VSR Plan on Kutami Govt: కూటమి సర్కార్‌కు ముప్పు పొంచి వుందా? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డేంజర్ గేమ్ ప్లాన్ చేశారా? జగన్‌కు చెప్పే తాను రాజీనామా చేస్తున్నానని ఎందుకున్నారు? జగన్- సాయిరెడ్డి గేమ్‌లో కూటమి సర్కార్‌కు ఇబ్బందులు తప్పవా? వీఎస్ఆర్ ప్లాన్‌ను కూటమి పెద్దలు తిప్పికొట్టేందుకు అన్ని సిద్ధం చేశారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
శుక్రవారం సాయంత్రం విజయసాయిరెడ్డి ప్రకటన మొదలు శనివారం రాత్రి వరకు ఏపీలో జరిగిన పరిణామాలు అన్నీఇన్నీకావు. దీనివెనుక బలమైన స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. జగన్-విజయసాయిరెడ్డి కలిసి ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. దీనిపై కొంత క్లూ ఇచ్చారు విజయసాయిరెడ్డి. శనివారం మీడియా ముందుకొచ్చిన ఆయన, తాను జగన్‌కు చెప్పే రాజీనామా చేస్తున్నారని వెల్లడించారు. వీఎస్ఆర్ రాజీనామాపై ఏకంగా వైసీపీ ఎక్స్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించింది.
విడిచి వెళ్లిపోయిన నేత గురించి ఏ పార్టీ పెద్దగా ప్రస్తావించిన సందర్భాలు లేవు.. రాలేదు కూడా. తొలిసారి విజయసాయిరెడ్డి వెళ్లిపోయిన తర్వాత ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యింది వైసీపీ. ఆయన రాజీనామా ఆమోదించనప్పటికీ, తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని రాసుకొచ్చింది. భవిష్యత్తులో ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకున్నట్లు ప్రస్తావించింది.
2014-19 మధ్యకాలంలో విజయసాయిరెడ్డి వేసిన ఎత్తుగడలకు ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడానికి కారణమైంది. ఆయన వ్యూహాలు ఎవరికీ అంతుబట్టవు. కాకపోతే ఏదో జరిగిపోయినట్టు క్రియేట్ చేసి పార్టీలను విడగొట్టడంలో వీఎస్ఆర్‌ది అందెవేసిన చేయి.
ALSO READ: ట్రాక్‌పై దూసుకొస్తున్న వందే భారత్.. పట్టాలపై ఆగిపోయిన లారీ, బస్సు..
కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో కేసు నమోదు తర్వాత సీఎం చంద్రబాబు- డిప్యూటీ సీఎం పవన్ మధ్య చిచ్చు పెట్టేలా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వయస్సు అయిపోయిందని, యువకుడు పవన్ అయితే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారంటూ వ్యాఖ్యానించారు. వాటిని ఇరుపార్టీలు వాటిని తిప్పికొట్టాయి. ఈసారి వీఎస్ఆర్ వేసిన స్కెచ్ భారీగా ఉంటుందనే చర్చ నేతల మధ్య లేకపోలేదు.
ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే.. రెండో వైపుకు వద్దాం. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నుంచి విజయసాయిరెడ్డి-జగన్ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ఉత్తరాంధ్ర పదవి నుంచి తప్పించడం, ఆ తర్వాత నెల్లూరు నుంచి పోటీకి దింపడంతో ఆయన ఆగ్రహంతో రగిలిపోయారు. కాకపోతే తన బాధను కొందరు మిత్రులతో మాత్రమే షేర్ చేసుకున్నారు.
వీఎస్ఆర్ భావించినట్టుగానే మొన్నటి ఎన్నికల్లో జగన్‌కు భారీ షాక్ తగిలింది. అప్పటి నుంచి వీఎస్ఆర్ తన ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్‌తో మంతనాలు జరిపారు. తనతోపాటు ఐదుగురు ఎంపీలను తీసుకొస్తానని ఢిల్లీ పెద్దల ముందు చెప్పారట. దీనిపై టీడీపీ నుంచి అభిప్రాయాన్ని బీజేపీ పెద్దలు సేకరించారు.
గడిచిన ఐదేళ్లలో ఏపీకి ఆయన చేసిన డ్యామేజ్ అంతాఇంతా కాదని అన్నారట. ఆయన మీపార్టీలోకి వస్తే మరింత నష్టం జరుగుతుందని చెప్పిందట. ఈ విషయంలో ఆయన్ని తీసుకోకపోవడమే మంచిదని సలహా ఇచ్చిందట. దీంతో ఆయన్ని పక్కనపెట్టి మిగతా వారిని తీసుకోవాలని అనుకుంది బీజేపీ హైకమాండ్.
అప్పటికే వైసీపీ ఎంపీలతో మంతనాలు మొదలుపెట్టాశారట వీఎస్ఆర్. ఈ విషయం జగన్ చెవిలో పడడం, ఆయన సీరియస్‌గా మార్నింగ్ ఇవ్వడం జరిగిపోయింది. ఆ తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లలేదు. జరిగిన పరిణామాలను గమనించిన ఆ పార్టీ నేతలు ఫ్యాన్ కింద కష్టమనే నిర్ణయానికి వచ్చేసి ఎవరి దారి వారు చూసుకున్నారు.. కుంటున్నారు కూడా.
పార్టీ పరంగా బ్యాడ్ అయ్యారు విజయసాయిరెడ్డి. ఇటు జగన్.. అటు బీజేపీ.. మరోవైపు ఫ్యామిలీని కేసులో ఇరుకించి అన్నివిధాలుగా నష్టపోయారాయన. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నింటికి దూరంగా ఉండడం తప్ప మరో మార్గం లేదని భావించి పార్టీకి, పదవుకి రిజైన్ చేసినట్టు నేతల మధ్య చర్చ జరుగుతోంది. అందుకోసమే శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది.