BigTV English
Advertisement

Ind Vs Aus 5Th Test: రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆలౌట్‌..పీకల్లోతు కష్టాల్లో ఆసీస్‌..స్కోర్‌ వివరాలు ఇవే ?

Ind Vs Aus 5Th Test: రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆలౌట్‌..పీకల్లోతు కష్టాల్లో ఆసీస్‌..స్కోర్‌ వివరాలు ఇవే ?

Ind Vs Aus 5Th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 2025 టోర్నమెంట్ లో ( Border Gavaskar Trophy 2024 2025 Tournament ) భాగంగా.. జరుగుతున్న ఐదవ టెస్టు చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా బ్యాటింగ్ చేయడంలో విఫలమవుతున్నాయి. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా పై ( Australia) చేయి సాధిస్తే… ఆ తర్వాత టీమిండియా  ( Team India ) దూకుడు గా ఆడింది. అంతేకాదు.. ఆస్ట్రేలియా పైన  ( Australia) నాలుగు పరుగుల లీడింగ్ సంపాదించింది టీమిండియా జట్టు.


Also Read: Travis Head: ఒరేయ్ ఏంట్రా.. SRH హెడ్ ను లేడీ చేసేశారు ?

ఇక రెండవ ఇనింగ్స్ వచ్చేసరికి… మళ్లీ టీమిండియా చతికల పడింది. దీంతో టీమ్ ఇండియా ( Team India ) జట్టుపైన ఆస్ట్రేలియా పెత్తనం చలాయీస్తుంది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 157 పరుగులకే కుప్పకూలడం జరిగింది. ఇది అత్యంత తక్కువ స్కోరు. 200 అయినా చేయాల్సి ఉండేది. కానీ 39.5 ఓవర్లు ఆడిన టీం ఇండియా ( Team India ).. 157 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోయింది.


రెండవ రోజు రాత్రి సమయానికి ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా… ఇవాళ 50 పరుగులు కూడా చేయలేకపోయింది. ఆలోపే… మిగిలిన నాలుగు వికెట్లు కూడా పడిపోయాయి. టీమిండియా ( Team India ) టేలండర్స్ అందరూ దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఇవాళ ఉదయం నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా ఆల్ అవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే… ఓపెనర్ గా వచ్చిన యశస్వి జైస్వాల్ 22 పరుగులు, రిషబ్ పంత్ చేసిన 61 పరుగులు మినహా… ఏ ఒక్క ఆటగాడు పెద్దగా రాణించలేదు. 20 పరుగులు దాటలేదు.

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. 12 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ ఆరు పరుగులు చేసి బోలా అండ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అటు కేఎల్ రాహుల్ కూడా ఓపెనర్ గా వచ్చినప్పటికీ 13 పరుగులకే అవుట్ కావడం జరిగింది. గిల్ ది కూడా అదే పరిస్థితి నెలకొంది. అసలు ఈ టోర్నమెంటులో గిల్ ఆడిన సందర్భాలే లేవు. అటు రిషబ్ పంత్ మాత్రమే జట్టును ఆదుకోగలిగాడు. అయితే బాక్సింగ్ టెస్ట్ లో మెరిసిన నితీష్ కుమార్ రెడ్డి…. మరోసారి అట్టర్ ప్లాప్ అయ్యాడు. కీలక ఐదవ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి ఎక్కడ మెరువలేదు.

Also Read: Rohit Sharma: శ్రీలంక చేతిలో రోహిత్ శర్మ కెరీర్..20 కేజీలు తగ్గాల్సిందే ?

ఇది ఇలా ఉండగా… రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కూడా కష్టాల్లో పడింది. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. లంచ్ బ్రేక్ సమయానికి 13 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా… మూడు వికెట్లు నష్టపోయి 71 పరుగులు చేసింది. మరో 91 పరుగులు చేస్తే టీమిండియాపై ( Team India ) ఆస్ట్రేలియా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే పిచ్ బౌలింగ్ కు అనుకూలించడంతో ఆ పరుగులు చేయడం కష్టమే అని అంటున్నారు.  సిడ్ని టెస్టులో గనుక టీమిండియా ఓడిపోతే… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆడే అవకాశాలు టీమిండియా కోల్పోతుంది.

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×