BigTV English

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి షాకిచ్చిన బాలు.. సత్యం షాకింగ్ నిర్ణయం..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి షాకిచ్చిన బాలు.. సత్యం షాకింగ్ నిర్ణయం..

Gundeninda GudiGantalu Today episode January 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. పాలు తాళం వేసుకుని రావడం చూసి ప్రభావతి నిలదీస్తుంది.. ఆ తర్వాత రెండు రోజులే కదా సర్దుకోలేరా అని ప్రభావతి అంటుంది. ముందు రెండు రోజులే అంటావ్. ఆ తర్వాత వాళ్లను పర్మినెట్ గా అక్కడే ఉంచేస్తావ్. వాడిని తీసుకొచ్చేముంది ఎక్కడ ఉంచాలో ముందే నిర్ణయించుకోవాల్సింది. వీడు చేసిన పనికి ఇంట్లోకి రానివ్వడమే తప్ప’అని అంటాడు. మొండి పట్టు పట్టకుండా తాళం ఇవ్వమని మీనా రిక్వెస్ట్ చేసిన బాలు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. తమని రూమ్ ఎక్కడ ఇవ్వమంటుందోనని మనోజ్ రోహిణి అక్కనుండి మెల్లగా జారుకుంటారు. బాలు అన్న మాటలకు రవి బాధపడుతూ బయటకు వెళ్ళిపోతాడు.‌. ఇక మీనా ను ప్రభావతి తిడుతుంది నీ కళ్ళు చల్లబడ్డాయా ఏం మొగుడు పక్కలో లేకుంటే నీకు పడుకోబుద్ధి కాలేదా అనేసి దారుణంగా మాట్లాడుతుంది.. దానికి మీనా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళింది రవి మళ్ళీ లోపలికి వచ్చి లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రభావతి ఆపి ఎక్కడికి రా వెళ్తున్నామని అడుగుతుంది. ఇంట్లో చోటు లేనప్పుడు నేను అత్తగారింటికైనా వెళ్తాను లేదు ఎక్కడైనా ఉంచి చూసుకుంటానో ఆ మాత్రం నేను భార్యని పోషించుకోలేనా అని రవి.. నువ్వేం బాధపడకు రా నువ్వు వచ్చేలోగా నీకు రూమ్ సిద్ధంగా ఉంటుంది. అని ప్రభావతి రవిని బయటికి పంపిస్తుంది. ఇక మీ నాకు మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది.. ప్రభావతి అన్న మాటలకి మీనా ఏడ్చుకుంటూ ఇంటికి రమ్మని చెప్తుంది. బాలు ఇంటికొచ్చి ఏమైందని అడుగుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు కు ఫోన్ చేసిన మీనా కోపంగా మాట్లాడటంతో బాలు ఏమైందని కంగారు పడుతూ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే మీ నాన్నని పిలిచి అరుస్తాడు. ఇంకా ప్రభావతి వచ్చావా తాళం వేసుకొని వెళ్ళావా? అంత నీ ఇష్టమేనా అని అడుగుతుంది. ఇది నా ఇల్లు మా నాన్న నాకు ఇచ్చిన ఇల్లు అనేసి ప్రభావతి అంటుంది. దానికి బాలు మీ నాన్న అగ్గిపెట్టను తీస్తే మా నాన్న రైల్వే పెట్టె అంత చేశాడు ఇన్ని గదులు పెట్టాడు ఇప్పుడు అది మా నాన్నదే అంటే మాదే నీకు మాట్లాడే రైట్ లేదు అని అందరినీ ఒక దుమ్ము దులిపేస్తాడు. ఇక మీనా ఏడవడం చూసి అందర్నీ నిలదీస్తాడు. ప్రభావతి అన్న మాట తెలుసుకుని షాక్ అవుతాడు..

మీనా చాలా ఎమోషనల్ అవడంతో బాలు చాలా కోపంగా అందరిపై అరుస్తాడు. ఏమైంది మీ నాన్న నువ్వు ఇంతగా ఏడుస్తున్నావ్? ఎవరేమన్నారు చెప్పు ఈ లక్షల మింగిన అన్నారా? ఆ పార్లరమ్మ అందా? ఈ ఇల్లు మింగిన డబ్బా ఒకటి ఉందా అని అడుగుతాడు. అయినా మా గది తాళం ఇవ్వమని అడుగుతున్నవే అదేదో నీ ముద్దుల కొడుకు గది ఇవ్వచ్చుగా వాళ్ళు ఎక్కడ అడుగుతామని ముందే జారుకుని వెళ్లిపోతున్నారు. అంటే మేము అంత చీప్ అయిపోయామా? అంత లోకువైపోయామా మీకు అని ప్రభావతిని కడిగి పడేస్తాడు బాలు. ఇక ఇదంతా రచ్చ ఎందుకండీ ఆ తాళం ఏదో ఇచ్చేయొచ్చు కదా ఎక్కడో చోట మనం పడుకుందాం అనేసి మీనా అంటే అసలు ఇది అనడానికి నీకేం హక్కు ఉంది మీనా ఇది నీళ్లు అది నీ రూము అది గుర్తుపెట్టుకో అనేసి బాలు అంటాడు. అసలు నువ్వు ఇంతగా బాధపడుతున్నావంటే నిన్ను ఎవరో అననాని మాటలు అన్నట్లు అర్థమవుతుంది ఎవరన్నారు చెప్పు మీనా అనేసి అనగానే రోహిణి అత్తయ్య అన్నారు అని అంటుంది. ఏమన్నారు చెప్పు మీనా అనేసి గట్టిగా అరుస్తాడు బాలు.


ఇక దానికి మీనా మీ పార్టీకి మీరు తాళం వేసుకొని వెళ్తారు మీరు ఏదైనా అంటారు కానీ అందరూ వచ్చి నా మీద పడతారు అందరికీ నేను లోకువైపోయాను పూల ముగ్గుని ఇంటి నుంచి వచ్చాను కాబట్టి నన్ను అందరూ తిడుతూనే ఉంటారు ఏదో ఒకటి అంటూనే ఉంటారు మాటలు పడాల్సిన నేను కదా నాకు అలవాటైపోయింది ఏంటి అని మీనా అంటుంది. దానికి బాలు ఇదంతా కాదు నిన్ను ఎవరేమన్నారు చెప్పు అనేసి అంటాడు. ఇంట్లో గొడవ ఏమైందని సత్యం బయట నుంచే వింటూ ఉంటాడు. మీనా నోరు తెరిచి నిజం చెప్తుంది. ఒకరోజు మొగుడు పక్కన లేకపోతే రూమ్లో పడుకోలేవా అనేసి అన్నారండి అని అంటుంది. ఆ మాట వినగానే బాలు కోపం రెట్టింపు అవుతుంది. అప్పుడే సత్యం ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. మీ ఆవిడ మా ఆవిడని ఎంత మాట అన్నదో చూశారా ఒక ఆడపిల్లని అనాల్సిన మాటే నాది అనేసి సత్యంతో అంటాడు బాలు. ఇక సత్యం ప్రభావతి అరుస్తాడు నీకు ఒక కూతురు ఉందిగా ఆ కూతురు వయసు ఉన్న అమ్మాయితో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా అనేసి ప్రభావతిని తిడతాడు. అసలు మతుండే మాట్లాడుతున్నావా ప్రభా అని సత్యం ప్రభావతిని తిడతాడు. ప్రభావతి మాత్రం తనది తప్పేమీ లేదని మీనానే లేనిపోని ఎక్కించి వాడికి చెప్తుందని అంటుంది. నువ్వు ఇప్పటికి మారవా అని సత్యమంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: డబ్బుల కోసం రచ్చ చేసిన శ్రీయా.. అన్నదమ్ముల మధ్య గొడవ..పల్లవి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today October 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన సందీప్‌ – డాక్టర్‌ కలవాలనుకున్న కావ్య

GudiGantalu Today episode: రోహిణి ప్లాన్ ఫెయిల్.. శృతికి తెలిసిన నిజం..ఇంట్లో రచ్చ చేసిన ప్రభావతి..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. ప్రేమ పై సీరియస్.. కోడళ్ల మధ్య ఫైట్..

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…

Nindu Noorella Saavasam Serial Today September 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కోసం మనోహరి కొత్త ప్లాన్‌

TV: ఘోర విషాదం..పెళ్లి పీటలెక్కకుండానే నటి కాబోయే భర్త ఆత్మహత్య!

Brahmamudi Serial Today September 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్య తాగే జ్యూస్‌లో అబార్షన్‌ టాబ్లెట్‌ కలిపిన రాజ్‌  

Big Stories

×