Intinti Ramayanam Today Episode july 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి నన్ను బండిమీద వచ్చి గుద్దేయాలని చూస్తున్నావా అని అవనిని అడుగుతుంది. అయితే బ్రేక్ ఎందుకు వేస్తాను గుద్దేస్తాను కదా అని అవని అంటుంది. ఇద్దరూ మాటలు యుద్ధం మొదలుపెడతారు. పల్లవి అక్షయ బావ దొరికిపోతే బాగుండు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. నా కస్టమర్ కి టైం అవుతుంది. నేను తీసుకొని వెళ్ళిపోతాను అని అవని అంటుంది. అక్షయ్ కూడా ఇంక పద తొందరగా అమ్మకు దొరికితే మామూలుగా ఉండదు అని అనడంతో అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అక్షయ్ ను అవని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. అక్కడ డాక్టర్ దగ్గర రిపోర్ట్ లు చూపించి టెస్టులు చేపిస్తుంది. అనంతరం డాక్టర్ దగ్గరికి వెళ్లిన వాళ్లకి దాదాపు ఇన్ఫెక్షన్ తగ్గిందని అంటాడు డాక్టర్. ఇలాగా తొందరగా మీరు రికవరీ అవ్వడం మామూలు విషయం కాదు ఇదంతా మీ భార్య చేసిన మేలే సేవలే కారణమని డాక్టర్ చెప్తాడు. చెయ్యి పూర్తిగా తగ్గిపోయింది అంటున్నాడు కదా ఇక బయటికి వెళ్లిపోతే బాగుండు అని అనుకుంటాడు. కాని డాక్టర్ మాత్రం ఇంకొన్ని రోజులు మీరు మెడిటేషన్ తీసుకోవాలి అని అంటాడు. ఇంకొన్ని రోజులు అవని దగ్గరే ఉండాలా అని అక్షయ్ అనుకుంటాడు. పార్క్ లో ప్రణతి, భరత్ లను చూసి షాక్ అవుతుంది పార్వతి. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ప్రోమో విషయానికొస్తే.. పార్క్ లో ప్రణతి, భరత్ లను చూసి పార్వతి రెచ్చిపోతుంది. నా కూతురితో తిరగొద్దని ఎంత చెప్పిన వినవేంటి.. కొంచెం కూడా నీకు సిగ్గు శరం లేదా అని పార్వతి భరత్ ను దారుణంగా తిడుతుంది. భరత్ ఎంత చెప్పినా వినకుండా రెచ్చిపోయి చెంప పగల గొడుతుంది. పల్లవి పదా అత్తయ్య తాను భరత్ ఎలాంటివాడో తెలుసుకుంటుంది మనం వెళ్ళిపోదాం పద అని అంటుంది.. ఇంటికి వచ్చిన భరత్ ని చూసిన అవని ఆ కట్టేంటి ఆ దెబ్బలు ఏంటి అని అడుగుతుంది. ఏమైందో చెప్పరా ఎవరికైనా గొడవపడ్డావా అని ఎంత అడిగినా భరత్ మాత్రం చిన్న యాక్సిడెంట్ అక్క అని లోపలికి వెళ్ళిపోతాడు. ప్రణతిని అవని అడుగుతుంది.. పార్కులో కూర్చొని ఉంటే మా అమ్మ వచ్చి గొడవ చేసింది వదిన అని నిజం చెప్పేస్తుంది.
ఏమైంది అత్తయ్యతో వీడు ఎందుకు గొడవపడ్డాడు అని అడుగుతుంది. మా పాటికి మేము కూర్చున్నాం వదిన అమ్మే వచ్చి పెద్ద రచ్చ చేసింది.. అక్షయ వింటే కచ్చితంగా మళ్ళీ గొడవవుతుంది అని ప్రణతిని పక్కకు తీసుకెళ్లి అవని మాట్లాడుతుంది. మీరెందుకు అత్తయ్య ను రెచ్చగొట్టారు అని టెన్షన్ పడుతుంది.. మిమ్మల్ని కిరాణా షాపుకు వెళ్లి సరుకులు తీసుకురమంటే మీరు పార్క్ కి ఎందుకు వెళ్లారు అని అవని కూడా ప్రణతిని ప్రశ్నిస్తుంది.
ఇక ప్రణతి ఇంతవరకు వచ్చిన తర్వాత నిజం దాచడం కరెక్ట్ కాదు. నేను భరత్ ని ప్రేమిస్తున్నాను వదిన భరత్ అంటే నాకు ఇష్టం అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతుంది. మీరు ఎన్నైనా చెప్పండి వదిన ఒకసారి నేను చేసిన తప్పుని మళ్ళీ చేయను. భరత్ అంటే నాకు చాలా ఇష్టం ఇది మీరు అర్థం చేసుకుంటే మంచిది అని ప్రణతి వెళ్లిపోతుంది. అవని టెన్షన్ పడుతూ ఇది ఎన్ని గొడవలకు కారణం అవుతుందో..? కచ్చితంగా నేనే నా తమ్ముని రెచ్చగొట్టి ప్రణతి నీ ప్రేమించమని చెప్పినట్లు అత్తయ్య అనుకుంటుంది.
Also Read:బాలు మాటతో శృతి మారుతుందా? మీనాకు అడ్డంగా దొరికిపోయిన మనోజ్..
అటు మావయ్య కూడా నా నమ్మకం నీ పోగొట్టావని బాధపడతాడు అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే ఉదయం ఈ విషయాన్ని ఎలాగైనా మావయ్యతో చెప్పాలి అని అవని అనుకుంటున్నారు. మావయ్య గారు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ప్రణతి భరత్లు ఇద్దరు వివరణ ఇష్టపడుతున్నారు మావయ్య అని చెప్పింది. దానికి రాజేంద్రప్రసాద్ ఇష్టపడడం మంచిదే కదా.. నాకు ముందే తెలుసు. ప్రణతిని బాగా చూసుకుంటున్నాడు భరత్.. పెళ్లి గురించి తర్వాత మాట్లాడదాం అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు. అటు పల్లవి పార్వతిని రెచ్చగొడుతూ ప్రణతిని మన ఇంటికి తీసుకోవాలి అని అంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..