BigTV English

Gundeninda GudiGantalu Today episode: రవిని ఇంటికి తీసుకురావాలని ప్రభావతి ప్లాన్.. మైండ్ బ్లాక్ అయ్యేల చేస్తున్న సురేంద్ర..

Gundeninda GudiGantalu Today episode: రవిని ఇంటికి తీసుకురావాలని ప్రభావతి ప్లాన్.. మైండ్ బ్లాక్ అయ్యేల చేస్తున్న సురేంద్ర..

Gundeninda GudiGantalu Today episode January 8th : నిన్నటి ఎపిసోడ్ లో.. గదిలోకి తీసుకెళ్లిన మీనా బాలుని ఓదారుస్తుంది కానీ బాలు మాత్రం తన చెల్లిని ఒక దుర్మార్గుడికి ఇచ్చాడంటూ బాధపడుతూ ఉంటాడు. మౌనిక సంతోషంగా ఉంటుంది మౌనికకు మనందరం ఉన్నాం వాడు నీ జోలికి రాడు నువ్వు మౌనికని ఇబ్బంది పెడితే కొడతావని వారికి తెలుసు కదా ఇక మీరు నిక్షింతగా ఉండండి ఫస్ట్ భోజనం చేయండి అని ఓదారుస్తుంది. మీనా మాట విన్న బాలు భోజనం చేస్తాడు. మౌనికను తను అత్తింటికి ఎంత గౌరవంగా పంపాలని ఎన్నో కలలుగన్నాను. ఎవరికీ తెలియకుండా దాచిపెట్టుకొని మౌనికకు గాజులు కూడా కొన్నానని బాలు మీనాకు చూపిస్తాడు. మౌనిక సంతోషంగా ఉంటుంది ఈ గాజులు మీరే మౌనిక చేతికి వేస్తారు అని మీనా అంటుంది. ఇక బాలు మీనా ఒడిలో పడుకొని నిద్రపోతాడు. సువర్ణ మౌనికను పూజ చేసావా అని అడుగుతుంది. ఇప్పటివరకు కోడలుగా ఇంట్లో నేను దీపం పెట్టాను ఇక మీదట నుంచి నువ్వే దీపం పెట్టాలి ఇది మర్చిపోవద్దు అనేసి మౌనికకు చెప్తుంది. సంజయ్ ప్రవర్తనకు భయపడుతున్నావా భయపడొద్దు నీకు సపోర్టుగా నేనుంటాను నువ్వు నీ ప్రేమతో మార్చుకో నువ్వు మంచి దానివి నీ ప్రేమతో మారిస్తే వాడు మారతాడు అనేసి భరోసా ఇస్తుంది. మౌనిక అత్తయ్య మాటలకి పొంగిపోతుంది. ఇక సుశీలమ్మ వెళ్ళిపోతుంది. రవి, శృతిలను ఇంటికి తీసుకురమ్మని చెబుతుంది. ఇక సంజు ఉదయం లేవగానే మౌనికను టార్చర్ చేస్తాడు. అనవసరంగా తన నిద్రను డిస్టర్బ్ చేసావ్.. అంటూ మీ నాపై మండిపడతాడు. తాను కాఫీ తెచ్చానని చెబుతోంది మౌనిక..ఇక బాలు ఉలిక్కిపడి లేస్తాడు. మౌనిక అని అరుస్తాడు మీనా ధైర్యం చెబుతుంది మౌనిక అక్కడ ఇబ్బంది పడుతుందని బాలు మీనాక్షి బయలుదేరుతాడు.. ఇక బాలు ఆవేశంగా వెళ్లడం చూసి ప్రభావతి ఆపుతుంది ఇంట్లో అందరూ బాలుని తిడతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మౌనిక అత్తింట్లో ఇబ్బంది పడుతుందని మౌనికను తీసుకురావాలని బాలు ఆవేశంగా వెళ్లడం చూసి ప్రభావతి ఆపుతుంది ఇంట్లో అందరూ బాలుని తిడతారు. ప్రభావతి మీనా ను బాలునిద్దరిని కలిపి తిడుతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ బాలుని తిడతారు బాలుని ఆపే ప్రయత్నం చేస్తారు. మనోజ్ అడ్డుకుంటే మనోజ్ను తోసేస్తాడు. ఇక సత్యం బాలు దగ్గరకొచ్చి అందరి గురించి వదిలేయ్ నా గురించి నీకు తెలియదా నేను డబ్బు మనిషినా డబ్బుకు లొంగే వాళ్లకు కనిపిస్తున్నానా నా కూతురు ఎంత సంతోషంగా ఉండాలని నేను అనుకుంటాను నీకు తెలియదా అనేసి అడుగుతాడు. మౌనిక ఎలా ఉన్నా కూడా నువ్వు ఆ ఇంటికి వెళ్లడానికి వీల్లేదు కనీసం ఫోన్ చేయడానికి కూడా వీల్లేదని నా మీద ఒట్టు వేయని ఒట్టు వేయించుకుంటాడు. ఇక మీనా బాలు పైకి వెళ్తారు. బాలు కోపాన్ని కంట్రోల్ చేసేలా మీనా మాట్లాడుతుంది. మీరు ఆవేశాన్ని తగ్గించుకోవాలి మౌనికకు ఏమీ కాకుండా మనం చూసుకుందాం వాడు మారతాడేమో మంచి రోజులు వస్తాయేమో చూద్దామని అంటుంది.

మౌనిక కోసం చేయించిన గాజులను బాలుకి తీసుకొచ్చి ఇస్తుంది. ఇది నీ కోసం కాదు మౌనిక కోసం చేయించినవని అంటాడు. మౌనిక కోసం చేయించినవే ఇవి మీరు రాత్రి బాగా తాగి నా చేతికి ఇచ్చారు. ఇవి దాచి పెట్టాను మౌనిక సంతోషంగా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అన్నయ్య అని ఫోన్ చేసి నన్ను చూడడానికి రారా అని పిలిచినప్పుడు వెళ్లి మౌనిక చేతికి ఈ గాజులు వేయండి అని అంటుంది. మీనా చెప్పిన మాటకు బాలు సంతోష్ పడతాడు. మనిద్దరం గుడికి వెళ్లొద్దామని అడుగుతుంది. ఇక కింద అందరూ టిఫిన్ కోసం వస్తారు. ఇంతలోనే ప్రభావతి వచ్చి.. మళ్లీ బాలుని రెచ్చగొడుతుంది. లేనిపోని మాటలు అంటూ బాలుకి కోపం తెప్పిస్తుంది. ఇంతలోనే సత్యం వస్తాడు. అనవసరంగా గొడవ పెట్టుకోవద్దని ప్రభావతికి ఇటు బాలుకి నచ్చ చెప్తాడు..


షీలా డార్లింగ్ ఎక్కడ ? అని అడుగుతాడు బాలు. దీంతో ప్రభావతి ‘ఆమె ఎప్పుడో పోయింది’ అంటూ నోరు జారుతుంది. అలా తప్పుగా మాట్లాడటం అందరూ ప్రభావతిని కోపంగా చూస్తారు. మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడాలి అని సత్యం కోప్పడతాడు. ఆ తర్వాత ప్రభావతి మరింత రెచ్చిపోతుంది పెద్దకొడుకు ఎన్ని తప్పులు చేసిన వెనుక వెనకేసుకొని వస్తున్నారు. కానీ, చిన్నవాడు ఏం తప్పు చేశాడు వాడిని కూడా పిలవాలి అని ప్రభావతి అంటుంది. ఇది అదునుగా మనోజ్ కూడా రెచ్చిపోయే ప్రయత్నం చేస్తాడు.. ఇక అందరికి బాలు తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తాడు. ఇక సురేంద్ర ఉదయం లేవగానే మందు తాగుతూ కనిపిస్తాడు. శోభ వచ్చి ఉదయంనే మొదలుపెట్టారు ఏంటండీ ఏ పని చేయకుండా ఇలా తాగుబోతు లాగా తయారయ్యారని అడుగుతుంది. ఎలాగైనా శృతిని, రవిని ఇంటికి తీసుకురావాలని సురేంద్రకు చెబుతుంది. అలా వాడిని వాళ్లకు దూరం చేస్తే ప్రభావతి,సత్యం కు జీవితాంతం దెబ్బ కొట్టిన వాళ్ళం అవుతాం అంటూ మాస్టర్ ప్లాన్ వేస్తుంది శృతి తల్లి .దీనికి సురేంద్ర కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లు గుడికి వెళ్లిన మీనా బాలు మౌనికని చూస్తారు. మరి ఏం జరుగుతుందో రేపు చూడాలి…

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×