BigTV English

Game Changer: బాలీవుడ్‌లో ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌కు భారీ ప్లాన్.. ఏకంగా అక్కడికి వెళ్లిపోయిన హీరో, హీరోయిన్

Game Changer: బాలీవుడ్‌లో ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌కు భారీ ప్లాన్.. ఏకంగా అక్కడికి వెళ్లిపోయిన హీరో, హీరోయిన్

Game Changer: పాన్ ఇండియా రేంజ్‌లో ఒక సినిమాను తెరకెక్కించారంటే.. దానికి ప్రమోషన్స్ కూడా అదే రేంజ్‌లో జరగాలి. అలా అయితేనే ప్రతీ భాషా ప్రేక్షకుడికి ఈ మూవీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడే సినిమాకు ఊహించినంత ఆదరణ కూడా లభిస్తుంది. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ విషయంలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఈ మూవీని అన్ని రాష్ట్రాల్లో ప్రమోట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో అసలు మూవీ టీమ్ ప్రమోషన్స్ చేయదు అనుకునేలోపే హీరో, హీరోయిన్‌తో సహా అందరూ ప్రమోషన్స్‌లో యాక్టివ్ అయ్యారు. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ను ప్రమోట్ చేయడం కోసం బాలీవుడ్ గడ్డపై అడుగుపెట్టారు రామ్ చరణ్, కియారా అద్వానీ.


జంట రిపీట్

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటించింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వినయ విధేయ రామ’ అనే మూవీ వచ్చింది. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ అందులో ఈ పెయిర్ మధ్య కెమిస్ట్రీ మాత్రం పరవాలేదనిపించింది. అందుకే మరోసారి ‘గేమ్ ఛేంజర్’తో ఈ జంటను కలిపారు శంకర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం కియారా అద్వానీ (Kiara Advani) ఇంకా రంగంలోకి దిగలేదు. తాజాగా బిగ్ బాస్ 18లోకి రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి వెళ్లి ‘గేమ్ ఛేంజర్’ ప్రమోట్ చేస్తున్నారనే విషయం బయటకొచ్చింది.


Also Read: ‘గేమ్ ఛేంజర్’పై కన్నడ ప్రేక్షకుల ఫైర్.. బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్, ఎందుకంటే.?

కలిసి వెళ్లారు

మెగా ఫ్యామిలీతో సల్మాన్ ఖాన్ చాలా క్లోజ్‌గా ఉంటారు. అందుకే ఒకరికొకరు ఎప్పుడూ సాయం చేసుకుంటూ ఉంటారు. గెస్ట్ రోల్స్ చేసే విషయంలో, మూవీ ప్రమోషన్స్ విషయంలో ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటారు. అందుకే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 18లోకి తన ‘గేమ్ ఛేంజర్’ మూవీని ప్రమోట్ చేయడం కోసం రామ్ చరణ్‌కు ఆహ్వానం అందింది. కియారా అద్వానీతో కలిసి బిగ్ బాస్ 18 హౌస్‌లోకి వెళ్లి ఈ మూవీని ప్రమోట్ చేయనున్నారు. తాజాగా ఆ షూటింగ్ కోసం రామ్ చరణ్ (Ram Charan), కియారా వెళ్లిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పటికే చాలామంది సౌత్ సెలబ్రిటీలు తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం హిందీ బిగ్ బాస్‌లో అడుగుపెట్టారు.

ట్రైలర్ అదుర్స్

‘గేమ్ ఛేంజర్’ (Game Changer) విషయానికొస్తే ఇందులో శ్రీకాంత్, అంజలి, ఎస్‌జే సూర్య, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వారంతా కలిసి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కూడా పాల్గొన్నారు. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ అయ్యింది. ట్రైలర్ విడుదలయినప్పటి నుండి లైక్స్ విషయంలో, వ్యూస్ విషయంలో రికార్డులు బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతోంది. పైగా ‘గేమ్ ఛేంజర్’కు ఇన్నాళ్లుగా పెద్దగా బజ్ లేదు. కానీ ఈ మూవీ నుండి విడుదలవుతున్న ప్రతీ అప్డేట్ ఇప్పుడు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×