ పంపిస్తాడు.

బాలుకు అంత డబ్బులు ఇచ్చి మళ్లీ కారు కొని ఇవ్వాల్సిన అవసరం ఏంటని మనోజ్ రోహిణి ఇద్దరు మాట్లాడుకుంటారు. ప్రభావతి కూడా వాళ్లకి వత్తాసు పలుకుతుంది. ఇక మీనా మామయ్య ఆపరేషన్ కోసం డబ్బులు కోసమే కారమ్మాడు ఇప్పుడు మావయ్య తెచ్చి ఇచ్చాడు మధ్యలో మీదేంటి అని అంటుంది. ఇక మీనా తీసుకొని బయటికి వెళ్ళమని సత్యం పంపిస్తాడు. మీనా ను తీసుకొని బయటికి వెళ్లిన బాలు తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. తన ఫ్రెండుని మీనాక్షి సారీ చెప్పాలని నువ్వు ఈ మాట చెప్పు అనేసి చెప్తాడు. వాడు నీతో ఏదో చెప్పాలంటమ్మా అనేసి అతను అంటాడు. ఏంటి అన్నయ్య అంటే.. నీవల్లే కారు పోయింది నీవల్లే కార్ వచ్చిందని వాడు సంతోష్ పడిపోతున్నాడనేసి అతను చెప్తాడు. ఆ మాటేదో అతనే చెప్పొచ్చు కదా అనేసి మీనా అంటుంది. మరోవైపు మీనా ను ఫాలో చేస్తూ మనోజ్ వెళ్తాడు. పార్లర్ లో పనిచేస్తున్న విషయం మనోజ్ కి తెలిసినట్టు ఉంటుంది. మరి ఆ విషయాన్ని బయట పెడతాడా లేదా చూడాలి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Deepthi Manne: ‘జగద్ధాత్రి’ సీరియల్ హీరోయిన్‌ పెళ్లి సందడి షురూ.. హల్తీ ఫోటోలు వైరల్!

Illu Illalu Pillalu Today Episode: నర్మద, వేదవతి మధ్య గొడవ.. ధీరజ్ కు దిమ్మతిరిగే షాక్.. పారిపోయిన భాగ్యం..

Brahmamudi Serial Today November 6th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీ గురించి నింజ తెలుసుకున్న రాహుల్‌

GudiGantalu Today episode: బాలు, మీనా మాటలతో షాక్.. ప్రభావతికి టెన్షన్ టెన్షన్.. సుశీల రాకతో హ్యాపీ..

Nindu Noorella Saavasam Serial Today November 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ కడుపులో పిండాన్ని చంపలేమన్న చంభా

Intinti Ramayanam Today Episode: పల్లవిని అవమానించిన ఫ్రెండ్.. చక్రధర్ పై పల్లవి సీరియస్.. మీనాక్షికి షాక్..

Gundeninda Gudigantalu Prabhavathi : ప్రభావతిలో ఈ టాలెంట్ కూడా ఉందా..? కూతురు, కొడుకుతో కలిసే ఆ పని..

Big Stories

×