Gundeninda GudiGantalu Today episode july 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. సంజూ మాత్రం వాళ్ళింట్లో చాలా సంతోషంగా ఉన్నారు.. ఇంకొకసారి నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తే నేను అస్సలు తట్టుకోలేను మీ ఇంట్లో వాళ్ళు బాధపడాలి అని సంజయ్ అంటాడు. మౌనిక ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అనే సామెత ఎందుకే అంటారు మీరు ఎప్పుడు వేరే వాళ్ళు ఇబ్బంది పడాలని కోరుకోకండి అని అంటుంది.. ఇంకొకసారి నాకు సలహాలిస్తే అస్సలు ఊరుకోను. కచ్చితంగా ఎక్కడపడితే అక్కడ కొడతాను అది చూసి నీ వాళ్ళు బాధపడాలి. మీ నాన్న అనారోగ్యంతో మంచాన పడి చచ్చిపోవాలని అంటాడు. మీనా దగ్గరకు శృతి వస్తుంది. అయితే రోహిణి కూడా వచ్చి నాకు కూడా టీ కావాలని అడుగుతుంది..
వాళ్లంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణి మీనా శృతి ముందు పరువు తీసేసింది అని బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే మీనా మీద రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఎంత పొగరు మీనా కి నన్ను ఇలా శృతి దగ్గర తలదించుకునేలా చేస్తుందని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. మీనా నటింట్లో పువ్వులు కట్టడం చూసిన ప్రభావతి షాక్ అవుతుంది. శృతి మాత్రం ఆ పువ్వుల వాసనకి మైమరిచిపోతుంది. పొద్దున్నే నాకేం అవసరం లేదు నాకు ఇప్పుడే కావాలి ఒక మూరపువ్వులు తీసుకుని ఇవ్వవా అని అడుగుతుంది. ఆ పూలను చేతికి చుట్టుకుని వాసన పీలుస్తూ ఉంటుంది. శృతిని చూసిన ప్రభావతే షాక్ అవుతుంది. ఈ అమ్మాయి స్పీడ్ ఏంటసలు రవి అసలైన అమాయకుడు. ఎలా భరిస్తాడో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది. మీనా సిగ్గుపడుతుంది.
ప్రభావతి శృతి గురించి ఆలోచిస్తూ సత్యంతో మాట్లాడుతూ సిగ్గు పడుతుంది. ఇక కిందకు వచ్చిన బాలు సిగ్గుతో మెలికలు తిరుగుతాడు. మీనాన్ని చూసినా బాలు సిగ్గు పడిపోతూ ఉంటే, మీనా ఏమైందండీ ఈ కొత్తగా ఈ సిగ్గెంటో అని అడుగుతుంది.. మీనా చేతిలోనే మల్లెపూలు కిందపడి మీనా పై పడతాయి. బాలు మీనాల మధ్య రొమాంటిక్ సీను హైలెట్ కానుంది. మీనా పూల కొట్టు వల్ల తన మాట వినట్లేదని ప్రభావతి ఏదో ఒకటి చేసి మీనాని తన గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకుంటుంది. పూల కొట్టు వల్ల తనకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని తెగ బాధ పడిపోతుంది..
ఉదయం లేవగానే నా ఇల్లంతా పూలకంపు చేసేసావు అని ప్రభావతి మీనా పై అరుస్తుంది. పూలంటే పూలవాసన రాకుండా ఇంకా ఎలా ఉంటుందో అత్తయ్య అని నేను అడుగుతుంది. పొద్దున్నే ఏం పని లేదా ఇదే పని నీకు అని ప్రభావతి మీనపై అరుస్తుంది. నేను బయటికి వెళ్లి వస్తాను మీరు వంట చూస్తూ ఉండండి అని చెప్పి నేను బయటకి వెళ్ళిపోతుంది మీనా.. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్ అని ప్రభావతి అడుగుతుంది. పూలు ఆర్డర్ ఇచ్చారు ఒక నలుగురికి పువ్వులు ఇచ్చి రావాలి అని అంటుంది.
అప్పుడే ఇంట్లోకి శృతి వాళ్ళమ్మ శోభ వస్తుంది. మీ కూతుర్ని చూడ్డానికి వచ్చారా అని ప్రభావతి కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఇటు వెళ్తున్నాను ఒకసారి చూసి వెళదామని వచ్చాను అని శోభ అంటుంది. శోభా ప్రభావతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక ఆవిడ పులమ్మాయి అని గట్టిగా అరుస్తుంది. పూలమ్మాయి ఏంటి మీనా అని పిలవాలి గాని అని అడుగుతుంది.. మీనా లేదు బయటికి వెళ్ళింది మళ్లీ రేపు అని అరుస్తుంది. మీన లేకుంటే మీరు ఉన్నారు కదా మీరు ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది. ప్రభావతి అమ్మాయికి అడిగినట్లుగా పూలు ఇస్తుంది.
Also Read: ‘ వీరమల్లు ‘ హిందీలో రిలీజ్ ఎప్పుడంటే..?
శోభ మీరే పువ్వులు కూడా ఇస్తున్నారా అని ఈ 200 తీసుకొని నాకు పువ్వులు ఇవ్వండి అని అడుగుతుంది. శోభ వల్ల తనకు అవమానం జరిగిందని ప్రభావతి ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ మీద వల్ల నాకు అవమానాలు ఎదురవుతున్నాయి అని బాధపడుతూ ఉంటుంది. అక్కడే ఉన్న రోహిణి ఈ పూల కొట్టు నువ్వు తీసేసి ఒక ఐడియా నా దగ్గర ఉంది ఆంటీ అని అంటుంది. ఏంటమ్మా ఐడియా ని ప్రభావతి అడుగుతుంది. కార్పొరేషన్ వల్ల పర్మిషన్ తీసుకోవాలి. వీళ్లు తీసుకోలేదనుకుంటా మనము వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఆ షాప్ ని తీసేస్తారు అని అంటుంది. అది విన్న ప్రభావతి సంతోషపడుతుంది. పూల కొట్టు పోతుంది మీనా నా గుప్పెట్లో ఉంటుంది అని కలలు కంటుంది.. అక్కడితో ప్రోమో పూర్తవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..