Illu Illalu Pillalu Today Episode july 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. సేన వాళ్ల ఇంట్లోకి వెళ్లిన తిరుపతి ఇంకా రాలేదని గుమ్మం బయట ఎదురు చూస్తూ టెన్షన్ పడుతూ శ్రీవల్లి ఉంటుంది.. బాబాయ్ గారు నగలను ఇచ్చేసారా అని అడుగుతుంది. అయితే ఇచ్చాను అని అంటాడు. అవి డూప్లికేట్ అని ఎక్కడ తెలుసుకుంటారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. బాబాయ్ గారు అంటే అవి ప్రేమ నగలుగా ఎందుకు చెక్ చేస్తారు లోపల పెట్టేసారు అని అనగానే శ్రీవల్లి సైలెంట్ అవుతుంది. అమ్మయ్య గిల్టు నగల్ని ఆ ఇంటికి చేర్చేశాను ఇక నాకు ఏ బాధ లేదు నా నగలు గిల్టు అని తెలిసే అవకాశం లేదు అని శ్రీవల్లి సంతోష పడుతూ ఉంటుంది. ప్రేమ మాత్రం శ్రీవల్లిని అనుమానిస్తుంది. ఏదో జరుగుతుంది అని అనుమానిస్తుంది. ఆ తర్వాత ధీరజ్ కు ప్రేమ షాకిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. ప్రేమ కోసం ధీరజ్ వెతుక్కుంటూ వస్తాడు. నీకోసం నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను.. నువ్వెక్కడున్నావా? నీకోసం నేను ఒక అదిరిపోయే సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని అంటాడు. నీకోసం ఎంబీఏ ఫార్మ్ తీసుకొచ్చాను. ఇది అయిన తర్వాత నువ్వు ఎమ్మెస్ చేయాలని అనుకుంటున్నావు కదా.. ఫామ్ ఫిల్ చేయమని ధీరజ్ అంటాడు.. ప్రేమ మాత్రం కోపంగా ఆ ఫామ్ ని చించేస్తుంది. అదేంటి ఆలోచించేసావ్ ఎమ్మెస్ చేయడం నీ డ్రీమ్ కదా అని ధీరజ్ అంటాడు.. నా డ్రీమ్ గురించి ఆలోచించాల్సిన అవసరం నీకేంటి అని ధీరస్ ని అడుగుతుంది ప్రేమ. నీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేనప్పుడు నా గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ధీరజ్ మాత్రం ఆలోచిస్తాడు. ప్రేమ ఎందుకు ఇలా చేస్తుంది అనుకుంటాడు. ప్రేమ నన్ను క్షమించు దీరజ్ అని ఎమోషనల్ అవుతుంది. నర్మదా సాగర్ దూరం పెట్టడంతో బాధపడుతూ ఉంటుంది. సాగర్ ను తనవైపు తిప్పుకునేలా ప్లాన్ చేయాలని అనుకుంటుంది. సాగరన్న మాటలు నన్ను ఇంకా బాధ పెడుతున్నాయని తలచుకుంటూ బాధ పడుతుంది. ఇంట్లో పరిస్థితులు ఇలా మారాయే అంతా నావల్లే అని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. తమ్ముళ్లు బాధ పడుతున్నారని చందు అనుకుంటారు..
ధీరజ్ మాత్రం ప్రేమ చేత ఎంబీఎ ఫామ్ ను ఫిల్ చేయించాలని అనుకుంటాడు. శ్రీవల్లి ఇంట్లో పెట్టను నా చేతిలోకి రావాలని ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీవల్లి తల్లి భాగ్యం చెప్పిన ప్లాను ప్రకారం ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు నాటకం ఆడుతుంది. చందు రావడం చూసి తన బ్యాగ్ ని సర్దుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ బ్యాగ్ సర్దుతున్నావ్ ఏంటి అని చందు అడుగుతాడు. ఇంట్లో నేను అస్సలు ఉండను. ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు.
శ్రీవల్లి సమాధానం చెప్పకుండా బట్టు సర్దుకుంటూనే ఉంటుంది. నిన్నే అడిగేదీ.. ఏమైందీ అని అంటాడు చందు. ‘నేను మా పుట్టింటికి వెళ్లిపోతున్నా అని అంటుంది. ఏమైందీ.. పుట్టింటికి వెళ్లిపోవడం ఏంటి? ఏమైంది అని అడుగుతాడు చందు. సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంటుంది శ్రీవల్లి. ఇంతలో రామరాజు వచ్చి ఆగమ్మా అని ఆపుతాడు.. అదేంటమ్మా ఎక్కడికి బ్యాగ్ సర్దుకొని వెళ్తున్నావు.. ఏమైంది అని అడుగుతాడు.
Also Read:ఆదివారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్…
మామయ్య గారండీ.. నేను ఇక్కడ ఉండలేనండీ.. ఈ ఇంట్లో ఉండటం నా వల్ల అస్సలు కావడం లేదండీ.. అందుకే మా పుట్టింటికి వెళ్లిపోతా మామయ్య గారండీ పెద్ద ఫిటింగే పెట్టేసింది శ్రీవల్లి. అమ్మా శ్రీవల్లీ ఏం మాట్లాడుతున్నావ్ అమ్మా.. నువ్వు లేకపోతే ఈ ఇంట్లో పుల్లలు ఎవరు పెడతారూ.. కాపురాల్లో చిచ్చులు ఎవరు పెడతారు.. నేను ఇక్కడే ఉంటే అందరికి ఇబ్బంది. నేను వెళ్ళిపోతాను అంటుంది.. ప్రేమ మాత్రం ఏదో ప్లాన్ చేస్తుందని అనుకుంటుంది. వేదవతి కూడా ఏమి మాట్లాడదు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ప్రేమ నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందో చూడాలి. ఏది ఏమైన శ్రీవల్లి అనుకున్నది సాధించింది. ఇక ముందు ఏం జరుగుతుందో చూడాలి..