BigTV English

The 100 Movie Review : ‘ది 100’ రివ్యూ : 50 మర్క్స్ మాత్రమే

The 100 Movie Review : ‘ది 100’ రివ్యూ : 50 మర్క్స్ మాత్రమే

The 100 Movie Review : ‘చక్రవాకం’ ‘మొగలి రేకులు’ వంటి టీవీ సీరియల్స్ తో బుల్లితెరపై స్టార్ గా ఎదిగిన ఆర్.కె.సాగర్ హీరోగా కూడా సినిమాలు చేశారు. ‘సిద్దార్థ’ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ‘షాదీ ముబారక్’ వంటి సినిమాల్లో నటించారాయన. కానీ ఆ సినిమాలు ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్లిపోయాయో చాలా మందికి తెలీదు. ‘షాదీ ముబారక్’ మాత్రం ఓటీటీలో మంచి టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత సాగర్ మళ్ళీ కనుమరుగైపోయాడు. మొన్నామధ్య ‘జనసేన’ పార్టీలో చేరి పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఈ క్రమంలో ‘ది 100’ అనే క్రైమ్ థ్రిల్లర్ లో నటించాడు. ఈ సినిమాలో తనకి అచ్చొచ్చిన ఖాకీ డ్రెస్ ను మరోసారి నమ్ముకున్నాడు. మరి ఖాకీ అతనికి మళ్ళీ కలిసొచ్చిందా? ‘ది 100’ సాగర్ కి హిట్ ఇచ్చిందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం పదండి…


కథ :
విక్రాంత్(ఆర్ కె సాగర్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఎంపికవుతాడు. కానీ గన్ వాడాల్సిన పరిస్థితి రాకూడదు అని దానిని లాకర్లో పెట్టేస్తాడు. ‘జులాయి’ లో రాజేంద్రప్రసాద్ మాదిరి అనమాట. అయితే నగరంలో విచిత్ర పద్దతిలో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. అడ్డొచ్చిన వాళ్ళని దొంగలు విచిత్రమైన పద్దతిలో చంపేస్తుంటారు. ఈ కేసుని టేకప్ చేస్తాడు విక్రాంత్. అదే టైంలో ఆర్తి(మిషా నారంగ్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఒక రోజు ఆ దొంగలు ఆర్తీ ఇంట్లోకి చొరబడి ఆమెను మానభంగం చేస్తారు.

అలాగే ఇంకో ఘోరం కూడా చేస్తారు. అదేంటి? అందరి ఇళ్ళకి వెళ్లి కేవలం బంగారం దొంగతనం చేసి.. అడ్డొచ్చిన వాళ్ళను చంపేసే ఆ దొంగలు ఆర్తీని ఎందుకు మానభంగం చేశారు? వాళ్లకి ఆర్తికి సంబంధం ఏంటి? తర్వాత విక్రాంత్ తో ఆర్తీ ప్రేమాయణం ఏమైంది? అసలు ఆర్తీ గతమేంటి? ఆర్తీకి ఆమె ఫ్రెండ్ మధు(విష్ణు ప్రియా) వల్ల వచ్చిన కష్టమేంటి? అసలు ఆమె గతం ఏంటి? ఫైనల్ గా ఈ కేసుని విక్రాంత్ ఎలా సాల్వ్ చేశాడు? అతను వాడకూడదు అనుకున్న గన్ ని ఎందుకు వాడాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.


విశ్లేషణ :
పోలీస్ కథలంటే ఆడియన్స్ లో ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ ఏర్పడింది. సిన్సియర్ గా డ్యూటీ చేసే పోలీస్.. విలన్ కి ఎదురుపడటం. అతన్ని ఎదిరించే క్రమంలో.. విలన్ హీరో ఫ్యామిలీని టార్గెట్ చేసి వేధించడం. క్లైమాక్స్ లో హీరో రూల్స్ పక్కన పెట్టేసి విలన్ ని అంతం చేయడం. ఇప్పటివరకు పోలీస్ స్టోరీలు అంటే ఇలాగే ఉంటాయేమో అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ ‘ది 100’ కోసం కొత్త పాయింట్ తీసుకున్నాడు. అందులో భాగంగా కొన్ని థ్రిల్లింగ్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు. టైం పాస్ చేయించింది. కానీ సెకండాఫ్ డ్రాగ్ అయ్యింది.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ని ఎక్కువగా చూపించడం వల్ల సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే కొన్ని ఫైట్స్ కూడా అనవసరంగా పెట్టారేమో అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా రెగ్యులర్ గా ముగిసింది. సెకండాఫ్ పై కేర్ తీసుకుని ఉంటే కచ్చితంగా ‘ది 100’ ఓ కల్ట్ మూవీ అయ్యేది. ఎడిటింగ్ బాగా చేశారు. ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర మ్యూజిక్ పెద్ద ఇంప్రెస్ చేయలేదు. పాటలు కూడా సీరియస్ గా వెళ్తున్న కథకి అడ్డుగా అనిపిస్తాయి.నిర్మాణ విలువలు ఓకే. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అంత ఇంప్రెస్ చేయలేదు. కానీ తీసి పారేసే విధంగా ఏమీ లేదు.

నటీనటుల విషయానికి వస్తే.. ఆర్.కె.సాగర్ కి ఇది ఛాలెంజింగ్ రోల్ ఏమీ కాదు. అతను ‘మొగలి రేకులు’ సీరియల్లో చేసిన యాక్టింగే చేశాడు. కాకపోతే ఇందులో ఫైట్స్ ఎక్కువ పెట్టించుకున్నట్టు ఉన్నాడు. హీరోయిన్ మిషా నారంగ్ ఒక్కటే ఎక్స్ప్రెషన్ తో లాగించేసింది. ధన్య బాలకృష్ణ, విష్ణు ప్రియా..లకి మంచి పాత్రలు దొరికాయి. కమెడియన్ గిరిధర్ కి కూడా చాలా కాలం తర్వాత లెంగ్తీ రోల్ దొరికింది. మిగతా నటీనటులు ఓకే.

ప్లస్ పాయింట్స్ :

కాన్సెప్ట్
ఫస్ట్ హాఫ్
థ్రిల్లింగ్ మూమెంట్స్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్
పాటలు

మొత్తంగా.. ‘ది 100’ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. కానీ రెగ్యులర్ గా ముగిసింది. ఓటీటీలో అయితే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో అయితే కష్టమే.

The 100 Movie Rating : 2.25/5

Related News

Little Hearts Movie Review: లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ

Lokah – Chapter 1 : Chandra Review : ‘కొత్త లోక – చాప్టర్ 1: చంద్ర’ రివ్యూ… పవర్ ఫుల్ లేడీ సూపర్ హీరో

Tribanadhari Barbarik Review : ‘త్రిబాణధారి బార్బరిక్’ రివ్యూ…. వీక్ స్క్రీన్ ప్లే -స్ట్రాంగ్ కంటెంట్

Ghaati Sensor Review : ఘాటీ సెన్సార్ రివ్యూ… టాక్ ఎలా ఉందంటే ?

Sundarakanda Movie Review : ‘సుందరకాండ’ రివ్యూ – స్లోగా సాగే టిపికల్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా

Bun Butter Jam Review : ‘బన్ బటర్ జామ్’ మూవీ రివ్యూ… జెన్ జెడ్ ఫీల్-గుడ్ ట్రీట్

Big Stories

×