BigTV English

China’s New Virus: చైనాను కలవరపెడుతున్న కొత్త వైరస్.. కోవిడ్ లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి..

China’s New Virus: చైనాను కలవరపెడుతున్న కొత్త వైరస్..  కోవిడ్ లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి..

China’s New Virus: చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా.. ఈ వ్యాధి చైనాలో వేగవంతంగా వ్యాప్తిచెందుతున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రుల ముందు రోగులు క్యూ కడుతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు ఇన్‌ఫ్లుయెంజా ఏ, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 మల్టిపుల్ వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది.


ప్రపంచమంతా గ్రాండ్‌గా కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పిన కొన్ని గంటలకే, మరో మహమ్మారి వ్యాప్తి గురించి వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం X సహా అన్ని ఇతర అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్స్.. చైనాలో వివిధ రకాల వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపే పోస్టులతో నిండిపోయాయి. కరోనా పుట్టినిల్లు చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ప్రజలు హ్యూమన్ మెటాప్న్యూమో అనే వైరస్ బారిన పడుతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

అయితే HMPV ఫ్లూ లక్షణాలతో పాటు కోవిడ్-19 లక్షణాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి చెందడంపై అక్కడి అధికారులు పరిస్థితులను పరిశీలిస్తున్నారు. వైరస్ సోకిన వారిలో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లేదా ఎంఫిసెమా వంటి లంగ్స్ జబ్బులు ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉందని చైనా అధికారులు పేర్కొన్నారు.


Also Read: పక్షులు విమానాన్ని కూల్చేస్తాయా? అదెలా సాధ్యం.. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటీ?

మరోవైపు వైరస్ కారకాలను గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసినట్లు సమాచారం. డిసెంబర్ 16-22 వరకు అందిన డేటా ప్రకారం.. చైనాలో HMPV సహా.. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరిగాయని అధికారులు తెలిపారు. చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా మాస్కులు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని గ్లోబల్ హెల్త్ అధికారులు సిఫార్సు చేస్తున్నారు.

 

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×