Gundeninda GudiGantalu Today episode july 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి ఈ వయసులో మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నావా ఆయన లేనిది నేను ఉండను అని అంటుంది.. మొత్తానికైతే బాలు మీనా ఇంట్లో ఉండడానికి ప్రభావతి ఒప్పుకుంటుంది. రవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే శోభా సురేంద్ర ఆపినా కూడా ఆగకుండా వెళ్ళిపోతాడు. అటు సంజయ్ మౌనికను పిలిచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను పెళ్లయిన తర్వాత ఇన్ని రోజులకి ఇంత హ్యాపీగా ఉన్నాను ఎందుకో తెలుసా అని అంటాడు. ఏమైందండీ ఎందుకు అని అంటే ఇది నీకు బ్యాడ్ న్యూస్ కావచ్చు అని మౌనికతో అంటాడు సంజయ్. మీ ఇంట్లో వాళ్ళు గొడవపడ్డారు అంట ఫంక్షన్ ఆగిపోయింది అంట అని అనగానే మౌనిక ఫీల్ అవుతుంది. రవి శృతి వాళ్ళ ఇంట్లోంచి బయటికి వచ్సి రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ తనతో పాటు పనిచేస్తున్న మరొక చెప్పు రవి ఫంక్షన్ బాగా జరిగిందా అని అడిగితే ఏం ఫంక్షన్ ఏం చెప్పాలి అది తర్వాత మాట్లాడుకుందాం లే అని చిరాగ్గా అంటాడు. ఏమైందిరా అలా ఉన్నావు ఏం జరిగింది అంటే పెళ్లయిన తర్వాత ఇలాంటి బాధలుంటాయని తెలిస్తే నేను అసలు పెళ్లి చేసుకోను అని రవి అంటాడు.. బాలు, మీనా పై ప్రభావతి పీకలదాకా కోపంతో ఉంటుంది. రోహిణి కొత్త నాటకం ఫెయిల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి ప్రెగ్నెంట్ అనుకోని ప్రభావతి సంబరపడిపోతూ ఉంటుంది.. నా కోడలు కడుపుతో ఉందని హడావిడి చేస్తుంటుంది. ఈ విషయాన్ని కామాక్షి తో కూడా పంచుకుంటుంది. ఆమె వస్తు మామిడి కాయల బుట్టని తీసుకొస్తుంది.. మామిడికాయలను చూసినా ప్రభావతి మీనా అని పిలిచి లోపల పెట్టమని అరుస్తుంది. బయటకు వెళ్లిన వాళ్ళు ఇంకా రాలేదు ఏంటి అని ప్రభావతి కంగారు పడుతూ ఉంటుంది. కామాక్షి ఇంట్లోకి వస్తుంది. అన్నయ్యగారు మీరు తాతయ్య కాబోతున్నారు వదినా నువ్వు బామ్మ కాబోతున్నావు అంటూ గంపెడు మామిడికాయలు తీసుకొని వస్తుంది.
ఆ మామిడికాయలను చూసినా ప్రభావతి మీనా అ పిలిచి లోపల పెట్టమని అరుస్తుంది. ప్రభావతి చేయి తల్లికి మామిడికాయలు కింద పడటంతో అక్కడికొచ్చిన మీనా మామిడికాయ మీద కాలు వేసి జారి పడబోతుంది. బాలు పట్టుకుంటాడు కామాక్షి వాళ్ళ కన్నా ముందు వీళ్ళు కూడా తల్లిదండ్రులకు కాబోతున్నారేమో అని అంటుంది. ట్రిప్పు ట్రిప్పు అంట ఊరంతా తిరగకపోతే నీకు భార్య కడుపులో ఒక కాయనుగా కాపించొచ్చుగా కానీ కామాక్షి బాలుతో అంటుంది.. దానికి బాలు అర్ధరాత్రి విజిల్ వేసుకుంటూ ఊదుకుంటూ తిరుగుతూ ఉంటే కాయలు ఎక్కడ కాస్తాయి నీ మొహం అనేసి అంటాడు.
చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్ళిన రోహిణి ఇంటికి వస్తుంది. ప్రెగ్నెంట్ కాదన్న విషయాన్ని ఇంట్లో చెప్తుంది ఆ మాట వినగానే ప్రభావతి షాక్ అవుతుంది.. అందుకే ఏది ఆశలు పెట్టుకోదని అంటారు అని సత్యం అంటాడు.. పిలిపించి ఏవేవో కలిపి ఒక కషాయాన్ని మీనా చేత తాపిస్తాడు బాలు. ఆకాశయం తగ్గని మీనా వాంతి చేసుకుంటుంది. మా ఆవిడ ప్రెగ్నెంట్ అని సరదాగా ప్రభావతితో అంటాడు. ఆస్తి మొత్తం నా పిల్లలకి దక్కుతుంది అని బాలు అనగానే ప్రభావతి షాక్ అవుతుంది.
అమ్మయ్య నేను తెచ్చిన మామిడికాయలు వేస్ట్ అవ్వకుండా మీ నాకు పనికి వచ్చాయని కామాక్షి అంటుంది. అప్పుడే వచ్చిన మీనా ఊరుకోండి నా చేత ఏదో ఒక కషాయం తాపించి నాకు వాంతి చెల్లి చేశారని మీనా అంటుంది. అంటే మామిడికాయలు వేస్ట్ అయిపోయినట్టేనా అని కామాక్షి బాధపడుతుంది.. మామిడికాయలతో మీనా పచ్చడి పెడుతుంది మీకు కూడా పంపిస్తుంది లేత అని బాలు అంటాడు.. అయితే ప్రభావతీ కామాక్షి గదిలోకి వెళ్లి మాట్లాడుకుంటారు. కామాక్షి ప్రభావతి పై సెటైర్లు వేస్తుంది
బాలు ముందుగా తండ్రి అయితే ఆస్తి మొత్తం వాడతా తన్నుకు పోతాడని నువ్వు చాలా కంగారు పడిపోయావు. అటు రోహిణి మనోజ్ కూడా షాక్ అయిపోయారు నేను అంత గమనించాను అని అంటుంది. అవును ఆ మీనా తొందరగా తలయితే అదే జరుగుతుంది నేను తొందరగా కాకూడదనే కోరుకున్నాను అని కామాక్షితో అంటుంది. శృతి కి ఫోన్ చేస్తుంది.. శృతి నేను బాలు ఉండగా ఆ ఇంట్లోకి చచ్చిన రాను అని సమాధానం చెబుతుంది. ప్రభావతి ఎంత సద్ది చెప్పాలని చూసినా శృతి మాత్రం నేను రానంటే రాను కావాలంటే వీడియో కాల్ చేస్తాను మాట్లాడండి అని అంటుంది.
Also Read :భారీ ధరకు ‘అఖండ 2’ నాన్ థియేట్రికల్ బిజినెస్.. మళ్లీ ఆ ఓటీటీలోకే..
ఇక రాత్రి రవి పేరుతో కొరియర్ వచ్చిందని కొరియర్ బాయ్ అనగానే.. సత్యం రవిని పిలవరా కొరియర్ వచ్చిందంట అని అంటాడు. ఇంట్లో లేడు కదా నాన్న.. అవును కదా ఆ సంగతి నేను మర్చిపోయాను అని సత్యం అంటాడు. ప్రభావతి రవి వచ్చాడా ఏడి ఎక్కడ అని వెతుకుతుంది. రవి కాదమ్మా రవి పేరుతో కొరియర్ వచ్చింది అని మనోజ్ అంటాడు. వీధి పల్లె నా కుటుంబం రెండు ముక్కలైంది అని ప్రభావతి బాలు పై రెచ్చిపోతుంది. మీనా నీ దొంగ అన్నప్పుడు నువ్వు ఇంత బాధ పడలేదే. ఇంటి కోడలి దొంగ అంటే నువ్వు ఇలా ఒప్పుకుంటావా అని బాలు అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..