Eng vs Ind 3rd Test: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. లండన్ లోని లార్డ్స్ వేదికగా ఈ మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో.. టీమిండియా అటు ఇంగ్లాండ్ టీం ఆటగాళ్లు అద్భుతంగా రానిస్తున్నారు. మొదట టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించగా.. ఆ తర్వాత పట్టు కోల్పోయారు. నాలుగు వికెట్లు తీసిన తర్వాత మ్యాచ్ మొత్తం మళ్లీ ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్ళింది. రూట్ అలాగే బెన్ స్టోక్స్ ఇద్దరు అద్భుతంగా రాణించి…. ఐదవ వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశారు.
మొదటి రోజు ఇంగ్లాండ్ స్కోర్ ఎంత?
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో 83 ఓవర్లు ఆడింది ఇంగ్లాండ్. ఈ నేపథ్యంలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ టీం 251 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ 18 పరుగులకు అవుట్ గా బెన్ డెకెట్ 23 పరుగులు చేసి పెవిలియన్ కు వెళ్లిపోయాడు. మొదటి వికెట్ కు వచ్చిన పోప్ 44 పరుగులు చేసి రాణించాడు. ఆ తర్వాత వచ్చిన బ్రూకు 11 పరుగులు చేసి మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. రూట్ అలాగే స్టోక్స్… ఇద్దరు అద్భుతంగా రానించి వికెట్ పడకుండా నిలబడ్డారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 251 పరుగులు చేసింది ఇంగ్లాండ్. ఈ తరుణంలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది.
అదరగొట్టిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)
మొదటి రెండు టెస్టుల్లో మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, బుమ్రా అద్భుతంగా రాణించగా… మూడవ టెస్ట్ వచ్చే సమయానికి.. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించాడు. స్టార్ బౌలర్లు వికెట్లు తీయకపోవడంతో రంగంలోకి దిగిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి…. వరుసగా రెండు వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్ కు పంపాడు నితీష్ కుమార్ రెడ్డి. 14 ఓవర్లు వేసిన నితీష్ కుమార్ రెడ్డి 46 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అటు.. బుమ్రా కు మరో వికెట్ పడింది. అతను 18 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రవీంద్ర జడేజా 10 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చి మరొకటి చేశాడు. ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్ అలాగే వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ కూడా తీయలేకపోయారు. ఈ మ్యాచ్ లో ఆకాష్ విరాళంగా పరుగులు ఇస్తున్నాడు. 17 ఓవర్లు వేసి ఏకంగా 75 పరుగులు ఇచ్చాడు. రికార్డు 99 పరుగుల వద్ద రూట్ బ్యాటింగ్ చేస్తున్నాడు.
Also Read: Sara Tendulkar : సచిన్ కూతురు సారా ఇలా చేస్తుంది ఏంటి.. అమ్మాయిలతోనే బెడ్ షేర్ చేసుకుంటుందా !
కమిన్స్ సూచనలతో నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్
ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ సూచనల మేరకు బౌలింగ్ చేస్తున్నట్లు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆస్ట్రేలియా టూర్ వెళ్ళినప్పుడు అతని సలహాలు పాటించానని… వివరించాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడినప్పుడు కూడా… కమిన్స్ చాలా టిప్స్ నేర్పించాడని… అందుకే ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై అద్భుతంగా బౌలింగ్ చేయగలుగుతున్నానని వివరించాడు.