AFG vs SA: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( ICC Champions Trophy 2025 ) భాగంగా ఇవాళ మూడవ మ్యాచ్ జరగనుంది. ఇవాల్టి మ్యాచ్ లు ఆఫ్ఘనిస్తాన్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్లు తలపడబోతున్నాయి. కరాచీ లోని ( Karachi)నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆఫ్గనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇక మ్యాచ్ మాత్రం రెండున్నర గంటలకు… ప్రారంభం కానుంది.
Also Read: IND vs BAN: గిల్ డేంజర్ సెంచరీ.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ భోణీ..!
ఈ మ్యాచ్ లో… మొదట టాస్ నెగ్గిన జట్టు… బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఇక్కడ బ్యాటింగ్ చేసిన జట్టు విజయాలు సాధించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఐసీసీ నివేదికల ప్రకారం.. బ్యాటింగ్ చేయడమే కరెక్ట్ అని అంటున్నారు. ఇక ఇరుజట్ల విషయానికి వస్తే… దక్షిణాఫ్రికా కెప్టెన్ గా టెంబ బావుమా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అతని సారథ్యంలో… దక్షిణాఫ్రికా వరుసగా విజయాలు సాధిస్తోంది.
ఇక ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య… 5 వన్డే మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఇందులో దక్షిణాఫ్రికా పై చేయి సాధించింది. ఐదు వన్డేలు జరగగా…. ఇందులో మూడింటిని సౌత్ ఆఫ్రికా గెలుచుకోవడం గమనార్హం. అటు ఆఫ్ఘనిస్తాన్ కేవలం రెండు గెలిచింది. ఇక తటస్థ వేదికల్లో… మూడు విజయం సాధించిన దక్షిణాఫ్రికా… ఇవాల్టి మ్యాచ్లో హాట్ ఫేవరెట్ గా అందరిలోకి దిగుతోంది. దీంతో… ఈ మూడవ మ్యాచ్ పైన అందరూ కనివేశారు.
ఇది ఇలా ఉండగా ఇప్పటికే… చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో… రెండు మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో… న్యూజిలాండ్ గెలిచింది. అలాగే రెండవ మ్యాచ్లో బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచ్లో… టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరి ఇవాళ జరిగే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య మ్యాచ్లో… ఏ జట్టు గెలుస్తుందో చూడాలి. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ను జియో హాట్ స్టార్ వేదికగా చూడవచ్చు. లేదా స్టార్ స్పోర్ట్స్ లో కూడా మనం తిలకించవచ్చు.
Also Read: Champions Trophy 2025: టీమ్ ఇండియా మ్యాచ్.. పాకిస్తాన్ కి బిగ్ షాక్
ఆఫ్ఘనిస్తాన్ ప్రాబబుల్ XI: రహ్మానుల్లా గుర్బాజ్ (WK), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, నంగ్యాల్ ఖరోటీ, రషీద్ ఖాన్, నూర్ అహ్
దక్షిణాఫ్రికా ప్రాబబుల్ XI: టెంబా బావుమా (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ (WK), మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, తబ్రైజ్ షమ్సీ