ఇండియా ఓపెన్ ప్రపంచ సూపర్ 750 టోర్నమెంట్ లో ( India Open 2025 )భారత స్టార్ షట్లర్ పివి సింధు ( PV Sindhu ) ఆడబోతుంది. పీవీ సింధు తో పాటు లక్ష సేన్ కూడా బరిలో దిగబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 14వ తేదీన ఢిల్లీలో… ఇండియా ఓపెన్ ప్రపంచ సూపర్ 750 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో…. ఇండియా నుంచి… పీవీ సింధుతో ( PV Sindhu ) పాటు చాలామంది బరిలో దిగబోతున్నారు.
ఈ టోర్నమెంట్ లో భాగంగా పురుషుల సింగిల్స్ లో లక్ష్యాసేన్, హెచ్ ఎస్ ప్రణయ్ అలాగే ప్రియాంష్ రాజావత్, తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో మహిళల సింగిల్స్ లో పీవీ సింధు పాల్గొంటున్నారు. పీవీ సింధు తో పాటు మాళవిక బన్సోద్, అనుపమ ఉపాధ్యాయ అలాగే ఆకర్షి కస్యప్ లాంటి ప్లేయర్లు కూడా బరిలో దిగబోతున్నారు.
ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే… పెళ్లి జరిగిన తర్వాత పీవీ సింధు పాల్గొనే మొదటి టోర్నమెంట్ ఇదే కావడం విశేషం. దీంతో పెళ్లి తర్వాత పీవీ సింధు ఎలా ఆడుతుంది అనే దాని పైన అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అటు పెళ్లి తర్వాత మొదటి సక్సెస్ అందుకోవాలని పివి సింధు కసరత్తులు మొదలు పెట్టిందట. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ – అలాగే చిరాగి శెట్టి జోడి ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Yuzvendra Chahal: విడాకులపై చాహల్ సంచలన పోస్ట్..రీసౌండ్ రావడం పక్కా ?
అటు సాయి ప్రదీప్ అలాగే పృద్వి… జంట బర్రిలో దిగబోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మహిళల డబుల్స్ గేమ్స్ లో మాత్రం… ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండబోతుంది. ఈసారి గాయత్రి గోపీనాథ్ అలాగే టిస్రా జాలి బరిలో ఉండనున్నారు. అశ్విని పొన్నప్ప – తనీషా పోటీ పడనున్నారని చెబుతున్నారు. ఏదేమైనా ఈ ఇండియా ఓపెన్ ప్రపంచ సూపర్ 750 టోర్నమెంట్ లో ( India Open 2025 ) పీవీ సింధు రాణించాలని చాలా మంది కోరుతున్నారు.
భారత ఆటగాళ్ల జాబితా: