Gundeninda GudiGantalu Today episode February 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం లేవగానే మీనా బట్టలను ఉతకడానికి బయటకు వస్తుంది. అక్కడున్న బట్టలు చూసి షాక్ అవుతుంది. ఇన్ని బట్టలు ఉతకాలని ఆలోచిస్తూ ఉంటుంది అంతలోకే ప్రభావత అక్కడికి వచ్చి ఏంటే ఇంకా చూస్తున్నావు తొందరగా కానీ ఇంకా ఇల్లు తుడవాలి అనేసి అంటుంది. ఇన్ని బట్టలు నేను అక్క దాన్ని ఎలా ఉతుకుతానని అంటుంది. అన్ని ఒకేసారి వేయకుంటే రోజ్ బట్టలు రోజు వేస్తే ఉతుకుతాను కదా ఇన్ని బట్టలు ఎలా ఉతుకుతానని అని మీనా అంటుంది. ఇక అప్పుడే రోహిణి బట్టలు తీసుకుని వస్తుంది నా బట్టలేని ఉతికేసుకున్నాను మీనా మనోజ్ బట్టలు ఉతుకుతావా నాకు అర్జెంట్గా క్లైంట్ రమ్మని ఫోన్ చేశారనేసి అంటుంది. మీ ఆయన బట్టలు నేనెందుకు ఉతుకుతాను. మీ అబ్బాయి బట్టలు కదా మీరే ఉతకండి అని ప్రభావతికి ఇస్తుంది అంతలోపే శృతి అక్కడికి వస్తుంది. ఇన్ని బట్టలు నా బట్టలు ఎలా ఉతుకుతావులే అనేసి అంటుంది. పర్వాలేదు శృతి నేను చేస్తానులే అనేసి అంటుంది. నువ్వు ఇన్ని బట్టలుతుకుతున్నావు నీ కష్టాన్ని ఎవరు గుర్తించలేదని మీ నాకు శృతి డబ్బులు ఇస్తుంది. అయితే ప్రభావతి మాత్రం మేము డబ్బులు ఇవం నీకు తిండి పెడుతున్నాను కదా నువ్వు ఇప్పుడు బట్టలు ఉతకచ్చు అనేసి తిడుతుంది. అది మీనా బాలుకు చెప్తుంది. బాలు డబ్బు ఇచ్చారు అని అడిగితే శృతి ఇచ్చిందని చెప్తుంది మీనా.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా బట్టలు ఉతికినందుకు శృతి డబ్బులు ఇస్తుంది. దాంతో మీనా చాలా బాధపడుతుంది. ఆ డబ్బును రవికి తిరిగికి ఇవ్వమని భర్త బాలుతో మీనా చెబుతుంది. ఎలాంటి గొడవ పడొద్దని కూడా కోరుతుంది. శృతి డబ్బులు ఇవ్వడం పట్ల మీనా తన భర్తతో చెప్పుకుంటూ ఎంతో బాధపడుతుంది. తనకు జరిగిన అవమానం పట్ల భర్త రవి ఎవరితోనూ గొడవపడకూడదని కోరుతుంది. మీనా బాధను ఎలాగైనా పోగొట్టాలి అందరూ ముందు మీనా గర్వంగా తిరగాలి అన్నట్టు బాలు ఒక ప్లాన్ చేస్తాడు. వేకువ జామునే బాలు తన అత్తగారి ఇంటికి వెళ్లి తలుపు కొడతాడు. ఏమైంది బాబు ఈ టైంలో వచ్చారు అని పార్వతి అడుగుతుంది. ఏం లేదు మీరు అర్జెంటుగా మంచి బట్టలు వేసుకొని రెడీ అవ్వండి మీకు ఒక చోటికి తీసుకెళ్తాను. ఒక విషయం చెప్పాలి అనేసి బాలు అంటాడు. శివకి ఒక పని అప్పగిస్తాడు. ఇక బాలు సుమతి పార్వతి ముగ్గురు కలిసి కార్లు బయలుదేరుతుంటారు కానీ సుమతి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఏమైంది బావ ఎందుకు మమ్మల్ని తీసుకెళ్తున్నావ్ నీకేమి ట్రిప్పులు లేవా మమ్మల్ని ఊరంతా తిప్పాలి అనుకుంటున్నావా అనేసి సుమతి అడుగుతుంది. సరదాగా మాట్లాడుకుంటూ అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక రాజేష్ నువ్వు తొందరపెట్టి తొందరగా రమ్మని బాలు ఫోన్ చేస్తాడు. మీనా తొందరగా రెడీ అవ్వాలని అరుస్తాడు. ఎందుకని అడుగుతున్నా.. ఏమాత్రం చెప్పడు. అలాగే తమ్ముళ్లు మనోజ్, రవిని కూడా వాళ్ల భార్యలతో కలిసి రెడీ అవ్వమని చెబుతుంటాడు. ఇంట్లో వాళ్లంతా మాకేమీ చెప్పకుండా ఎందుకు రెడీ అవ్వమంటున్నావంటూ ప్రశ్నిస్తున్నారు. చెప్పడానికే రెడీ అవ్వమంటున్నానంటూ బదులిస్తాడు. డబ్బుడమ్మ, పార్లరమ్మలు త్వరగా రెడీ అయ్యి రావాలని ఫన్నీగా కామెంట్స్ పేలుస్తుంటారు. అందరూ షాక్ లో ఉంటారు. ఏదేమైనా బాలు రీజన్ లేకుండా ఏ పని చేయడని తండ్రి మద్దతిస్తాడు. వెంటనే అందరినీ రెడీ అయ్యి రమ్మంటాడు.. అయితే అందరూ రెడీ అయ్యి బయటకు వస్తారు ఏమైంది ఇంత పొద్దున్నే వీడికి రాత్రి తాగింది దిగలేదు అంటూ మనోజ్ అడుగుతాడు.
ఇకపోతే బయటికి వచ్చి ఎదురుచూస్తుంటారు. అసలేంటీరా అని బాలును అడుగుతూనే ఉంటారు. సర్ ప్రైజ్.. సర్ ప్రైజ్ అని తన ఫ్రెండ్ రాజేశ్ రాగానే అప్పటికే ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసిన పూలకొట్టును కుటుంబ సభ్యులందరికీ చూపించి సర్ ప్రైజ్ చేస్తాడు. పైగా తన తల్లి పేరు మీదుగా ప్రభావతి పూల కొట్టు, ప్రొప్రైటర్ మీనా అని బోర్డు కూడా ఏర్పాటు చేస్తాడు. అది చూసి కుటుంబీకులంతా షాక్ అవుతారు. మీనా చేత ఈ పూల కొట్టు పెట్టించాలని నేను అనుకున్నాను. ఏమంటున్నానో అంటే చాలా సంతోషంగా ఉందిరా ఇన్నాళ్లకు మంచి పని చేశావని సత్యం అంటాడు.. మాత్రం ఆ పూలు కొట్టిన చూసి షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో శృతి చేత పూల కొట్టును ఓపెన్ చేయిస్తాడు బాలు.. ఆ తర్వాత ఎం జరుగుతుందో చూడాలి..