BigTV English

Gundeninda GudiGantalu Today episode: సంజు ప్లాన్ లో ఇరుక్కున్న మౌనిక.. ప్రభావతి ఫ్యామిలీకి కన్నీళ్లు తప్పవా..?

Gundeninda GudiGantalu Today episode: సంజు ప్లాన్ లో ఇరుక్కున్న మౌనిక.. ప్రభావతి ఫ్యామిలీకి కన్నీళ్లు తప్పవా..?

Gundeninda GudiGantalu Today episode January 4th : నిన్నటి ఎపిసోడ్ లో.. మౌనిక పెళ్లిని ఆపాలని బాలు చేసిన ప్రయత్నం వృధా అయిపోతుంది. పెళ్లి జరిగిపోతుంది. బాలు మండపంలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సంజు నిజ స్వరూపం తెలియక అందరు గుడ్డిగా నమ్మి మౌనికను బలి పశువును చేసారుగా అని బాలు రెచ్చిపోతాడు. సంజు పై తిరగబడతాడు. మౌనిక తన భర్తను కొడితే బాగోదని బాలుకు వార్నింగ్ ఇస్తుంది. ఆ బాధ తట్టుకోలేక బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సంజుని నీలకంఠం వెళ్దామని చెప్తాడు. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇక్కడ మనం అవసరమా అని వెళ్లాలని అనుకుంటారు. అదేంటి అమ్మని తీసుకుని వెళ్లకుండా వెళ్ళిపోతారా అనేసి అడుగుతారు..అన్న చేసిన తప్పుకు చెల్లికి శిక్ష వేయకండి అంటూ ప్రాధేయపడతాడు. అవసరం లేదు. మా కొడుకుపై మేమే చేయి వేయలేదు. అంతగా ఇష్టం లేనప్పుడు మీ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచుకోండి. మావోడికి కోటి సంబంధాలు వస్తాయి అంటూ సంజు తల్లి అంటుంది. దీంతో ప్రభావతి ఫ్యామిలీ షాక్ అవుతుంది. అన్న చేసిన తప్పుకు చెల్లెలు ఎందుకు శిక్షించాలి. బాలు చేసిన తప్పుకు మౌనిక కు ఎందుకు శిక్షించాలి? అంటూ ఏమీ తెలియనట్టు సంజు మాట్లాడుతాడు.. ఇక అందరూ కూడా నీలకంఠంకు సర్ది చెప్తారు అయితే నీలకంఠం ఒక కండిషన్ పెడతాడు. మీ బాలు జీవితంలో నా ఇంటి గడప తొక్క కూడదు అనేసి కండిషన్ పెడతారు. దాని ఒప్పుకుంటే మౌనికని ఇప్పుడే తీసుకెళ్ళిపోతామని అంటాడు. బాలు మీ గడప తొక్కడని మాట ఇస్తుంది ప్రభావతి. బాలు మాత్రం బాధతో తాగి గుడిలో దేవుడిని నిందిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నీలకంఠం కండిషన్ ఒప్పుకొని మౌనికను అత్తింటికి పంపిస్తారు. పంపిస్తారు. ఇక సువర్ణ మీనాకు భరోసా ఇస్తుంది నా కూతురు లాగా చూసుకుంటాను బాలుని జాగ్రత్తగా చూసుకో అనేసి మీనాతో అంటుంది. మౌనికను నీలకంఠం ఇంటికి తీసుకొని వస్తారు. ఇక బాలు తాగేసి గుడికి వెళ్తాడు. తన చెల్లెలు, తండ్రి అన్న మాటలను తలుచుకొని బాధపడతాడు. తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బాధపడతాడు. ఇంతలోనే ఓ స్వామీజీ వచ్చి.. మీ చేతిలో లేని వాటి గురించి అనవసరంగా ఆలోచించి బాధపడకు, పెళ్లిళ్లు అనేవి స్వర్గంలోనే నిర్ణయించబడతాయి. పెళ్లి అనేది ఆపాలనుకుంటే ఆగదు. అది పుట్టుకతోనే నిర్ణయించబడుతుంది. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు అని ఆ స్వామీజీ చెప్తాడు. ఆ రాక్షసుడుకి ఇచ్చి తన చెల్లిని పంపడం తనకి ఇష్టం లేదని బాలు బాధపడతాడు. ప్రతివాడు ఎప్పుడో అప్పుడు పరిస్థితులను బట్టి మారుతాడు. ఇక ఇంట్లోకి అడుగుపెట్టిన మౌనిక దేవుడ్ని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది. శాంతి పూజకు రెడీ చేయమని నీలకంఠం సువర్ణకు చెప్తాడు. సంజు నేను మీనా బాలుని వెతుక్కుంటూ గుడికొస్తుంది. మౌనిక కొట్టినందుకు బాధపడుతున్నారా? అని ప్రశ్నించగా బాలు సమాధానం చెబుతూ ఇంకా నాలుగు దెబ్బలు వేసినా తాను బాధపడే వాడిని కాదని వాడిని నమ్మి మోసపోయిందంటూ బాధపడతాడు. మీ చెల్లి నువ్వు ఎక్కడ ఆవేశపడి హంతకుడులా మారుతావో అనే భయంతోనే కొట్టింది. మీరు బాధపడకండి. అంతా సెట్ అవుతాయని సద్ది చెబుతుంది మీనా. అందరిలాగానే తన చెల్లి కూడా వాడి మాయలో పడి మోసపోయిందని బాలు బాధపడతాడు.. ఇక సువర్ణ అన్ని సర్దుకుంటాయి.. ఆవేశం పనికిరాదు సహనం ఓర్పు తో ఉండమని సలహా ఇస్తుంది. నీ కాపురాన్ని నీకు తగ్గట్టుగా మార్చుకోవడం నీ బాధ్యత అని ఇన్ డైరెక్టుగా సంజీవ్ క్యారెక్టర్ గురించి చెబుతోంది. ప్రతి సంసారంలో మంచి చెడులు, కోపం శాంతం వంటివి ఉంటాయి వాటిని సర్దుకుపోవడమే జీవితం అని చెబుతుంది. తాను అన్నిటిని భరిస్తానని మౌనిక సమాధానం ఇస్తుంది. సువర్ణ మాత్రం ఈ పిచ్చి పిల్లను ఈ దుర్మార్గుడు ఎలా బాధలు పెడతాడో అని భయపడుతుంది.

ఇక బాలును నచ్చచెప్పి ఇంటికి తీసుకొని వస్తుంది మీనా.. ఇంట్లో వాళ్ళందరూ బాలు పై కోపంగా ఉంటారు. ప్రభావతి కనీసం మొహం కూడా చూడదు. ఇంట్లో ఉన్న అందరు బాలు పై కోపంగా ఉంటారు. సత్యం మాత్రం బాలు చేసిన దాన్ని తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అన్నం తినండి అని మీనా అంటుంది. కానీ బాలు మాత్రం అన్నం తినడు. మౌనిక ఎలా ఉందో అని ఆలోచిస్తాడు. ఇక ఇంట్లో అందరు బాధ పడతారు. అటు శోభనానికి నీలకంఠం అన్ని ఏర్పాట్లు చేస్తారు. పూజ చేయించి మౌనికను సువర్ణ గదిలోకి పంపిస్తుంది. అక్కడకు ఎంటర్ అవ్వగానే తాగడం చూసి షాక్ అవుతుంది. శోభనం అనగానే ఎవరికీ నీకా అని అంటాడు. మనకు అని అంటుంది. కానీ సంజు నిజ స్వరూపం బయట పెడతాడు. మీ బాలుకు బుద్ది చెప్పాలనే నీ మెడలో తాళి కట్టానని చెప్తాడు. అది విన్న మౌనిక షాక్ అవుతుంది.. తన గురించి బాలు అన్నయ్య ఎంత చూపినా వినకుండా పెళ్లి చేసుకున్న అని ఏడుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో చూడాలి..


Related News

Telugu TV Serials: టీవీ సీరియల్స్ రేటింగ్..కార్తీక దీపం తో ఆ సీరియల్ పోటీ..?

Illu Illalu Pillalu Today Episode: నర్మద పై కలెక్టర్ ప్రశంసలు.. రామరాజు గౌరవాన్ని కాపాడిన కోడళ్లు.. ధీరజ్ ప్రేమకు ప్రపోజ్..

Nindu Noorella Saavasam Serial Today october 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి సవాల్‌కు ప్రతి సవాల్‌ విసిరిన మిస్సమ్మ  

Brahmamudi Serial Today October 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తనది నాటకం కాదని అపర్ణ, ఇంద్రాదేవికి చెప్పిన కావ్య

Intinti Ramayanam Today Episode: నిజం చెప్పిన పల్లవి.. ఇంట్లోంచి గెంటేసిన కమల్.. అవనికి అక్షయ్ క్షమాపణలు..

GudiGantalu Today episode: రచ్చ చేసిన బాలు.. సత్యం షాకింగ్ నిర్ణయం..? కామాక్షి దెబ్బకు ఫ్యూజులు అవుట్..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు..

Serial Actress : సీరియల్స్ లో నటిస్తూనే బిజినెస్ లు చేస్తున్న యాక్టర్స్ ఎవరో తెలుసా..?

Big Stories

×