Daku Maharaj : నందమూరి బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహరాజ్.. సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 12వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. యాక్షన్ మూవీగా డాకు మహారాజ్ మూవీకి బాబీ దర్శకత్వం వహించారు.. ఈ మూవీ భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకేక్కుతుంది. భారీ అంచనాలతో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ పాటలు వచ్చి సినిమా గురించి మరింత చర్చ జరిగేలా చేశాయి. ఇక ఈనెల 5న డల్లాస్‌లో జరగబోతున్న భారీ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. అమెరికా నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ వేడుకలో యూనిట్ సభ్యులు పలువురు పాల్గొనబోతున్నారు.. అయితే మూవీ టిక్కెట్స్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి టిక్కెట్ ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం..
ఏపీలో టిక్కెట్స్ రేట్లు..
బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ మూవీ టిక్కెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 12 ఉదయం 4 గంటలకు వేసే బెనిఫిట్ షో టికెట్ రేటును రూ.500 గా నిర్ణయించింది. దాంతో పాటూ ఫస్ట్ డే నుంచి జనవరి 25 వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. దీంట్లో మల్టీప్లెక్స్ టికెట్పై రూ.135, సింగిల్ స్క్రీన్ల పై రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది. అలాగే మరోవైపు తెలంగాణలో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్గా పుష్ప–2 సినిమా వివాదం తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు లాంటివి ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక సంక్రాంతి సినిమాలకు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు. మామూలుగానే సినిమాలు రిలీజ్ అవుతాయి.
ఇకపోతే అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ నమోదు చేసిన బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి సెంటిమెంట్ తో బాలయ్య రాబోతున్నాడు.. గతంలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇక ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బాలకృష్ణ ను డాకు పాత్రలో చూపించే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. ఇంటర్వెల్ కన్నా ముందు వచ్చే సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక హై మూమెంట్ ఉంటుందని నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సినిమా పై అంచనాలు పెంచేస్తున్నాయి.. ఇక ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను కాంబోలో డాకు మహారాజ్ మూవీ చేస్తున్నాడు.