Gundeninda GudiGantalu Today episode February 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు మీనా ఉదయం పూల కోసమని బయటకు వెళ్తారు. ఇద్దరు మాట్లాడుకుంటూ పూలు కొనడానికి వెళ్తారు. దారిలోనే బాలు పూలకొట్టు పెట్టడానికి కారణాన్ని తెలియజేస్తాడు. డబ్బుడమ్మ శృతి, పార్లరమ్మ రోహిణిలాగే నువ్వు కూడా ఉపాధి కలిగి ఉండాలనే పూలకొట్టు ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఎప్పుడూ పూలనే కాకుండా… పక్కనే ఉండే ముళ్లను కూడా చూడాలని అన్నారు. తల్లి ప్రభావతితో మీనా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. ఇదిలా ఉంటే.. పూటకొట్టును వృద్ధిలో తీసుకొచ్చే పనులపై మాట్లాడుతూ.. ఒకరిపై ఒకరు ప్రేమ వర్షం కురిపించుకుంటారు. మీనా, బాలు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తారు. ఒకరికొకరు ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంలో మునిగి తేలుతారు.. ఈ పూల కొట్టుతో ఇంకా బిజినెస్ ని డెవలప్ చేయాలని నేను అంటుంది. అంతేకాదు మనం దీంతో పాటు ఇంకొక కారు కొంటే బాగుంటుంది అని మీనా అనగానే బాలు నేను ఇంకొక కారు కొనాలని ఇంకా ఏదో చేయాలని నీకు చేత పూల కొట్టు పెట్టించలేదు కేవలం శృతి నీకు డబ్బులు ఇచ్చి అవమానించింది అని మాత్రమే పూల కొట్టు పెట్టించాను నువ్వేం కష్టపడి అంత సంపాదించాల్సిన అవసరం లేదని బాలు అంటాడు. మనం సంపాదించి నలుగురిలో తలెత్తుకొని ఇలా చేయాలని మీరు నా చేత ఇది పెట్టించారు నేను కూడా అలానే కష్టపడి సంపాదిస్తాను అని నేను అంటుంది.. మొత్తానికి మీనా పూలుకొని తీసుకొని వస్తారు. ఇంట్లో వాళ్లంతా మీనా లేదని అంటారు. కానీ సత్యం మాత్రం అందరికి క్లాస్ పీకుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి సత్యం పడుకుని ఉంటారు.. అయితే ఎవరో తలుపు కొట్టిన సౌండ్ వినిపిస్తే ఈ టైంలో ఎవరు అని అక్కడికి వెళ్తారు. ప్రభావతి తలుపు తీసి ఎవరు మీరు ఏం కావాలి అని అడుగుతుంది. దానికి మాకు పూలదండలు కావాలంటే అర్ధరాత్రి పూలదండలు వేసేవానికి అంటే శవానికి కాదమ్మా పెళ్లి కోసమని వాళ్ళు అంటారు. పూల కొట్టుకున్నారు కదా మరి మీరే ఓనరు మాకు పూలదండలు కావాలి ఇస్తారా ఇవ్వరా అంటే పూలు లేవు ఏమి లేవు వెళ్ళండి అని ప్రభావతి అంటుంది.. ఇక సత్యం చేసి ఎవరు ప్రభావ వచ్చిందంటే పెట్టారుగా పూల కొట్టు దండల కోసం వచ్చారని వెటకారంగా మాట్లాడుతుంది. ఇక సత్యం ఏం మాట్లాడకుండా నిద్రపోతాడు.
ఉదయం లేవగానే మీనా సత్యం కు టాబ్లెట్స్ ఇస్తూ ఉంటే ప్రభావతి నీ పూల కొట్టు కోసం రాత్రి కూడా ఫ్యాన్స్ వచ్చారు అని వెటకారంగా ఉంటుంది. ఇక రోహిణి చట్నీ ఎక్కడ ఉన్నారో నేను అని అడగగానే అక్కడే ఉంటుంది నీకు కనిపించుకున్న అంటే పక్కన వాళ్ళని అడుగు ఇస్తారు అని అంటుంది. దానికి ప్రభావతి సీరియస్ అవుతుంది. ఆ సమాధానమేంటి అంటే నేను ఒకపక్క మామయ్యకు టాబ్లెట్స్ వస్తుంటే అడగడం ఎందుకు కనిపిస్తూనే ఉంది కదా అత్తయ్య మరి అడగాలా అక్కడ అంటే తీసుకోవచ్చు కదా అని సమాధానం చెప్తుంది మీనా.. ఇక బాలు పూల కొట్టు పెట్టి మా పరువు తీస్తున్నారు అనగానే రెచ్చిపోతాడు.. రాత్రి నువ్వు బాగా నిద్రపోయినట్లున్నావే అని అనగానే రాత్రంతా పూలకోటలోనే ఉంది నువ్వు చూడలేదా ఎందుకు అడుగుతున్నావ్ ఇప్పుడు అని బాలు. పూలదండల కోసం ఎవరో అర్ధరాత్రి వేళ వచ్చారు మాకు నిద్ర సరిపోలేదు బిపీలు అవి ఇవి వస్తాయి కదా అవి ఆలోచించరా మీరు అని ప్రభావతి అరుస్తుంది.
ఇక దానికి శృతి కూడా అవును మీనా మీరు వేళల గురించి బోర్డులు పెట్టుకుంటే మంచిదే కదా.. టైం పడితే ఆ టైంలో వస్తే ఆంటీకి వయసు అయిపోతుంది నిద్రలేకుండా అంటే ఆమెకి బీపీలు హార్ట్ ఎటాక్ లు వస్తాయి అవసరమా పని వేళల గురించి ఒక బోర్డు పెడితే మంచిదే కదా అనేసి అనగానే బాలు బాగానే ఉంది మీ ఉచిత సలహా అని అంటాడు.. ఇక ఇదంతా నాకెందుకు నాన్న నేను చెప్పడం మర్చిపోయా నాకు ట్రిప్ వచ్చింది నేను వెళ్ళిపోతున్నాను అని బాలు వెళ్లిపోతాడు. నీ ప్రభావతి మాత్రం వాడి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు ఏంటి అంటే ఆ సమాధానం ఏంటో మీకే చెప్పారు కదా నువ్వే ఆలోచించుకొని దీర్ఘంగానేసి అంటాడు. ఇక మనోజ్ నేను పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నాకోసం పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఇంటి ముందుల పూల కొట్టు చూసి వాళ్ళు ఏమనుకుంటారు అని ఎద్దేవా చేస్తాడు. ఇక బాలు ట్రిప్పుకు వచ్చిన అతన్ని డ్రాప్ చేస్తాడు. ఇక తన పూల కొట్టు గురించి అక్కడ అందరితో చెప్తాడు.
పక్కనే ఉన్న పార్క్ దగ్గరికి వెళ్లి వాచ్మెన్ తో మాట్లాడుతాడు అన్న ఈ పాంప్లెట్లు పార్క్ వచనాలకు ఇవ్వండి మేము కొత్తగా పూల కొట్టు పెట్టాము అని ఆ పాంప్లెట్లు అందరికీ ఇస్తాడు. అప్పుడే మనోజ్ గురించి అక్కడ తెలుస్తుంది అక్కడున్న వ్యక్తి ఎప్పటినుంచి వస్తున్నాడు అన్న అని అడుగుతాడు. రెండునెల నుంచి ఇదే పరిస్థితి టైంకి రావడం తినడం ఇంకా తర్వాత మళ్లీ సాయంత్రం టీ తాగిసి సమోసాలు తినేసి ఇంటికి వెళతారు అని అంటాడు అయితే వాళ్లు మాటలు విన్న బాలు అక్కడ రికార్డ్ చేస్తాడు. కంపెనీలో జాబ్ చేస్తున్నారు అన్నారు కదా ఇదేనా ఈయన సంగతి ఈరోజు ఇంట్లో ఉంటుందనేసి బాలు అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మనోజ్ గురించి బాలు ఇంట్లో చెప్పేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు చూడాల్సిందే..