Gundeninda GudiGantalu Today episode January 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు ఇంట్లో అందరినీ నమ్మించి పెళ్లిలో హడావిడి చేస్తాడు. ఇక రోహిణి బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ తీసుకొచ్చి రోహిణి పరువు కాపాడుతాడు. దీంతో ప్రభావతి తన మలేషియా అన్నయ్య గిఫ్ట్ పంపించాడని తెగ మురిసిపోతుంది. ఏం గిఫ్ట్ పంపాడు చూడమ్మా అంటూ రోహిణికి చెబుతుంది. ఇప్పుడు ఎందుకు అత్తమ్మ.. తర్వాత చూద్దాంలే.. మిమ్మల్ని మండపంలో పిలుస్తున్నారు అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది. దినేష్ తో సీక్రెట్ గా మాట్లాడుతుంది. నీ మరదలు కు వాళ్ళ అత్తింటి వాళ్ళు బాగా నగలు పెట్టారు కదా అందులో ఒక నగని కొట్టేసి నాకు ఇవ్వు అని అనగానే రోహిణి షాక్ అవుతుంది.. అటు బాలు సంజు తో భారీ ఫైట్ చేస్తాడు. ఓ రేంజ్ లో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. పెళ్లి పనులను దగ్గరుండి చూసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు. ఇందులోనే పంతులు పిలిచి పెళ్లి కొడుకును తీసుకురమ్మని చెబుతాడు. బాలు నేను ఎత్తుకొస్తా అంటూ వెళ్తాడు. ఈ సమయంలో మీనా కు కాస్త అనుమానం వస్తుంది. నిజంగానే మీరు మారారా? సంజును క్షమించారా? అంటూ ప్రశ్నిస్తుంది. తన చెల్లెలి సంతోషం కోసం తాను ఏం చేయడానికి అయినా సిద్ధమే అంటూ ఇండైరెక్టుగా చెబుతాడు.
బాలు సంజుని తీసుకెళ్లడం రోహిణి చూస్తుంది. లోపలికి వెళ్లి ప్రభావతితో ఈ నిజాన్ని చెప్తుంది. బాలు ను పట్టుకోవాలని మీనా అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంజును కిడ్నాప్ చేసి బాలు కారులో తీసుకెళ్తుంటాడు. నీలకంఠం మనుషులు పోలీస్ డ్రెస్ లో ఫాలో అయ్యి.. ఎట్టకేలకు బాలుని పట్టుకుంటారు. ఆ తర్వాత సంజుని విడిపించి, పోలీస్ స్టేషన్ కు తీసుకవెళ్లకుండా ఓ గోడన్ కు తీసుకెళ్తారు. ఇక్కడికి ఎందుకు తీసుకోవచ్చారని ప్రశ్నించగా.. లోపలికి నడవని, బాలుని లోపలికి తీసుకువెళ్లి తాళ్లతో బంధిస్తారు. బాలుని తన ఫ్రెండ్ రాజేష్ ఫాలో అవుతూ ఉంటాడు. పోలీస్ స్టేషన్ కాకుండా ఓ గోడౌన్ కు తీసుకువెళ్ళడంతో అనుమానం వస్తుంది. ఈ విషయాన్ని మీనాకు చెబుతాడు.. మీనా భయపడి మీనా తొందరగా అక్కడికి వెళుతుంది. ఇక అప్పుడే సంజయ్ నీలకంటే ఎక్కువ ఫోన్ చేస్తాడు. ఐదు నిమిషాల్లో వస్తానని చెప్తాడు. సత్యం కు ప్రభావతి నిజం చెప్తుంది బాలు పెళ్ళికొడుకుని కిడ్నాప్ చేశాడండి అని చెప్పగానే షాక్ అవుతాడు. ఈ విషయాన్ని వెంటనే వాళ్లకి చెప్పాలని అనుకుంటే ప్రభావతి వద్దండి కాసేపు ఆగండి అని అంటుంది. ఇక మీనా వాళ్ళ అమ్మ వచ్చి మీనా పెళ్ళికొడుకు ఎక్కడున్నాడో తెలిసిందంట వెళ్ళింది తీసుకొని వస్తారులే అన్నయ్య కాసేపు ఆగండి అనేసి అంటుంది. మీరు టెన్షన్ పడకండి మీనా వెళ్ళింది కదా ఎలాగైనా తీసుకొని అంటుంది. అటు రంగా కామాక్షిని పెళ్ళికొడు కోసం వెళ్లారు ఇంకా రాలేదేంటి అనేసి అడుగుతాడు నేను మౌనవ్రతం నాకు ఏమీ అడక్కండి ప్రభావతి నన్ను నోరు మూసుకొని ఉండమని చెప్పింది అనేసి అంటుంది.
ఐదు నిమిషాలు చూసిన తర్వాత సత్యం నీలకంఠకు నిజం చెప్పాలని వెళ్తాడు. అబ్బాయి వస్తున్నాడు. బావగారు ఒక ఐదు నిమిషాల్లో వస్తానని ఫోన్ చేశాడు. అని అంటాడు అది కాదు మీకు ఒక విషయం చెప్పాలని సత్యం అనగానే కామాక్షి పెళ్ళికొడుకు వచ్చేసాడు అని అరుస్తుంది. బాలుని నీలకంఠ మనుషులు తాళ్లతో కట్టి వేసిన తరువాత .. సంజు తన అసలు రూపాన్ని బయటపెడతాడు. తాను మీ ఫ్యామిలీ మీద కోపంతోనే మీ చెల్లె మెడలో తాళికట్టబోతున్నానని, ఎవడు వచ్చి ఈ పెళ్లిని ఆపుతారో తాను చూస్తానంటూ సవాల్ చేస్తాడు సంజు. ఒక్కసారి కట్ల విప్పి చూడు.. మరో క్షణంలో నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. పెళ్లికి ముందే.. అసలు రూపం తనకు తెలుసునని, మేక వన్నె పులిలాగా వ్యవహరించిన తీరు తనకు ముందు అర్థమైందని, అందుకే తాను ఈ పెళ్లికి ఒప్పుకోలేదని బాలు చెబుతాడు. సంజు బాలును జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మండపానికి వస్తాడు..అసలు ఏమీ తెలియనట్లుగా.. నీలకంఠం నటిస్తారు.. ఏంట్రా ఇంత లేటు.. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. వెంటనే వెళ్లు అంటాడు. సంజు కూడా తనకు ఏం జరగనట్టు.. పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. మరి పెళ్లి కొడుకు వచ్చాడు. బాలు, మీనా ఎక్కడ ఉన్నారని పార్వతి ప్రశ్నించగా.. ఎవరు ఎటు వెళ్తే.. తనకేంటీ పెళ్లి జరగాలని ప్రభావతి తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది..
ఇక రవి వెయిట్ చేస్తుండగా.. శృతి ఇంటికి చేరుకుంటుంది. కానీ, తాను మాత్రం పెళ్లికి రానని, కావాలనుకుంటే వెళ్ళమని రవికి చెబుతోంది. రవి ఎంత బ్రతిమలాడిన పెళ్ళికి రానని, పెళ్లికి తాను అడ్డు ఏమి చెప్పడం లేదనీ, తన భర్త రవికి పర్మిషన్ ఇచ్చేస్తుంది. రవి చేసేదేం లేకపోవడంతో పెళ్లికి బయలుదేరుతాడు. అయితే, పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలియకపోవడంతో వెడ్డింగ్ కార్డు కోసం వెతుకుతూ ఉంటాడు. ఏం జరిగింది? ఏం వెతుకుతున్నావని శృతి అడుగుతుంది. పెళ్లి ఎక్కడ జరుగుతుందో ? తనకు తెలియదని, వెడ్డింగ్ కార్డు కోసం వెతుకుతున్నానని చెబుతాడు.. శ్రుతి వెడ్డింగ్ కార్డు చూసి షాక్ అవుతుంది. పెళ్ళికొడుకు ఎవరో కాదు.. సంజీవ్ అని రవికి చెబుతుంది. దీంతో ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని, రవికి చెబుతుంది. వెంటనే రవి తన తల్లికి ఫోన్ చేస్తాడు. కానీ, పెళ్లి మండపంలో వాయిద్యాలు సౌండ్ మధ్యలో ఉండే సరికి.. రవి చెప్పేది వినిపించుకోదు. దీంతో రవి.. మనోజ్ కు ఫోన్ చేస్తాడు. రవి వస్తే తన ఇమేజ్ పడిపోతుందని, వాడు ఇంట్లో అడుగుపెడితే.. తనని ఎవరు పట్టించుకోరని ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు.. శృతి వెంటనే మీనాకు ఫోన్ చేస్తుంది. తాను పెళ్లి మండపంలో లేనని మీరే త్వరగా వెళ్లి.. ఆ పెళ్లిని ఆపాలని శృతికి మీనా రిక్వెస్ట్ చేస్తుంది..
మీనా రాజేష్ లు బాలును కట్టిపడేసిన చోటికి వెళ్తాను. రౌడీలకు తెలియకుండా బాలుని విడిపించేసి రౌడీలతో ఫైట్ చేసి బయటకు వస్తారు. మీనా నాదే తప్పండి ఆ సంజు ఎవరో కాదు శృతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్న వాడు అనట నాకు శృతి చెప్పేంతవరకు నిజం తెలియలేదు నన్ను క్షమించండి అనేసి అడుగుతుంది.తాను ఇక్కడ నుంచి తప్పించుకోననే నమ్మకంతో సంజూ గాడు వాడి నిజ స్వరూపం ఏంటో తనకు చెప్పాడని, తన ప్రాణం ఉండగా తన చెల్లి మెడలో సంజూను తాళికట్టనివ్వనంటూ పెళ్లి మండపానికి బయలుదేరుతాడు బాలు. మన వైపు.. రవి, శృతి కూడా పెళ్లి మండపానికి బయలుదేరుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లు మౌనిక మెడలో తాళి ఉంటుంది మరి ఆ తాళి ఎవరు కట్టారో రేపు చూడాలి..