Gundeninda GudiGantalu Today episode January 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. నీలకంఠం సంజు పక్కా ప్లాన్ తోనే తొందరగా పెళ్లి చేయాలనీ పంతులుని తొందర పెట్టేస్తారు.. ఇక పంతులు తొందరగా పెళ్లి జరిపిస్తాడు. బాలు వచ్చేలోగా సంజు తో మౌనిక పెళ్లి జరిగిపోతుంది. దీంతో బాలు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. పక్కనే ఉన్న దీపం స్టాండ్ ను తీసుకువెళ్లి, సంజుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. అక్కడున్న అందరూ బాలుని అడ్డుకుంటారు. తన ఇంట్లో వారు అందరూ.. ఆపినా బాలు ఆగడు. తన చెల్లి మౌనిక అడ్డుపడుతుంది. దీంతో ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు. వాడు ఒక నరరూప రాక్షసులని వాడికి నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని మీరు అనుకున్నారు ఇప్పుడు తన జీవితం రోజు దినదిన గండం లాగా మారిపోతుంది ఈ పెళ్లిని జరగనిచ్చేదే లేదు వీన్ని ఇప్పుడే చంపేస్తానని బాలు ఆవేశపడతాడు. సత్యం బాలుని ఆపాలని ఎంత ప్రయత్నించినా ఆగడు. మౌనిక బాలును కొట్టి కంట్రోల్ చేస్తుంది. ఏ చెల్లెలు కోసం ఇంత రాద్ధాంతం చేశావో.. ఆ చెల్లెలే నిన్ను చీకొట్టి వెళ్లిపోమంటుంది సత్యం అంటాడు. ఇకపై నీ ముఖం నాకు చూపించకు.. ఇకనుండి వెళ్ళిపో’ అంటూ బాలుని సత్యం చీకొడతాడు. నీ జీవితం నీ జీవితం బాగుండాలని మీ అన్నయ్య ప్రయత్నించాడు అంటూ మీనా అంటుంది. అసలు అన్నయ్య ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో.. తనకు అర్థం కాలేదని , ఆ ఆవేశంలో ఏమైనా చేస్తాడేమోనని, తాను అన్నయ్యను కొట్టాల్సి వచ్చిందని క్లారిటీ ఇస్తుంది మౌనిక.. మీనా ఏ కష్టం వచ్చినా మేము అండగా ఉంటాము అని భరోసా ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సంజుని నీలకంఠం వెళ్దామని చెప్తాడు. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇక్కడ మనం అవసరమా అని వెళ్లాలని అనుకుంటారు. అదేంటి అమ్మని తీసుకుని వెళ్లకుండా వెళ్ళిపోతారా అనేసి అడుగుతారు..అన్న చేసిన తప్పుకు చెల్లికి శిక్ష వేయకండి అంటూ ప్రాధేయపడతాడు. అవసరం లేదు. మా కొడుకుపై మేమే చేయి వేయలేదు. అంతగా ఇష్టం లేనప్పుడు మీ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచుకోండి. మావోడికి కోటి సంబంధాలు వస్తాయి అంటూ సంజు తల్లి అంటుంది. దీంతో ప్రభావతి ఫ్యామిలీ షాక్ అవుతుంది. అన్న చేసిన తప్పుకు చెల్లెలు ఎందుకు శిక్షించాలి. బాలు చేసిన తప్పుకు మౌనిక కు ఎందుకు శిక్షించాలి? అంటూ ఏమీ తెలియనట్టు సంజు మాట్లాడుతాడు.. ఇక అందరూ కూడా నీలకంఠంకు సర్ది చెప్తారు అయితే నీలకంఠం ఒక కండిషన్ పెడతాడు. మీ బాలు జీవితంలో నా ఇంటి గడప తొక్క కూడదు అనేసి కండిషన్ పెడతారు. దాని ఒప్పుకుంటే మౌనికని ఇప్పుడే తీసుకెళ్ళిపోతామని అంటాడు. సత్యం నీలకంఠంకు సర్ది చెప్పబోతాడు. కానీ అది మాత్రం నేను మాటిస్తున్నాను వాడు జీవితంలో మీ ఇంటికి గడప తొక్కడని అంటుంది.
తన కండిషన్ కు ఒప్పుకోవడంతో నీలకంఠం.. తమ కోడలు పంపించమని అంటాడు. తర్వాత అప్పగింతలు చేసి సాగనంపుతారు. ఈ సమయంలో బాలుని తక్కువ చేసి మాట్లాడడంతో మీనా కు కోపం వస్తుంది. ఆయన ఎందుకు అలా ప్రవర్తించాడో.. దానికి కారణాలేంటో అందరికీ తెలుసు.. అంటూ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇస్తుంది. అలా బాలు లేకుండానే.. మౌనికను అత్తగారింటికి పంపిస్తారు.. మీనా కూడా పంపిస్తాం బాబాయ్ గారు మీ అబ్బాయి ఏంటో మీరేం మీకు తెలుసు నాకు తెలుసు వీళ్ళందరికీ తెలియకపోవచ్చు కానీ మౌనికకు ఏదైనా జరిగితే మాత్రం ఎవ్వరు ఊరుకోరు అని వార్నింగ్ ఇస్తుంది. మౌనికను పంపిస్తారు. ఇక సువర్ణ మీనాకు భరోసా ఇస్తుంది నా కూతురు లాగా చూసుకుంటాను బాలుని జాగ్రత్తగా చూసుకో అనేసి అంటుంది.
ఇక మౌనికను నీలకంఠం ఇంటికి తీసుకొని వస్తారు. ఇక బాలు తాగేసి గుడికి వెళ్తాడు. తన చెల్లెలు, తండ్రి అన్న మాటలను తలుచుకొని బాధపడతాడు. తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బాధపడతాడు.ఇంతలోనే ఓ స్వామీజీ వచ్చి.. మీ చేతిలో లేని వాటి గురించి అనవసరంగా ఆలోచించి బాధపడకు, పెళ్లిళ్లు అనేవి స్వర్గంలోనే నిర్ణయించబడతాయి. పెళ్లి అనేది ఆపాలనుకుంటే ఆగదు. అది పుట్టుకతోనే నిర్ణయించబడుతుంది. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు అని ఆ స్వామీజీ చెప్తాడు. ఆ రాక్షసుడుకి ఇచ్చి తన చెల్లిని పంపడం తనకి ఇష్టం లేదని బాలు బాధపడతాడు. ప్రతివాడు ఎప్పుడో అప్పుడు పరిస్థితులను బట్టి మారుతాడు. ఇక ఇంట్లోకి అడుగుపెట్టిన మౌనిక దేవుడ్ని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది. శాంతి పూజకు రెడీ చేయమని నీలకంఠం సువర్ణకు చెప్తాడు. మీనా బాలుని వెతుక్కుంటూ గుడికొస్తుంది. మౌనిక కొట్టినందుకు బాధపడుతున్నారా? అని ప్రశ్నించగా బాలు సమాధానం చెబుతూ ఇంకా నాలుగు దెబ్బలు వేసినా తాను బాధపడే వాడిని కాదని వాడిని నమ్మి మోసపోయిందంటూ బాధపడతాడు. మీ చెల్లి నువ్వు ఎక్కడ ఆవేశపడి హంతకుడులా మారుతావో అనే భయంతోనే కొట్టింది. మీరు బాధపడకండి. అంతా సెట్ అవుతాయని సద్ది చెబుతుంది మీనా. అందరిలాగానే తన చెల్లి కూడా వాడి మాయలో పడి మోసపోయిందని బాలు బాధపడతాడు.. ఇక సువర్ణ సహనం ఓర్పు తో ఉండమని సలహా ఇస్తుంది. నీ కాపురాన్ని నీకు తగ్గట్టుగా మార్చుకోవడం నీ బాధ్యత అని ఇన్ డైరెక్టుగా సంజీవ్ క్యారెక్టర్ గురించి చెబుతోంది. ప్రతి సంసారంలో మంచి చెడులు, కోపం శాంతం వంటివి ఉంటాయి వాటిని సర్దుకుపోవడమే జీవితం అని చెబుతుంది. తాను అన్నిటిని భరిస్తానని మౌనిక సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత ఎన్నో ఆశలతో శోభనం గదిలోకి ఎంటర్ కాగానే సంజు షాక్ ఇస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో చూడాలి..