పెళ్లయిన భార్యాభర్తలు తల్లిదండ్రులు అయ్యేందుకు ఎంతో ఉత్సుకతగా ఉంటారు. కానీ వారు గర్భం ధరించేందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, గర్భం ధరించడాన్ని అడ్డుకుంటున్నాయి. కాబట్టి గర్భం ధరించే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బిజీ జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు పెరిగిపోతున్నాయి. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్లయితే మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి మీ సంతానోత్పత్తి పై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.
బేకరీ ఉత్పత్తులు
బేకరీలో ఉండే కేకులు, చిప్స్, పేస్ట్రీలు, బిస్కెట్లు వంటివి తినకూడదు. వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. అలాగే ప్యాక్ చేసిన స్నాక్స్‌లో కూడా ట్రాన్స ఫాట్స్ ఉండే అవకాశం ఉంది. ఈ ట్రాన్స్ ఫాట్స్ ఉన్న ఆహారాలు మహిళ సంతానోత్పత్తికి హానికరంగా మారుతాయి. అవి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతిస్తాయి. అండాశయాల పనితీరును బలహీన పరుస్తాయి. ముఖ్యంగా అండోత్సర్గం పై ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మీరు బేకరీ ఉత్పత్తులను ఎంత దూరం పెడితే అంత మంచిది.
చక్కెర నిండిన పదార్థాలు
చక్కెర నిండిన స్వీట్లు, పానీయాలు, కూల్ డ్రింకులు వంటివన్నీ తినడం మానేయాలి. ఎందుకంటే చక్కెర ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. అలాగే చక్కెరతో చేసిన కూల్ డ్రింకులు పదార్థాలు కూడా ఎక్కువ ప్రాసెసింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఇవి మహిళా సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. అధిక స్థాయి చక్కెర రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. అండోత్సర్గం ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. మీకు అంతగా తీపి తినాలనిపిస్తే తీయని పండ్లను తినేందుకు ప్రయత్నించండి. ఎప్పుడైతే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందో గర్భం ధరించడం కష్టంగా మారుతుంది.
ప్రాసెస్ చేసిన మాంసం
తాజాగా వండిన మాంసాన్ని తినవచ్చు. కానీ పిజ్జాలు, బర్గర్లు, బేకన్, సాసేజ్ వంటి మాంసాహారాలను తినకూడదు. ఎందుకంటే ఇందులో వాడిన మాంసాలను ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రాసెసింగ్ పద్ధతిలో తయారైన మాంసాహారాలను తినడం వల్ల స్త్రీల సంతానోత్పత్తి పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ ఆహారాలలో అధిక మొత్తంలో సోడియం నైట్రేట్లు ఉంటాయి.ఇవి అండోత్సర్గానికి ప్రభావితం చేస్తాయి. గర్భం ధరించడంలో ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి అప్పటికప్పుడే వండిన మాంసాహారాలను చేపల కూరను మొక్కల ఆధారత ప్రోటీన్ లను తినడం అత్యవసరం.
పాల ఉత్పత్తులు
కొవ్వు తీసిన పాలను తాగవచ్చు. అలాగే కొవ్వు తీసిన పాలతో తయారైన పెరుగు వంటివి తీసుకోవచ్చు. కానీ పూర్తిగా కొవ్వు నిండిన పాలను, పెరుగును తినడం మంచి పద్ధతి కాదు. ఇది మహిళల సంతానోత్పత్తి పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వీటిలో ఉండే హార్మోన్లు, యాంటీబయోటిక్స్ సంతానోత్పత్తి పై ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి కొవ్వు నిండిన పాలు, పెరుగు వంటివి తాగడం మానేయాలి. బాదం పాలు, సోయా పాలు వంటి తక్కువ కొవ్వు పదార్థాలను తీసుకోవడం మంచిది.
కెఫిన్
కాఫీ, టీ ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో కెఫీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మహిళల సంతానోత్పత్తి పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల గర్భం దాల్చడంలో స్త్రీలు ఇబ్బంది పడతారు. కాబట్టి గర్భం ధరించాలని భావిస్తున్నా మహిళలు ముందు నుంచే కాఫీ, టీలను దూరంగా పెట్టాలి. దానికి బదులు హెర్బల్ టీలు, బ్లాక్ కాఫీ వంటివి తాగడం ఉత్తమం.
Also Read: నిద్ర సరిగ్గా లేకపోతే బరువు పెరుగుతారా ? పరిశోధనల్లో షాకింగ్ నిజాలు