Gundeninda GudiGantalu Today episode January 5th : నిన్నటి ఎపిసోడ్ లో.. నీలకంఠం కండిషన్ కు ఒప్పుకొని మౌనికను అత్తింటికి పంపిస్తారు. ఇక సువర్ణ మీనాకు భరోసా ఇస్తుంది నా కూతురు లాగా చూసుకుంటాను బాలుని జాగ్రత్తగా చూసుకో అనేసి మీనాతో అంటుంది. మౌనికను నీలకంఠం ఇంటికి తీసుకొని వస్తారు. ఇక బాలు తాగేసి గుడికి వెళ్తాడు. తన చెల్లెలు, తండ్రి అన్న మాటలను తలుచుకొని బాధపడతాడు. తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ బాధపడతాడు. ఇంతలోనే ఓ స్వామీజీ వచ్చి.. మీ చేతిలో లేని వాటి గురించి అనవసరంగా ఆలోచించి బాధపడకు, పెళ్లిళ్లు అనేవి స్వర్గంలోనే నిర్ణయించబడతాయి. పెళ్లి అనేది ఆపాలనుకుంటే ఆగదు. అది పుట్టుకతోనే నిర్ణయించబడుతుంది. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు అని ఆ స్వామీజీ చెప్తాడు. ఆ రాక్షసుడుకి ఇచ్చి తన చెల్లిని పంపడం తనకి ఇష్టం లేదని బాలు బాధపడతాడు. ప్రతివాడు ఎప్పుడో అప్పుడు పరిస్థితులను బట్టి మారుతాడు. ఇక ఇంట్లోకి అడుగుపెట్టిన మౌనిక దేవుడ్ని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది. శాంతి పూజకు రెడీ చేయమని నీలకంఠం సువర్ణకు చెప్తాడు. సంజు నేను మీనా బాలుని వెతుక్కుంటూ గుడికొస్తుంది. మౌనిక కొట్టినందుకు బాధపడుతున్నారా? అని ప్రశ్నించగా బాలు సమాధానం చెబుతూ ఇంకా నాలుగు దెబ్బలు వేసినా తాను బాధపడే వాడిని కాదని వాడిని నమ్మి మోసపోయిందంటూ బాధపడతాడు. మీ చెల్లి నువ్వు ఎక్కడ ఆవేశపడి హంతకుడులా మారుతావో అనే భయంతోనే కొట్టింది. మీరు బాధపడకండి. అంతా సెట్ అవుతాయని సద్ది చెబుతుంది మీనా. అందరిలాగానే తన చెల్లి కూడా వాడి మాయలో పడి మోసపోయిందని బాలు బాధపడతాడు..
ఇక సువర్ణ అన్ని సర్దుకుంటాయి.. ఆవేశం పనికిరాదు సహనం ఓర్పు తో ఉండమని సలహా ఇస్తుంది. నీ కాపురాన్ని నీకు తగ్గట్టుగా మార్చుకోవడం నీ బాధ్యత అని ఇన్ డైరెక్టుగా సంజీవ్ క్యారెక్టర్ గురించి చెబుతోంది. ప్రతి సంసారంలో మంచి చెడులు, కోపం శాంతం వంటివి ఉంటాయి వాటిని సర్దుకుపోవడమే జీవితం అని చెబుతుంది. తాను అన్నిటిని భరిస్తానని మౌనిక సమాధానం ఇస్తుంది. సువర్ణ మాత్రం ఈ పిచ్చి పిల్లను ఈ దుర్మార్గుడు ఎలా బాధలు పెడతాడో అని భయపడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ప్రోమో విషయానికొస్తే.. బాలుకు పెళ్ళిలో ఘోర అవమానం జరిగింది. ఆ బాధను మర్చిపోవడానికి తాగుతాడు. ఇక బయట ఉండిపోతాడు. బాలు కోసం వెతుక్కుంటూ వెళ్లిన మీనా నచ్చచెప్పి ఇంటికి తీసుకొని వస్తుంది.. ఇంట్లో వాళ్ళందరూ బాలు పై కోపంగా ఉంటారు. ప్రభావతి కనీసం మొహం కూడా చూడదు. ఇంట్లో ఉన్న అందరు బాలు పై కోపంగా ఉంటారు. సత్యం మాత్రం బాలు చేసిన దాన్ని తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. సత్యం చెప్పినా ప్రభావతి మాత్రం వినదు. ఇక ఇంట్లో అందరు అన్నం తినండి అని మీనా అంటుంది. కానీ బాలు మాత్రం అన్నం తినడు. మౌనిక ఎలా ఉందో అని ఆలోచిస్తాడు. ఇక ఇంట్లో అందరు బాధ పడతారు. అటు శోభనానికి నీలకంఠం అన్ని ఏర్పాట్లు చేస్తారు. పూజ చేయించి మౌనికను సువర్ణ గదిలోకి పంపిస్తుంది. అక్కడకు ఎంటర్ అవ్వగానే తాగడం చూసి షాక్ అవుతుంది. శోభనం అనగానే ఎవరికీ నీకా అని అంటాడు. మనకు అని అంటుంది. కానీ సంజు నిజ స్వరూపం బయట పెడతాడు. మీ బాలుకు బుద్ది చెప్పాలనే నీ మెడలో తాళి కట్టానని చెప్తాడు. అసలు ప్లాన్ ఏంటి అనే దాన్ని గురించి మౌనికకు చెబుతాడు. శోభనం గదిలోకి కోటి ఆశలతో వచ్చిన మౌనికకు భారీ షాక్ తగిలింది..
ఈ ప్రపంచంలోనే నన్ను చూడగానే పూర్తిగా అర్థం చేసుకున్నది మీ అన్నయ్య ఒక్కడే. వాడి చేతులు కట్టేసి ఆడుకుంటుంటే అప్పుడు కదా నాకు మజా వచ్చేది. నీ మెడలో పసుపు తాడు కట్టేసి.. ఇక్కడికి లాక్కొచ్చాను. ఇక్కడ నీకు దెబ్బపడితే వాడు అక్కడ గిలగిలలాడాలి. నీకు రోజుకో శిక్ష వేస్తూనే ఉంటాను అని సంజు కోపంగా, ఉక్రోశంగా అంటాడు. అది చూసిన మౌనిక షాక్ అవుతుంది. పెళ్లి చూపుల్లో అంత మంచివాడిలా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఇలా అంటున్నాడేంటీ అని భయపడుతుంది.. ఇక సంజు కు ఏమైందని కంగారు పడుతుంది. తాగినప్పుడు జరిగిన గొడవ గురించి బాలు అన్నయ్యను తప్పుగా అనుకుంటున్నారని, నిజానికి బాలు అన్నయ్య చాలా మంచివాడని, నాకు ఏం కావొద్దనే మీతో అలా ప్రవర్తించాడని మౌనిక నచ్చజెబుతుంది. కానీ, సంజు వినడు. రోజుకో శిక్ష వేసినట్లుగా చూపిస్తారు.అది విన్న మౌనిక షాక్ అవుతుంది.. బాలు అన్నయ్య ఎంత చూపినా వినకుండా పెళ్లి చేసుకున్న అని ఏడుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఎం జరుగుతుందో చూడాలి..