BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలు మాటతో శృతి మారుతుందా? మీనాకు అడ్డంగా దొరికిపోయిన మనోజ్..

Gundeninda GudiGantalu Today episode: బాలు మాటతో శృతి మారుతుందా? మీనాకు అడ్డంగా దొరికిపోయిన మనోజ్..

Gundeninda GudiGantalu Today episode july 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి మీ అమ్మా నాన్నను అడుగు డబ్బులు. ఇంటిని తాకట్టు పెట్టి ఇస్తారు అని రెచ్చగొట్టి ఇంటికి పంపిస్తుంది. మనోజ్ ఇంటికి వచ్చి డబ్బులు కావలి. ఇంటిని తాకట్టు పెడదాము అంటాడు. దాని ప్రభావతి అస్సలు ఒప్పుకోదు..నీ చదువుల కోసం ఇప్పటికే చాలా అప్పులు చేశాడు మీ నాన్న.. ఇకమీదట ఒక్క రూపాయి కూడా నీకు ఇచ్చేది లేదు అని ప్రభావతి అనగానే మనోజ్ షాక్ అవుతాడు.. బాలు కూడా ఏంటి మా అమ్మ మనోజ్ కి డబ్బులు ఇవ్వనంటుందా అంటూ షాక్ లో ఉండిపోతాడు. ఇక్కడే ఉండి ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా అని మీనా అంటే.. మనోజు సీరియస్ గా మీనా పై అరుస్తాడు. ఇక్కడే ఉండి నీలాగా పూలు అమ్ముకోమంటావా అని అంటాడు. నా డిగ్రీ గురించి చెప్తే నీకు నోరు కూడా తిరగదు అని మనోజ్ అంటాడు. మీనా, బాలు నన్ను చూసి ఎలా అంటున్నారో చూడండి అని మనోజ్ అంటాడు. వాళ్ల సంగతి వదిలేయి. నీకు రూపాయి కూడా ఇవ్వము అని ప్రభావతి అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. కస్టమర్లను కారులో ఎక్కించుకొని బాలు శృతి డబ్బింగ్ చెప్తున్న స్టూడియో దగ్గరకు వెళ్తాడు. అరే ఇది మా డబ్బుడమ్మ పనిచేసే స్టూడియో లాగా ఉంది అనేసి అనుకుంటాడు. కస్టమర్లు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు డబ్బులు పోయినా టెన్షన్లో వెళ్లిపోయినట్టున్నారు ఒకసారి వెళ్లి అడిగి తీసుకోవడం మంచిదని బాలు అనుకుంటాడు. ఒక అమ్మాయి లోపలికి వెళ్లగానే ఇక్కడ పర్స్ ఉంది.. నువ్వే తీసావు కదా మర్యాదగా ఆ పర్స్ ఎక్కడుందో చెప్పు అని శృతిని నిలదీస్తుంది.

ఏం పర్సు, ఏది దాని గురించి మాట్లాడుతున్నారు అని శ్రుతి రెచ్చిపోయి మాట్లాడటం లేదు. ఇద్దరూ గొడవకు దిగేంత పని చేస్తారో.. నేను మీ కంటికి దొంగలాగా కనిపిస్తున్నానా ఏం మాట్లాడుతున్నారు అది అని శృతి ఫైర్ అవుతుంది. నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరిని దొంగ అని నిందించకూడదు అని అవతల వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. మొత్తానికి అయితే శృతిని గండం నుంచి గట్టి ఎక్కిస్తాడు బాలు. శృతిని నువ్వు వాళ్ళని ఎందుకు కొట్టావు అని అడుగుతాడు. వాళ్ళు నన్ను ఊరికే దొంగ అన్నారు నేను దొంగతనం చెయ్యకపోయినా నేను దొంగ అంటే కోపం రాదా అని అంటుంది.


నువ్వు దొంగతనం చేయలేదని నీకు తెలుసు అందుకే వాళ్ళ దొంగ అనగానే నీకు కోపం వచ్చింది మీ నాన్నను మీ నాన్న అలానే అన్నాడు కదా మరి నాకు కోపం రాకుండా ఉంటుందా అని శృతి తో నిదానంగా మర్యాదగా మాట్లాడుతాడు. మీ నాన్న కావాలని ప్రతిదానికి నాతో గొడవ పడేలా చేయాలని అనుకున్నాడు. నేను చాలా మౌనంగా మౌనవ్రతంలో ఉన్నాను. మీనా నన్ను ఏ గొడవ జరగనీయకుండా కాపాడుకుంటూ వచ్చింది. మీ నాన్న నిన్ను రవిని అక్కడే ఉంచేందుకు ప్లాన్ చేశాడు అది మీరు అర్థం చేసుకుంటే మంచిది..

చదువుకున్న అమ్మాయివి కదా ఆ మాత్రం మీకు అర్థం కాదా.. మీనా ను మీ నాన్న దొంగ అనడం వల్ల నేను కొట్టాను. నా మీద మీకు కోపం ఉండాలి అంతేగాని నా తమ్ముడికి ఏం చేశాడు. ఎందుకు దూరం పెడుతున్నావ్ అని బ్రతిమలాడుతాడు బాలు. వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు తెలుసా..? అటు ఇంటికి రాలేదా అటు నీ దగ్గరికి రాలేక.. ఆ హోటల్ రెస్టారెంట్లో ఓ గదిలో బొద్దింకలు ఎలకల మధ్య పడుకుంటున్నాడు. వాడిని ఎందుకు దూరం పెట్టాలి? మీరిద్దరూ మంచిగా ఉంటే మేం కూడా మంచిగా ఉంటాం కదా అని బాలు చాలా ప్రశాంతంగా శృతికి వివరంగా చెప్తాడు.

Also Read: ధీరజ్ కు షాకిచ్చిన ప్రేమ.. ఇంట్లోంచి వెళ్లిపోతున్న నర్మద..

మీనా ఇంట్లో జరుగుతున్న గొడవలు కారణంగా ప్రశాంతత లేదు అని గుడికి వెళుతుంది. అక్కడ గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు.. అక్కడున్న ముష్టి వాళ్ళు డబ్బులు అడగడంతో వాళ్లకి డబ్బులు వేస్తుంది.. అందులో ఒక వ్యక్తి గొంతు మాత్రం ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది అని మీనా అనుకుంటుంది. నీ మొహం చూపించు అని మొహం మీద ఉన్న గుడ్డని లాగేస్తుంది. అక్కడ మనోజ్ ను చూసి షాక్ అవుతుంది. ఏంటి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి మీకు అని మనోజ్ ఏమీ తెలియనట్లు అడుగుతాడు.. ఈ విషయాన్ని వెంటనే బాలుకు చెప్పాలని మీద అనుకుంటుంది.. బాలు కు ఫోన్ చేసి మీరు అర్జెంటుగా గుడి దగ్గరికి రావాలి అని అడుగుతుంది. మీ అన్నయ్య ఇక్కడ ముష్టి వాళ్ళతో అడుక్కుంటున్నాడండి అని అంటుంది అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. మనోజ్ ని బాలు ప్రభావతి దగ్గరికి తీసుకెళ్లి ఎంత రచ్చ చేస్తారో చూడాలి…

 

Related News

Jayammu Nischayammuraa: చాలా లీలలున్నాయి.. శ్రీలీల పై కంప్లైంట్ చేసిన జగ్గు భాయ్!

Anasuya: అవే మెయిన్ టార్గెట్ అంటున్న అనసూయ.. భారీగానే సంపాదిస్తోందే!

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. నగలతో అడ్డంగా బుక్.. రామరాజు షాకింగ్ నిర్ణయం..

Intinti Ramayanam Today Episode: మనసు మార్చుకున్న పార్వతి.. పుట్టింట్లో ప్రణతికి ఘోర అవమానం..

Brahmamudi Serial Today August 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అందరి ముందు కావ్యను కడుపు వచ్చిందన్న స్వరాజ్‌ – అయోమయంలో పడిపోయిన రాజ్‌

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు అవమానం.. బాలు పై రోహిణి రివేంజ్.. పిల్లలు కోసం శృతి ఫైట్..

Big Stories

×