BigTV English

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి బుద్ధి చెప్పిన బాలు.. సత్యం షాకింగ్ నిర్ణయంతో అందరు షాక్..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి బుద్ధి చెప్పిన బాలు.. సత్యం షాకింగ్ నిర్ణయంతో అందరు షాక్..

Gundeninda GudiGantalu Today episode January 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలుకు ఫోన్ చేసిన మీనా కోపంగా మాట్లాడటంతో బాలు ఏమైందని కంగారు పడుతూ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే మీ నాన్నని పిలిచి అరుస్తాడు. ఇంకా ప్రభావతి వచ్చావా తాళం వేసుకొని వెళ్ళావా? అంత నీ ఇష్టమేనా అని అడుగుతుంది. ఇది నా ఇల్లు మా నాన్న నాకు ఇచ్చిన ఇల్లు అనేసి ప్రభావతి అంటుంది. దానికి బాలు మీ నాన్న అగ్గిపెట్టను ఇస్తే మా నాన్న రైల్వే పెట్టె అంత చేశాడు ఇన్ని గదులు పెట్టాడు ఇప్పుడు అది మా నాన్నదే అంటే మాదే నీకు మాట్లాడే రైట్ లేదు అని అందరినీ ఒక దుమ్ము దులిపేస్తాడు. ఇక మీనా ఏడవడం చూసి అందర్నీ నిలదీస్తాడు. ప్రభావతి అన్న మాట తెలుసుకుని షాక్ అవుతాడు.. మీనా ఏడవడంతో బాలు కోపంగా అందరి పైన అరుస్తాడు. ప్రభావతి అన్న మాటలు విని బాలు షాక్ అవుతాడు. నీకు ఒక కూతురు ఉంది కదా మీనా కూడా నీకు కూతురు లాంటిదే కదా నువ్వు ఎందుకు ఇలా అంటున్నావ్. ఎంతమాటన్నావో నీకు అర్థం అవుతుందా అని ప్రభావతిపై బాలు కోపంగా అరుస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..


ఇక ప్రోమో విషయానికొస్తే.. బాలుని మీనా ఇంటికి రప్పిస్తుంది. బాలు రాగానే ప్రభావతి చిందులేస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు తాళం వేసుకొని వెళ్ళిపోతే రవి శృతి, రవిలు ఎక్కడ ఉంటారో ఆలోచించరా వాడు నీ తమ్ముడు అనే సంగతి కూడా నువ్వు మర్చిపోతున్నావని ప్రభావతి అరుస్తుంది.. అయినా రూమ్ కి తాళం వేసుకొని వెళ్ళమని ఎవరు చెప్పారు అసలు రూమ్ కి తాళం వేయడానికి నువ్వెవరు అని ప్రశ్నిస్తుంది ప్రభావతి. దానికి బాలు అడగడానికి నువ్వెవరు అంటాడు.. తనకి మళ్లీ ఈ ఇల్లు నా ఆస్తి మా నాన్న నాకు రాసిచ్చారు అని అంటుంది. నాన్న నీకు ఇచ్చింది అగ్గిపెట్టె అంత ఇండ్లు మాత్రమే. మా నాన్న దాని రైల్వే పెటేంత చేసాడు ముగ్గురు కొడుకులు ఉండడానికి సులువుగా ఆయన చేయించుకున్నాడని బాలు తండ్రి గురించి చెప్తాడు. అసలేం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావ్ ? అని బాలు అడిగితే ఏం చెప్పదు. రోహిణి ఏమైనా అన్నదా? లేదా? మనోజ్ ఏమైనా అన్నాడా అంటూ దీంతో ప్రభావతి కంగారుపడుతుంది. మీనా తన పేరు ఎక్కడ చెబితే బాలు ఎలా రియాక్ట్ అవుతాడోనని ప్రభావతి భయపడుతుంది.. దానికి మీనా నా కర్మకొద్దీ నేను ఏడవాల్సి వస్తుందిలే అనేసి ఏదో కవర్ చేస్తుంది. కానీ బాలు మాత్రం ఇంట్లోనే వాళ్ళందరినీ మధ్యలోకి లాగుతూ మీనాన్ని అడుగుతాడు. మీనా మాత్రం అసలు నిజం బయట పెట్టడానికి ఇష్టపడదు కానీ రోహిణి మాత్రం అత్తయ్య అన్నది అని అంటుంది. ఇక మీనా ఏం లేకుండా నీ మొగుడు పక్కన పడుకోలేదా అన్నట్టు మాట్లాడిందండి అని అంటుంది. అది విన్న బాలు బయట ఉన్న సత్యం ఇద్దరూ షాక్ అవుతారు.

కూతురు లాంటి అమ్మాయి మీద ఇలాంటి మాటలు అనడం నీకు మంచిదేనా ఎందుకంత మితిమీరి ప్రవర్తిస్తున్నావని బాలు ప్రభావతిని అడుగుతాడు. ప్రభావతి మాత్రం మౌనంగా ఉంటుంది. కోపం అంటే అవన్నీ సీరియస్ గా తీసుకోవాలా ఇప్పుడు ఇదంతా కాదు నువ్వు రవికి రూమ్ కి ఇస్తావా ఇవ్వవా అని ప్రభావతి నిలదీస్తుంది. ఇంతకుముందు ఒక ఆలోచన ఉండేదేమో ఇప్పుడు చచ్చినా నేను ఇవ్వను అని తెగేసి చెప్తాడు బాలు. వెంటనే సత్యం ఇంట్లోకి వస్తాడు.బాలు జరిగిన విషయాన్ని తన తండ్రికి చెబుతాడు. మీ భార్య నా భార్యను ఇలా అవమానించిందని, ఒక ఆడపిల్లతో మాట్లాడే విధానం ఇదేనా అంటూ ప్రశ్నిస్తాడు బాలు. దీంతో అవమానంగా భావించిన సత్యం.. తాను ఇక నుండి హాలోనే పడుకుంటానంటూ.. తన చాప, దిండును తీసుకొచ్చి హాల్లో వేసుకుంటాడు. ఇకపై తాను ఇక్కడనే పడుకుంటానని, హాలోనే కూర్చుంటాడు. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది. సత్యం తీసుకున్న సంచలన నిర్ణయానికి ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతుందో? బాలు ఎలా స్పందిస్తాడో? అనేది చూడాల్సిందే.. ఏది ఏమైనా సోమవారం ఎపిసోడ్ మాత్రం ఆసక్తికరంగా ఉంటుందని అర్థమవుతుంది. అసలు మిస్ అవ్వకుండా ఎపిసోడ్ ని వీక్షించండి..


Related News

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను గల్లా పట్టుకుని నిలదీసిన కావ్య  

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తోసేసిన మిస్సమ్మ

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Brahmamudi Serial Today September 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ చేయించనున్న రాజ్‌ –  ఆఫీసుకు వెళ్లిన సుభాష్‌   

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Big Stories

×